Whose is that empty chair?: ఆ ఖాళీ కుర్చీ ఎవరి కోసం..?-journalists no to headscarf makes iran president cancel interview ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
Telugu News  /  National International  /  Journalist's 'No' To Headscarf Makes Iran President Cancel Interview

Whose is that empty chair?: ఆ ఖాళీ కుర్చీ ఎవరి కోసం..?

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రాయిసీతో ఇంటర్వ్యూకి సిద్ధమైన జర్నలిస్ట్ క్రిస్టియేన్ అమన్పోర్
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రాయిసీతో ఇంటర్వ్యూకి సిద్ధమైన జర్నలిస్ట్ క్రిస్టియేన్ అమన్పోర్

Whose is that empty chair?: కింద కనిపిస్తున్న ఫొటోలో ఒక కుర్చీలో కూర్చుని ఉన్నది సీనియర్ ఇంటర్నేషనల్ జర్నలిస్ట్, ప్రముఖ వార్తా సంస్థ సీఎన్ఎన్ ప్రతినిధి క్రిస్టియేన్ అమన్పోర్. మరి ఆ ఖాళీ కుర్చీ ఎవరి కోసం?

Whose is that empty chair?: ఇరాన్లో హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. సంప్రదాయ వస్త్రధారణ విషయంలో కచ్చితంగా వ్యవహరిస్తున్న మొరాలిటీ పోలీసుల తీరుపై దేశంలోని మహిళలు, యువతలు మండిపడ్తున్నారు. తమ వస్త్రధారణపై ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షలను తీవ్రంగా నిరసిస్తున్నారు. దీనిపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున హింసాత్మక నిరసనలు కొనసాగుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Whose is that empty chair?: ఇంటర్వ్యూకి నో చెప్పిన ఇరాన్ అధ్యక్షుడు

ఐక్య రాజ్య సమితి సమావేశాల్లో పాల్గొనడానికి ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రాయిసీ అమెరికా వెళ్లారు. అక్కడ న్యూయార్క్ లో సీఎన్ఎన్ ప్రతినిధి కి ఆయన ఇంటర్వ్యూ కన్ఫర్మ్ అయింది. బుధవారం ఉదయం ఆయనను ఇంటర్వ్యూ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ క్రిస్టియేన్ అమన్పోర్ వెళ్లారు. ఇంటర్వ్యూకి అంతా సిద్ధమైంది. ఈ లోపు అధ్యక్షుడు రాయిసీ సిబ్బందిలో ఒకరు క్రిస్టియేన్ అమన్పోర్ వద్దకు వచ్చి హిజాబ్ ధరించాలని, లేదా తలను, జుట్టును కప్పుకోవాలని సూచించారు. అందుకు ఆమె సున్నితంగా నిరాకరించారు. గతంలో చాలామంది ఇరాన్ అధ్యక్షులను ఇంటర్వ్యూ చేశానని, ఇలాంటి కండిషన్ ఎప్పుడూ లేదని ఆమె వారికి గుర్తు చేశారు. అదీకాకుండా, ఈ ఇంటర్వ్యూ జరుగుతోంది ఇరాన్ లో కాదని, అమెరికాలో అలాంటి నిబంధనలేవీ లేవని వారికి వివరించారు. అయితే, హిజాబ్ ధరిస్తేనే అధ్యక్షుడు ఇంటర్వ్యూ ఇస్తారని ఆమెకు వారు స్పష్టం చేశారు. ఇరాన్ ల ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఆమె హిజాబ్ ధరించక తప్పదని, ఈ విషయంలో అధ్యక్షుడు కచ్చితంగా ఉన్నారని వారు ఆమెకు తెలిపారు. దాంతో, ఆమె ఆ ఇంటర్వ్యూను కేన్సిల్ చేసుకున్నారు. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అలా ఆ ఖాళీ కుర్చీలో కూర్చొని ఇంటర్వ్యూ ఇవ్వాల్సిన వ్యక్తి ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రాయిసీ. ఈ ఫొటోను జర్నలిస్ట్ క్రిస్టియేన్ అమన్పోర్ తన ట్విటర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు.

WhatsApp channel