'బేబీ బెర్త్​'.. పసిబిడ్డల కోసం భారతీయ రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు!-indian railway introduces baby berth details below ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Indian Railway Introduces 'Baby Berth', Details Below

'బేబీ బెర్త్​'.. పసిబిడ్డల కోసం భారతీయ రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు!

HT Telugu Desk HT Telugu
May 10, 2022 11:14 AM IST

రైలు ప్రయాణాల్లో తల్లులు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. చిన్న పిల్లలతో కలిసి బెర్త్​లో పడుకోవాల్సి వస్తుంది. దీనికి చెక్​ పెట్టి, తల్లులు మరింత సౌకర్యంగా ప్రయాణించేందుకు 'బేబీ బేర్త్​'ను ప్రయోగించింది భారతీయ రైల్వే. ఆ వివరాలు..

బేబీ బెర్త్​.. సూపర్​ ఐడియా!
బేబీ బెర్త్​.. సూపర్​ ఐడియా! (twitter)

Baby berth Indian railway | పసిబిడ్డలు, చిన్న పిల్లలతో ప్రయాణం అంత సులభం కాదు. ముఖ్యంగా రైళ్లల్లో తల్లుల పక్కనే వారు పడుకోవాల్సి వస్తుంది. ఫలితంగా తల్లులు ప్రయాణం మొత్తం మీద తీవ్ర ఇబ్బందులు పడుతూనే ఉంటారు. తాజాగా.. ఈ సమస్యకు చెక్​ పెట్టేందుకు భారతీయ రైల్వే ఓ వినూత్న ఆలోచనను అమలుచేసింది. లోయర్​ బెర్త్​ పక్కనే ఓ 'బేబీ బెర్త్​'ను ఏర్పాటు చేసింది.

'వాట్​ ఆన్​ ఐడియా సర్జీ..'

ప్రయాణికుల సౌకర్యం కోసమే ఈ ప్రత్యేక బెర్త్​ను తీసుకొచ్చింది భారతీయ రైల్వేకు చెందిన లక్నో డివిజన్​(నార్త్​ జోన్)​. దీనిని బేబీ బెర్త్​గా పిలుస్తున్నారు. ఏర్పాట్లను చూస్తే.. చిన్న పిల్లలు కిందకి పడిపోతారేమో అన్న భయం కూడా ఉండదు. భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తూ.. బేబీ బెర్త్​కు స్టాపర్​లను ఫిక్స్​ చేశారు.

"లక్నో మెయిల్​ 194129లోని బీ4 కోచ్​లో 12,60లో బేబీ బెర్త్​ను ఏర్పాటు చేశాము. తల్లులు తమ పిల్లలను బేబీ బెర్త్​లో పెట్టుకోవచ్చు. ప్రయాణం వేళ వారికి సౌకర్యంగా ఉంటుంది. అవసరం లేనప్పుడు.. ఆ బేబీ బెర్త్​ను ఫోల్డ్​ కూడా చేసుకోవచ్చు," అని నార్త్​ జోన్​లోని లక్నో డివిజన్​కు చెందిన డీఆర్​ఎం ట్వీట్​ చేశారు.

ఫోల్డ్​ చేయడంతో పాటు.. బేబీ బెర్త్​ హైట్​ను కూడా ప్రయాణికులకు అనుగుణంగా మార్చుకోవచ్చు! లోయర్​ సీట్లకు మాత్రమే ఈ బేబీ బెర్త్​ ఉంటుంది.

ప్రస్తుతం ప్రయోగంలో భాగంగా ఒక కోచ్​కే ఈ బేబీ బెర్త్​ను జోడించారు. ప్రయాణికుల ఫీడ్​బ్యాక్​ తీసుకుని, ప్రయోగం సక్సెస్​ అయితే.. మరిన్ని కోచ్​లలో ఈ బేబీ బెర్త్​లను ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్