Karnataka election exit poll 2023: కర్నాటకలో మళ్లీ కింగ్ మేకర్ గా జేడీఎస్?.. ఎగ్జిట్ పోల్స్ చెబుతోంది ఇదేనా..-karnataka assembly election 2023 exit poll results will bjp retain the power or congress wins back the state ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Karnataka Election Exit Poll 2023: కర్నాటకలో మళ్లీ కింగ్ మేకర్ గా జేడీఎస్?.. ఎగ్జిట్ పోల్స్ చెబుతోంది ఇదేనా..

Karnataka election exit poll 2023: కర్నాటకలో మళ్లీ కింగ్ మేకర్ గా జేడీఎస్?.. ఎగ్జిట్ పోల్స్ చెబుతోంది ఇదేనా..

HT Telugu Desk HT Telugu
May 10, 2023 06:49 PM IST

Exit Poll: కర్నాటకలో ఎన్నికల యుద్ధం ముగిసింది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 65.7% పోలింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. ఫలితాల కోసం నిరీక్షణ ప్రారంభమైంది. వివిధ వార్తా సంస్థలు తాము నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను పోలింగ్ పూర్తి కాగానే ప్రకటించడం ప్రారంభించాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Karnataka Exit Poll results: కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. మే 10 సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసింది. ఇప్పటికే పోలింగ్ బూత్ ల వద్ద క్యూల్లో నిల్చున్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. సాయంత్రం 5 గంటల వరకు 65.7% పోలింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. కాగా వివిధ వార్తా సంస్థలు తాము నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను పోలింగ్ పూర్తి కాగానే ప్రకటించాయి. మొత్తం 224 స్థానాల కర్నాటక అసెంబ్లీలో అధికారంలోకి రావడానికి కనీసం 113 సీట్లు గెల్చుకోవాల్సి ఉంటుంది.

Karnataka Exit Poll results: జేడీఎస్ కింగ్ మేకర్

224 స్థానాల కర్నాటక అసెంబ్లీలో అధికారంలోకి రావడానికి కనీసం 113 సీట్లు గెల్చుకోవాలి. అయితే, జీ న్యూస్ తదితర కొన్ని ఎగ్జిట్ పోల్స్ ను మినహాయిస్తే.. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ కు లేదా బీజేపీకి ఆ పూర్తి మెజారిటీ వస్తుందని తేల్చలేదు. కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచే అవకాశముందని తేల్చాయి. మెజారిటీకి కొద్ది సీట్ల దూరంలో నిలిచిన కాంగ్రెస్ కు జేడీఎస్ మద్ధతు ఇస్తుందా? అన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.

Karnataka Exit Poll results: ఎగ్జిట్ పోల్స్ ఫలితాలెలా ఉన్నాయి?

  • రిపబ్లిక్ టీవీ, పీ మార్క్ సర్వే ప్రకారం ఈ ఎన్నికల్లో బీజేపీ 85 నుంచి 100 స్థానాలు, కాంగ్రెస్ 94 నుంచి 108 సీట్లు గెల్చుకుంటుంది. జేడీఎస్ 24 నుంచి 32 సీట్లు గెల్చుకుంటుంది.
  • టీవీ 9, భరత్ వర్ష సర్వే ప్రకారం.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 99 నుంచి 109 సీట్లు, బీజేపీ 88 నుంచి 98 సీట్లు గెల్చుకుంటాయి. జేడీఎస్ 21 నుంచి 26 సీట్లు గెల్చుకునే అవకాశం ఉంది.
  • జీ న్యూస్ సర్వే ప్రకారం ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 103 నుంచి 118 స్థానాలు గెల్చుకుని అధికారంలోకి వస్తుంది. బీజేపీ 79 నుంచి 84 స్థానాల్లో గెలుస్తుంది. జేడీఎస్ కు 25 నుంచి 33 సీట్లు వస్తాయి.
  • ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని పీపుల్స్ పల్స్ సర్వే తేల్చింది. పీపుల్స్‌పల్స్‌ ఎగ్జిట్‌ పోల్‌ సర్వే ప్రకారం కాంగ్రెస్‌ పార్టీకి 107-119, బిజెపికి 78-90, జేడీ(ఎస్‌)కు 23-29, ఇతరులకు 1-3 సీట్లు వస్తాయి.
  • టీవీ9 కన్నడ-సీ ఓటర్ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం ఈ ఎన్నికల్లో బీజేపీకి 83 నుంచి 95 సీట్లు వస్తాయి. కాంగ్రెస్ 100 నుంచి 112 సీట్లు గెల్చుకుని అతి పెద్ద పార్టీగా నిలుస్తుంది. జేడీఎస్ 21 నుంచి 29 వరకు స్థానాల్లో విజయం సాధించే అవకాశముంది. ఇతరులు 2 నుంచి 6 సీట్ల వరకు గెల్చుకోవచ్చు.
  • ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా సర్వే ప్రకారం .. ప్రాంతాల వారీగా చూస్తే కోస్టల్ కర్నాటకలోని మొత్తం 19 సీట్లలో 16 బీజేపీ గెల్చుకుంటుంది. 03 స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుంది. అలాగే, సెంట్రల్ కర్నాటకలోని మొత్తం 23 సీట్లలో 12 కాంగ్రెస్ గెల్చుకుంటుంది. 10 స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుంది. జేడీఎస్ ఒక స్థానంలో గెలుస్తుంది. బెంగళూరు ప్రాంతంలోని 28 సీట్లలో 17 కాంగ్రెస్, 10 బీజేపీ, 1 జేడీఎస్ గెలుస్తుంది.
  • కర్నాటక - హైదరాబాద్ ప్రాంతంలో కాంగ్రెస్ భారీ విజయం సాధిస్తుందని ఇండియాటుడే యాక్సిస్ మై ఇండియా సర్వే తేల్చింది. ఈ ప్రాంతంలోని మొత్తం 40 సీట్లలో 32 సీట్లను కాంగ్రెస్ గెల్చుకుంటుంది. 7 స్థానాల్లో బీజేపీ, 1 స్థానంలో జేడీఎస్ విజయం సాధిస్తుంది.
  • ముంబై - కర్నాటక (Mumbai Karnataka region) ప్రాంతంలో ఈ ఎన్నికల్లో చాలా కాలం తరువాత కాంగ్రెస్ బీజేపీ కన్నా ఎక్కువ సీట్లు గెల్చుకుంటుందని ఇండియాటుడే యాక్సిస్ మై ఇండియా సర్వే తేల్చింది. ఈ ప్రాంతంలోని మొత్తం 50 సీట్లలో 28 సీట్లను కాంగ్రెస్ గెల్చుకుంటుంది. 21 స్థానాల్లో బీజేపీ, 1 స్థానంలో జేడీఎస్ విజయం సాధిస్తుంది.
  • 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కర్నాటక ఓటర్లు ఇలా మిశ్రమ తీర్పును ఇచ్చారు. బీజేపీకి అతి పెద్ద పార్టీ హోదా కట్టబెట్టారు. ఆ ఎన్నికల్లో బీజేపీ 104 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. కాంగ్రెస్ 80, జేడీఎస్ 37 సీట్లు గెల్చుకున్నాయి. బీజేపీ తరఫున యెడియూరప్ప సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ మెజారిటీ సాధించడంలో విఫలమై రాజీనామా చేశారు. అనంతరం, కాంగ్రెస్, జేడీఎస్ లు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. జేడీఎస్ నేత కుమారస్వామి సీఎం అయ్యారు. కానీ ఆ ప్రభుత్వం కూడా ఎక్కువ కాలం నిలబడలేదు. 14 నెలల తరువాత జేడీఎస్, కాంగ్రెస్ ల నుంచి పలువురు ఎమ్మెల్యేలు బీజేపీ వైపు వెళ్లడంతో కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలింది. బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చింది.
  • ఇండియా టుడే - యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ అంచనా ప్రకారం ఓల్డ్ మైసూర్ ప్రాంతంలో కాంగ్రెస్ అనూహ్య విజయాలు సాధిస్తుంది. ఈ ప్రాంతంలోని మొత్తం 64 సీట్లలో 36 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుంది. కేవలం 6 స్థానాల్లో బీజేపీ గెలుస్తుంది. జేడీఎస్ 18 సీట్లు గెల్చుకుంటుంది. ఇతరులు మూడు సీట్లలో విజయం సాధిస్తారు.
  • కర్నాటకలో కాంగ్రెస్ దే విజయమని ఇండియా టుడే - యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ తేల్చింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ సంపూర్ణ మెజారిటీ సాధిస్తుందని అంచనా వేసింది. ఇండియా టుడే - యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ అంచనా ప్రకారం కర్నాటకలో కాంగ్రెస్ 122 నుంచి 140 స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వస్తుంది. బీజేపీ 62 నుంచి 80 సీట్లకు పరిమితమవుతుంది. జేడీఎస్ కు 20 నుంచి 25 సీట్లు వస్తాయి. ఇతరులు 3 సీట్లు గెల్చుకోవచ్చు. 224 స్థానాల కర్నాటక అసెంబ్లీలో అధికారంలోకి రావడానికి కనీసం 113 సీట్లు గెల్చుకోవాలి.

IPL_Entry_Point