Youth kills grand mother | సొంత నానమ్మనే ముక్కలుగా నరికి..-man kills grandmother over property dispute dumps chopped body parts in river ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Youth Kills Grand Mother | సొంత నానమ్మనే ముక్కలుగా నరికి..

Youth kills grand mother | సొంత నానమ్మనే ముక్కలుగా నరికి..

HT Telugu Desk HT Telugu

Youth kills grand mother | ఆస్తి కోసం సొంత నానమ్మనే హత్య చేసి, శవాన్ని ముక్కలు చేశాడో మనవడు. మహారాష్ట్రలోని ముంధ్వా ప్రాంతంలోని కేశవ్ నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.

ప్రతీకాత్మక చిత్రం

Youth kills grand mother | సొంత నానమ్మను హత్య చేసిన నేరానికి గానూ 20 ఏళ్ల యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నానమ్మ పేరు పై ఉన్న ఆస్తి కోసమే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ఆ యువకుడు పోలీసుల విచారణలో అంగీకరించాడు. ఈ హత్యకు తన తండ్రి కూడా సహకరించాడని వెల్లడించాడు.

Youth kills grand mother | ఒకరికి తల్లి.. మరొకరికి నానమ్మ

62 ఏళ్ల ఉష గైక్వాడ్ తన కుమారుడు సందీప్ విఠల్ గైక్వాడ్ , మనవడు సాహిల్ గైక్వాడ్ లతో కలిసి కేశవ నగర్ ప్రాంతంలో ఉంటోంది. వారు ఉంటున్న ఇల్లు ఆమె పేరుపైనే ఉంది. ఆమెకు కొంత బంగారం కూడా ఉంది. కొన్నాళ్లుగా మనవడు సాహిల్ నానమ్మను కొంత డబ్బు అడుగుతున్నాడు. ఆమె నిరాకరిస్తోంది. తల్లితో గొడవ కారణంగానే తన భార్య ఇంట్లో నుంచి వెళ్లిపోయిందన్న కారణంతో కొడుకు సందీప్ కూడా తల్లిపై కోపంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో.. ఆగస్ట్ 5 న ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న ఉష గైక్వాడ్ ను ఆమె మనవడు గొంతు నులిమి చంపేశాడు. అనంతరం బాత్ రూమ్ లోకి తీసుకువెళ్లి, పదునైన కట్టర్ తో శరీరాన్ని ముక్కలు ముక్కలు చేశాడు. వాటిని బ్యాగుల్లో కుక్కి, దగ్గర్లోని నదిలో పడేశాడు. కట్టర్ ను, రక్తంతో తడిచిన గుడ్డలను నది ఒడ్డున పడేశాడు. ఈ నేరంలో కుమారుడికి తండ్రి సందీప్ సహకరించాడు.

Youth kills grand mother | అతి తెలివితో..

అనంతరం, తమపై అనుమానం రాకుండా ఉండడం కోసం, తండ్రీ కొడుకులు ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఉష గైక్వాడ్ కనిపించడం లేదని మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే, ఉష గైక్వాడ్ కూతురు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు తండ్రీ కొడుకులను విచారించి, అసలు విషయాన్ని రాబట్టారు. ఆ ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.