India successfully tests Agni-3: అగ్ని 3 ప్రయోగం విజయవంతం-india successfully tests intermediate range ballistic missile agni3 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  India Successfully Tests Intermediate-range Ballistic Missile Agni-3

India successfully tests Agni-3: అగ్ని 3 ప్రయోగం విజయవంతం

HT Telugu Desk HT Telugu
Nov 23, 2022 11:09 PM IST

India successfully tests Agni-3 missile: స్ట్రాటెజిక్ ఫోర్సెస్ కమాండ్ సాధారణ విధుల్లో భాగంగా బుధవారం ఇంటర్మీడియెట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి ‘అగ్ని 3’ని విజయవంతంగా ప్రయోగించింది.

అగ్ని 3 క్షిపణి
అగ్ని 3 క్షిపణి (HT File Photo)

India successfully tests Agni-3: ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కలాం ఐలండ్ నుంచి మధ్యంతర రేేంజ్ బాలిస్టిక్ క్షిపణి ‘అగ్ని 3’ ని బుధవారం ప్రయోగించారు. ఎంపిక చేసిన లక్ష్యాన్ని క్షిపణి విజయవంతంగా చేధించింది.

ట్రెండింగ్ వార్తలు

India successfully tests Agni-3: రక్షణ శాఖ ప్రకటన

‘అగ్ని 3’ క్షిపణి ప్రయోగం విజయవంతమైందని రక్షణ శాఖ బుధవారం ప్రకటించింది. ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కలాం ఐలండ్ నుంచి మధ్యంతర రేేంజ్ బాలిస్టిక్ క్షిపణి ‘అగ్ని 3’ ని విజయవంతంగా ప్రయోగించినట్లు వెల్లడించింది. స్ట్రాటెజిక్ ఫోర్సెస్ కమాండ్ సాధారణ విధుల్లో క్షిపణి ప్రయోగ శిక్షణలో భాగంగా ఈ ప్రయోగం నిర్వహించినట్లు వెల్లడించింది.

India successfully tests Agni-3: ‘అగ్ని 3’

అగ్ని క్షిపణి సిరీస్ లో ‘అగ్ని 3’ మూడవది. అగ్ని 3 ని మొదట 2006 జులైలో ప్రయోగించారు. కానీ ఆ ప్రయోగం విఫలమైంది. క్షిపణి లక్ష్యాన్ని చేధించకుండానే, ఒడిశా తీరంలో సముద్రంలో పడిపోయింది. ఆ తరువాత 2007లో తొలిసారి అగ్ని 3న విజయవంతంగా ప్రయోగించారు. అనంతరం, మూడోసారి 2008లోనూ విజయవంతంగా ప్రయోగించారు. అగ్ని 3 అణు వార్ హెడ్ ను మోసుకువెళ్లగలదు. అలాగే, 3500 కిమీల దూరంలోని లక్ష్యాన్ని చేధించగలదు.

IPL_Entry_Point