Rainbow IPO | నేడే చివరి రోజు.. అప్లై చేయకపోతే మంచి ఛాన్స్​ మిస్​?-last day for rainbow children s medicare ipo subscription all you need to know ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Last Day For Rainbow Children's Medicare Ipo Subscription, All You Need To Know

Rainbow IPO | నేడే చివరి రోజు.. అప్లై చేయకపోతే మంచి ఛాన్స్​ మిస్​?

HT Telugu Desk HT Telugu
Apr 29, 2022 08:59 AM IST

రెయిన్​బో చిల్డ్రన్​ హాస్పిటల్స్​ ఐపీఓ అప్లే చేసుకునేందుకు శుక్రవారమే చివరి రోజు. మరి ఐపీఓ వివరాలు తెలుసుకోండి.

రెయిన్​బో ఐపీఓకు అప్లై చేయకపోతే.. మంచి ఛాన్స్​ మిస్​?
రెయిన్​బో ఐపీఓకు అప్లై చేయకపోతే.. మంచి ఛాన్స్​ మిస్​? (HT)

Rainbow Children's Medicare IPO | హైదరాబాద్​ ఆధారిత రెయిన్​బో చిల్డ్రన్​ హాస్పిటల్స్​ ఐపీఓకు శుక్రవారమే చివరి రోజు. బుధవారం ఓపెన్​ అయిన ఈ ఐపీఓ.. మొత్తం ఇష్య్యూ సైజుతో పోల్చుకుంటే గురువారం నాటికి 55శాతం మేర సబ్​స్క్రైబ్​ అయ్యింది. రెయిన్​బో ఐపీఓ వివరాలు తెలుసుకుందాము.

ట్రెండింగ్ వార్తలు

రెయిన్​బో హాస్పిటల్స్​ ఐపీఓ వివరాలు..

Rainbow IPO details | కంపెనీ: హైదరాబాద్​లోని ప్రముఖ మల్టీ స్పెషలిటీ పీడియాట్రిక్​, ఒబ్​స్టెట్రిక్స్​ అండ్​ గైనెకాలజీ హాస్పిటల్​

  • ఐపీవో డేట్స్​:- ఏప్రిల్​ 27-29
  • ప్రైజ్​ బ్యాండ్​:- రూ. 516- రూ. 542
  • ఇష్య్యూ: ఆఫర్​ ఫర్​ సేల్​

యాంకర్​ ఇన్​వెస్టర్ల నుంచి ఈ కంపెనీ ఇప్పటికే రూ. 469.55కోట్లను సమీకరించింది.

గ్రే మార్కెట్​ ప్రీమియం ఎంత ఉంది?

Rainbow IPO GMP | గురువారం నాటికి రెయిన్​బో హాస్పిటల్స్​ ఐపీఓ గ్రే మార్కెట్​ ప్రీమియం రూ. 30 వద్ద ఉంది.

ఐపీఓకు వచ్చే కంపెనీల షేర్లు తొలుత గ్రే మార్క్​ట్​లో ట్రేడ్​ అవుతూ ఉంటాయి. దీని బట్టి.. ఐపీఓ లాభాల్లో లిస్ట్​ అవుతుందా? లేక నష్టాల్లో లిస్ట్​ అవుతుందా? అని మార్కెట్​ వర్గాలు అంచనాలు వేసుకుంటాయి. లిస్టింగ్​ లాభాలు, స్వల్పకాలిక పెట్టుబడుల కోసం ఐపీఓలో ఇన్​వెస్ట్​ చేసే ట్రేడర్లు, పెట్టుబడిదారులు ఈ గ్రే మార్కెట్​ ప్రీమియంను ఫాలో అవుతూ ఉంటారు.

గ్రే మార్కెట్​ ప్రిమియం వాల్యూ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఐపీఓకు మంచి డిమాండ్​ లభిస్తే.. లిస్టింగ్​ లాభాలు ఉంటాయి. డిమాండ్​ లేకపోతే నష్టాల్లో లిస్ట్​ అయ్యే అవకాశం ఉంది.

అయితే.. ఓ సంస్థ ఐపీఓకు అప్లై చేయాలా? వద్దా? అని ఆలోచించేందుకు.. గ్రే మార్కెట్​ ప్రీమియంను ప్రామాణికంగా చూడవద్దని మార్కెట్​ విశ్లేషకులు సూచిస్తూ ఉంటారు. కంపెనీ ఫండమెంటల్స్​, పీ అండ్​ ఎల్​ స్టేట్​మెంట్​, బ్యాలెన్స్​ షీట్​. వ్యాపారం వంటివి చూసి ఐపీఓలో ఇన్​వెస్ట్​ చేయాలని చెబుతుంటారు.

సబ్​స్క్రిప్షన్​ వివరాలు..

రెయిన్​బో హాస్పిటల్స్​ ఐపీఓలో రిటైలర్లు అధికంగా పాల్గొన్నట్టు తెలుస్తోంది. రిటైల్​ కోటా 82శాతం సబ్​స్క్రైబ్​ అయినట్టు సమాచారం. ఎన్​ఐఐ, హెచ్​ఎన్​ఐలు కోటా 56శాతం సబ్​స్క్రైబ్​ అయ్యింది.

అప్లై చేయవచ్చా?

"రెయిన్​బో హాస్పిటల్స్​ అధికంగా చిన్నారుల ఆరోగ్యంపైనే దృష్టిపెడుతుంది. ఎఫ్​వై26 నాటికి ఈ రంగం 14శాతం సీఏజీఆర్​తో వృద్ధి చెందుతుంది. హెల్త్​కేర్​లో కన్సొలిడేషన్​ పెరుగుతుండటం కారణంగా ప్రస్తుతం ఉన్న వృద్ధిని నిలకడగా ఉంచడమే రెయిన్​బో హాస్పిటల్స్​కు ముఖ్యం. యునీక్​ మోడల్​, మంచి వాల్యూవేషన్​లో ఐపీఓకు వస్తుండటంతో.. మేము సబ్​స్క్రైబ్​ రేటింగ్​ ఇస్తున్నాము," అని ఐసీఐసీ సెక్యూరిటీస్​ రిసెర్చ్​ అనలిస్ట్​ కుష్​ మెహ్తా పేర్కొన్నారు.

స్వల్పకాలిక లాభాలు, లిస్టింగ్​ డే లాభాల కోసం కాకుండా.. దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం రెయిన్​బో ఐపీఓకు అప్లై చేసుకోవచ్చని సామ్​కో సెక్యూరిటీస్​కు చెందిన ఈక్విటీ రీసెర్చ్​ హెడ్​ యెష్​ షా వెల్లడించారు.

గమనిక: ఇది కేవలం సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​కు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ఐపీఓకు అప్లై చేసే ముందు మీ ఫైనాన్షియల్​ ఎడ్వైజర్లను సంప్రదించడం శ్రేయస్కరం.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్