Bhagoria Mela Shocker | హోలీ వేడుకలు.. ఒంటరి యువతిపై పలువురి వికృత చేష్టలు-group of men were seen molested a lone young woman during bhagoria mela in mp ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bhagoria Mela Shocker | హోలీ వేడుకలు.. ఒంటరి యువతిపై పలువురి వికృత చేష్టలు

Bhagoria Mela Shocker | హోలీ వేడుకలు.. ఒంటరి యువతిపై పలువురి వికృత చేష్టలు

HT Telugu Desk HT Telugu
Mar 14, 2022 01:41 PM IST

మనిషిలోని కామం, ఇతర వికృత కోరికలు దహించి మానసిక చిత్తంతో ఉండాలని కామదహనం, చెడుపై మంచి విజయానికి చిహ్నంగా హోలీ పండగ జరుపుకుంటారు. అయినాసరే కామాంధుల ఆగడాలు ఆగడం లేదు. రోడ్డుపై వెళ్తున్న ఓ ఒంటరి యువతిపై పట్టపగలే అందరూ చూస్తుండగా అసభ్యంగా ప్రవర్తించారు.

Group of men were seen molested a lone young woman during Bhagoria mela in MP
Group of men were seen molested a lone young woman during Bhagoria mela in MP (twitter)

Raipur | ఈరోజు సోమవారం ధాత్రి ఏకాదశి- రంగ్ భరీ ఏకాదశి పురస్కరించుకొని దేశవ్యాప్తంగా చాలా చోట్ల హోళీ (హోలీ) వేడుకలు ప్రారంభమైనాయి. నేటి నుంచి వారం రోజుల పాటు ఈ వేడుకలు కొనసాగుతాయి. శ్రీకృష్ణుడి ఏలిన నగరం మధురలో హోళీ వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతాయి. అక్కడైతే నెలరోజుల ముందే ఈ వేడుకలు ప్రారంభమైనాయి.

అయితే ఈ వేడుకలను అదనుగా చేసుకొని పోకిరీలు వికృత చేష్టలకు పాల్పడటం ప్రతీసారి పరిపాటిగా మారుతోంది. ఈక్రమంలో ఇలాంటి ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో మార్చిలో హోళీకి 7 రోజుల ముందు భగోరియా ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఇదొక గిరిజన ఉత్సవం. ఇందులో భాగంగా హోళీకి కావాల్సినవి సమకూర్చుకుంటూ డప్పు వాయిద్యాల మధ్య ఊరేగింపుగా వెళ్లడం అనవాయితీ.

ఈ క్రమంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అలీరాజ్‌పూర్ జిల్లాలో ఒక ఆకతాయి గుంపు ఓ ఒంటరి యువతిని లక్ష్యంగా చేసుకొని వికృత చేష్టలకు పాల్పడ్డారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న యువతిని ఒక వ్యక్తి గట్టిగా పట్టుకుని బలవంతంగా ఆమె శరీరభాగాలను తడుముతూ ముద్దులు పెట్టే ప్రయత్నం చేశాడు. ఈ షాక్ నుంచి బాధితురాలు  తేరుకునేలోపే ఆమె ఒక పెద్ద గుంపులో చిక్కుకుంది. దీంతో ఆమెపై చాలా మంది వ్యక్తులు సభ్యసమాజం తలదించుకునేలా వికృతచేష్టలకు పాల్పడ్డారు. పట్టపగలు, మిట్టమధ్యాహ్నం సమయంలో అందరూ చూస్తుండగా ఇలాంటి దారుణ ఘటన ఒకటి చోటుచేసుకోవడం ఇప్పుడు షాక్ కు గురిచేస్తుంది.

ఈ ఘటన మార్చి 11, 2022న జరిగినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఒక వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో అది వైరల్‌గా మారింది. ఈ వీడియో ఫుటేజ్ ఆధారంగా పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకొని వారిపై వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్‌‌‌లు నమోదు చేశారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం