Love story: అలా మొదలై.. ఇలా వైరల్ అయిన లవ్ స్టోరీ-man falls in love while stuck in bengaluru traffic read his love story here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Man Falls In Love While Stuck In Bengaluru Traffic Read His Love Story Here

Love story: అలా మొదలై.. ఇలా వైరల్ అయిన లవ్ స్టోరీ

HT Telugu Desk HT Telugu
Sep 21, 2022 05:10 PM IST

Love story: బెంగళూరు నగరంలో ట్రాఫిక్ జామైంది. ఓ యువకుడు ఆ ట్రాఫిక్ జామ్‌ సమయంలోనే ప్రేమలో పడ్డాడు. ఇప్పుడా లవ్ స్టోరీ ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యింది.

Bengaluru's traffic jams are infamous and citizens find a silver lining every now and then in the form of jokes. (HT PHOTO)
Bengaluru's traffic jams are infamous and citizens find a silver lining every now and then in the form of jokes. (HT PHOTO)

కొన్ని సంవత్సరాల క్రితం బెంగళూరు వీధుల్లో జరిగిన ఒక విభిన్న ప్రేమకథ ఇప్పుడు సోషల్ మీడియా యూజర్ల హృదయాలను హత్తుకుంటోంది.

ఈ ప్రేమకథ బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలో నిత్యం ట్రాఫిక్ జామ్‌లకు ప్రసిద్ధి చెందిన ఎజిపురా ఫ్లైఓవర్ వద్ద ట్రాఫిక్ జామ్ మధ్యలో సిగ్నల్ వద్ద ప్రారంభమైంది.

ఇక్కడి విపరీతమైన ట్రాఫిక్, మౌలిక సదుపాయాల వైఫల్యాల గురించి జోకులు సోషల్ మీడియాలో సాధారణమైనప్పటికీ.. ప్రస్తుతం ఓ ప్రేమకథతో మరింత పాపులర్ అవుతోంది.

అజ్ అనే ట్విట్టర్ యూజర్ రెడిట్‌ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌పై షేర్ అయిన ఓ కథనాన్ని పోస్ట్ చేశారు. ‘ఈరోజు రెడిట్‌లో బాగా పాపులర్ అయిన పోస్టు’ అని చెప్పారు.

MaskedManiac92 అనే యూజర్ రాసిన Reddit పోస్ట్ ఇలా ఉంది. ‘నేను దీనిని మరొక థ్రెడ్‌లో ప్రస్తావించాను. నేను నా భార్యను సోనీ వరల్డ్ సిగ్నల్ దగ్గర కలిశాను. నేను మొత్తం కథనాన్ని అక్కడ రాయలేదు. కానీ సారాంశం ఏమిటంటే.. ఒక రోజు నేను ఆమెను తన ఇంటి వద్ద డ్రాప్ చేసేందుకు (అప్పటికి ఆమె స్నేహితురాలు మాత్రమే) వెళుతున్నా. మేం ఎజిపురా ఫ్లైఓవర్ పని కారణంగా సమీపంలో ఎక్కడో ఇరుక్కుపోయాం.

మాకు చాలా విసుగొచ్చింది. ఆకలితో ఉన్నాం. అందువల్ల దారి మళ్లించి సమీపంలోకి వెళ్లి డిన్నర్ చేశాం. అలా మొదలైన బంధంలో నేను ఆమెతో 3 సంవత్సరాలు డేటింగ్ చేశాను. 2 సంవత్సరాల క్రితం వివాం చేసుకున్నాను. కానీ 2.5 కి.మీ. ఫ్లైఓవర్ ఇంకా నిర్మాణంలో ఉంది..’ అని ఆ పోస్టులో ఉంది.

ట్విట్టర్‌లో షేర్ చేసిన ఈ పోస్ట్‌ వైరల్ అవుతోంది.

ఈ పోస్టు ట్విటర్ యూజర్లను బాగా ఆకట్టుకుంది. వారంతా కామెంట్ల వర్షం కురిపించారు. అస్ఘర్ అనే ఓ యూజర్ ‘ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. బాలీవుడ్ దీనిని బిగ్‌స్క్రీన్‌పైకి ఎక్కించాలి..’ అని కామెంట్ చేశారు.

మౌలిక వసతుల ప్రాజెక్టుల నిర్మాణంలో తీవ్ర జాప్యంపై కూడా యూజర్లు మండిపడ్డారు. తమ అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ‘అవును. దీన్ని ధ్రువీకరించొచ్చు. నా కూతురు క్రైస్ట్ జూనియర్ కాలేజ్‌లో జాయిన్ అయినప్పుడు ఫ్లైఓవర్ వర్క్ ప్రారంభమైంది. ఇప్పుడు ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తయింది. పీజీలో చేరింది. కానీ ఫ్లైఓవర్ మాత్రం ఇప్పటికీ అసంపూర్తిగా ఉంది..’ అని మరొక యూజర్ కామెంట్ చేశారు.

‘వారు ఆ డిన్నర్‌లో ఏం ఆహారం తీసుకుని ఉంటారు..’ అని మరో యూజర్ ఆ ప్రేమ జంట తిండి గురించి కామెంట్ చేశారు.

‘మీకు జీవితం నిమ్మకాయలు ఇస్తే.. వాటితో నిమ్మరసం చేసుకుంటారు. కానీ ఇతను మాత్రం నిజంగా గట్టిగా పిండాడు..’ అని మరొకరు కామెంట్ చేశారు.

IPL_Entry_Point