LIC AAO Recruitment 2023: ఎల్ఐసీలో 300 ఏఏఓ పోస్టులు.. ఇలా అప్లై చేసుకోండి
LIC AAO Recruitment 2023: ఎల్ఐసీ ఏఏఓ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు ప్రక్రియ ఇక్కడ తెలుసుకోండి.
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసీ ఏఏఓ రిక్రూట్మెంట్ 2023 నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రిక్రూట్మెంట్‌లో భాగంగా 300 అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేస్తోంది. అర్హులైన అభ్యర్థులు ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
ట్రెండింగ్ వార్తలు
ఎల్ఐసీ ఏఏఓ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు డైరెక్ట్ లింక్
ఎల్ఐసీ ఏఏఓ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడం ఇలా..
- అభ్యర్థులు ఎల్ఐసీ ఇండియా వెబ్‌సైట్ సందర్శించాలి.
- అక్కడ హోం పేజీలో కెరీర్స్ లింక్ ఉంటుంది. దానిని క్లిక్ చేస్తే మరో పేజీకి తీసుకెళుతుంది.
- అక్కడ ఏఏఓ రిక్రూట్మెంట్ 2023 లింక్‌ను క్లిక్ చేయాలి.
- ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు మరొక పేజీ ఓపెన్ అవుతుంది.
- అక్కడ ఆన్‌లైన్ అప్లికేషన్ నింపాలి. అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించడంతో దరఖాస్తు నింపడం పూర్తవుతుంది.
- భవిష్యత్తు అవసరాల కోసం దరఖాస్తు ఫారం ప్రింట్ తీసిపెట్టుకోండి. లేదా పీడీఎఫ్ రూపంలో సేవల్ చేసి పెట్టుకోండి.
ఎల్ఐసీ ఏఏఓ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ జనవరి 15, 2023న ప్రారంభమైంది. జనవరి 31, 2023 వరకు అందుబాటులో ఉంటుంది. పరీక్ష సమయానికి 10 రోజుల ముందు కాల్ లెటర్ పంపిస్తారు. ఫిబ్రవరి 17, ఫిబ్రవరి 20 తేదీల్లో ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. మరిన్ని వివరాలకు ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్ సందర్శించాలి.
ఎల్ఐసీ ఏఏఓ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు డైరెక్ట్ లింక్
అర్హతలు ఇవే
పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుండి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. వయోపరిమితి 21 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ
అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ల ఎంపిక మూడు అంచెల ప్రక్రియ. ప్రీరిక్రూట్‌మెంట్ మెడికల్ పరీక్ష కూడా ఉంటుంది.