Microsoft lay off story: ‘‘ఉద్యోగం తీసేసినా.. సంస్థపై అభిమానం మాత్రం తగ్గలేదు’’-man fired from microsoft after working for 21 years shares bittersweet post ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Microsoft Lay Off Story: ‘‘ఉద్యోగం తీసేసినా.. సంస్థపై అభిమానం మాత్రం తగ్గలేదు’’

Microsoft lay off story: ‘‘ఉద్యోగం తీసేసినా.. సంస్థపై అభిమానం మాత్రం తగ్గలేదు’’

HT Telugu Desk HT Telugu
Jan 21, 2023 07:58 PM IST

Microsoft ex employee emotional post: టెక్నాలజీ దిగ్గజ కంపెనీలన్నీ ‘లే ఆఫ్ (lay off)’ ల బాట పట్టి దశాబ్దాలుగా కంపెనీతో అనుబంధం పెంచుకున్న ఉద్యోగులను ఇంటికి పంపించేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ (Microsoft)తో 21 ఏళ్ల ఉద్యోగ అనుబంధం ఉన్న ఒక వ్యక్తి పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అయింది. 21 ఏళ్ల అనుబంధాన్ని గుర్తు చేసుకున్న మైక్రోసాఫ్ట్ మాజీ ఉద్యోగి

లింక్డ్ ఇన్ పోస్ట్ లో ప్రశాంత్ షేర్ చేసుకున్న తన మైక్రోసాఫ్ట్ ఐడీ కార్డు
లింక్డ్ ఇన్ పోస్ట్ లో ప్రశాంత్ షేర్ చేసుకున్న తన మైక్రోసాఫ్ట్ ఐడీ కార్డు (LinkedIn/@Prashant Kamani)

Microsoft ex employee emotional post: ప్రశాంత్ కమానీ అనే వ్యక్తికి మైక్రోసాఫ్ట్ ఇటీవల ఉద్యోగం నుంచి తొలగించింది. ఆర్గనైజేషనలర్ రీస్ట్రక్చరింగ్ లో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ప్రశాంత్ కమానీని కూడా ఉద్యోగం నుంచి తొలగించింది.

Microsoft ex employee emotional post: 21 ఏళ్ల అనుబంధం

Microsoft ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు సందేశం అందగానే తన భావోద్వేగాలను ప్రశాంత్ కమానీ (Prashant Kamani) ఒక లింక్డ్ ఇన్ (LinkedIn) పోస్ట్ లో పంచుకున్నారు. అయితే, ఉద్యోగిగా ఇన్నేళ్లు సేవ చేసిన అనంతరం అన్యాయంగా జాబ్ నుంచి తొలగించిన మైక్రోసాఫ్ట్ (Microsoft lay off) పై ఎలాంటి నిందలు వేయకుండా.. ఆ సంస్థతో తన అనుబంధాన్ని మాత్రం ఆయన ఆ (LinkedIn) పోస్ట్ లో పంచుకోవడం విశేషం. కాలేజీ లో కోర్సు పూర్తి కాగానే మైక్రోసాఫ్ట్ లో చేరానని, తన జీవితంలో ఆ సంస్థ, సహోద్యోగులు ఒక భాగంగా మారిపోయారని Prashant Kamani ఆ పోస్ట్ లో వివరించారు. దాదాపు 21 ఏళ్ల ఉద్యోగ జీవితంలో తాను ఎందరి నుంచో ఎన్నో నేర్చుకున్నానని చెప్పారు.

Microsoft ex employee emotional post: వ్యక్తిగత అనుబంధం

మైక్రోసాఫ్ట్ (Microsoft) లో ఉద్యోగం తనకు ఎందరినో మిత్రులను చేసిందని, ఎందరో సహోద్యోగులు తమ వ్యక్తిగత జీవితంలో తనను భాగం చేసుకున్నారని Prashant Kamani వివరించారు. తన వ్యక్తిగత జీవితంలోనూ వారు విడదీయలేని భాగం అయ్యారని వివరించారు. ‘‘ఉద్యోగం (Microsoft lay off) నుంచి తొలగించారన్న విషయం తెలియగానే నాకు మొదట కలిగింది కృతజ్ఞతాభావమే. కాలేజీ జీవితం ముగియగానే ఈ సంస్థలో చేరాను. నా తొలి జాబ్ మైక్రోసాఫ్ట్ (Microsoft) లోనే. భయంభయంగా, నెర్వస్ గా, భవిష్యత్తు ఎలా ఉండబోతోందో అన్న ఆలోచనలతో విదేశీ గడ్డపై అడుగుపెట్టిన రోజు నాకింకా గుర్తుంది. నా ఈ 21 ఏళ్ల (Microsoft job) ప్రయాణంలో ఎందరో తెలివైన, నిపుణులైన సహోద్యోగులతో కలిసి పని చేశాను. వారి నుంచి ఎన్నో నేర్చుకున్నాను. వారిలో ఎందరో నన్ను వారి వ్యక్తిగత జీవితంలోకి ఆహ్వానించారు. వారి వ్యక్తిగత జీవితంలో నన్ను ఒక భాగం చేసుకున్నారు. నా వ్యక్తిగత జీవితంలోని మంచి,చెడులను వారితో పంచుకునే అవకాశం కల్పించారు’’ అని ప్రశాంత్ భావోద్వేగంతో తన అనుభవాలను పంచుకున్నారు. తన జీవితంలో తనకు చేదోడువాదోడుగా నిలిచిన కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. చివరగా తన మైక్రోసాఫ్ట్ (Microsoft) ఐడీ కార్డుని ప్రదర్శించారు.

Microsoft ex employee emotional post: నెటిజన్ల స్పందన

లింక్డ్ఇన్ (LinkedIn) లో ప్రశాంత్ కమానీ పెట్టిన ఈ భావోద్వేగ పోస్ట్ కు భారీ స్పందన లభించింది. ఒక్క రోజులోనే 26 వేలకు పైగా లైక్స్ సాధించింది. నెటిజన్లు చాలామంది ఆయనను పొగుడుతూ కామెంట్స్ పెట్టారు. ‘‘ 21 ఏళ్ల పాటు చేసిన సేవలను పట్టించుకోకుండా ఉద్యోగం నుంచి తొలగించిన సంస్థను ఒక్క మాట కూడా అనని మీ సంస్కారం అద్భుతం’’ అని ఒక LinkedIn నెటిజన్ స్పందించారు. ‘మీరు మాకు స్ఫూర్తినిచ్చారు. ఆల్ ది వెరీ బెస్ట్’ అని మరో LinkedIn నెటిజన్ స్పందించారు. మీ ప్రొఫైల్ షేర్ చేయండి. మీకు సూట్ అయ్యే పోస్ట్ లభించేలా చూస్తాను’ అని మరో లింక్డ్ ఇన్ (LinkedIn) యూజర్ హామీ ఇచ్చారు.

IPL_Entry_Point

టాపిక్