‘అమరనాథుడు ఇక్కడ.. శారదా శక్తి అక్కడ ఎలా ఉంటారు? పీఓకే మనదే’
మరికొన్ని రోజుల్లో జరగనున్న 23వ కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా.. అమర సైనికుల ప్రాణత్యాగాలను గుర్తుచేస్తున్నారు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్. ఈ సందర్భంగా పీఓకేపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పీఓకే.. భారత దేశంలో భాగమేనని పునరుద్ఘాటించారు.
పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే).. భారత దేశంలో ఒక భాగమని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. 'అమర్‌నాథుడు ఇక్కడ, మాతా శారదా శక్తి అక్కడ(పీఓకే) ఉండటం ఎలా సాధ్యం?,' అంటూ వ్యాఖ్యానించారు.
మరికొన్ని రోజుల్లో జరగనున్న 23వ కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా.. జమ్ములో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు రాజ్‌నాథ్ సింగ్. ఈ క్రమంలోనే పీఓకేపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
"పీఓకే పార్లమెంట్లో ఓ తీర్మానం చేశారు. అప్పుడు, ఇప్పుడు, ఎల్లప్పుడు.. పీఓకే అనేది భారత దేశంలో ఓ భాగమేనని ఆ తీర్మానంలో ఉంది. శివుడి రూపంలో ఉన్న బాబా అమర్నాథ్ ఇక్కడ, మాతా శారదా శక్తి- పీఓకేలో ఎలా ఉంటారు?," అని అన్నారు. పీఓకేలోని శరదా పీఠాన్ని ప్రస్తావిస్తూ.. ఈ మేరకు వ్యాఖ్యానించారు రాజ్‌నాథ్ సింగ్.
ఈ క్రమంలో.. కార్గిల్ యుద్ధంలో అమరులైన సైనికుల ప్రాణత్యాగాన్ని గుర్తుచేస్తున్నారు రక్షణమంత్రి. వారి కుటుంబసభ్యులను కలిశారు.
"దేశ సేవ కోసం ప్రాణత్యాగం చేసిన సైనికులను ఎప్పటికి మర్చిపోను. ప్రాణత్యాగానికి మన సైన్యం ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. 1999 యుద్ధంలో మన సైనికులెందరో ప్రాణాలు విడిచారు. వారందరికి నా నమస్కారాలు," అని రాజ్‌నాథ్ అన్నారు.
1998 శీతాకాలంలో కశ్మీర్లోకి కొందరు పాకిస్థానీలు చొరబడ్డారు. నియంత్రణ రేఖ వెంబడి ఎన్‌హెచ్ 1ఏ కార్గిల్ డ్రాస్- బతాలిక్ సెక్టార్‌లోకి ప్రవేశించారు. హైవేపై సైనిక కదలికలను నియంత్రించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో యుద్ధం మొదలైంది. 1999 మే 8- జులై 26 వరకు కార్గిల్ యుద్ధం జరిగింది. ఆ సమయంలో ప్రతికూల వాతావరణాన్ని తట్టుకుని, వీరోచితంగా పోరాడారు భారత సైనికులు. భారత దేశానికి విజయాన్ని అందించారు.
సైనికుల ధైర్యసాహసాలకు చిహ్నంగా ప్రతి యేటా జులై 26న దేశం.. కార్గిల్ విజయ్ దివాస్‌ను జరుపుకుంటోంది.
సంబంధిత కథనం
టాపిక్