Kala Chashma trend: మళ్లీ సోషల్ మీడియా ను ఊపేస్తున్న ‘కాలా చష్మా’ ట్రెండ్…-group of girls takes kala chashma trend to another level video wows netizens
Telugu News  /  National International  /  Group Of Girls Takes Kala Chashma Trend To Another Level, Video Wows Netizens
కాలా చష్మా సాంగ్ కు డ్యాన్స్ చేస్తున్న పిల్లలు
కాలా చష్మా సాంగ్ కు డ్యాన్స్ చేస్తున్న పిల్లలు (Instagram/@thequickstyle)

Kala Chashma trend: మళ్లీ సోషల్ మీడియా ను ఊపేస్తున్న ‘కాలా చష్మా’ ట్రెండ్…

04 October 2022, 20:26 ISTHT Telugu Desk
04 October 2022, 20:26 IST

Kala Chashma trend: కొన్నాళ్ల క్రితం పెప్పీ డాన్స్ మూవ్స్ తో ఇంటర్నెట్ ను షేక్ చేసిన ‘కాలా చష్మా’ ట్రెండ్ మళ్లీ మొదలైంది. ఆఫ్రికా టు నైజీరియా టు నేపాల్.. వరల్డ్ వైడ్ గా ఇప్పుడిదే ఫైరింగ్ ట్రెండ్..

Kala Chashma trend: బాలీవుడ్ ఫేమస్ ట్యూన్ ‘కాలా చష్మా’ ఇప్పుడు ప్రపంచాన్ని ‘షేక్’ చేస్తోంది. సంగీతానికి ఎల్లలు లేవని మరోసారి రుజువు చేస్తోంది. మాస్ టు క్లాస్.. ఆఫ్రికా టు ఆస్ట్రేలియా.. యూత్ టు ఓల్.. ఇప్పుడు అందరిదీ ఒకే పాట.. ‘కాలా చష్మా’.

Kala Chashma trend: కాలా చష్మా..

2016లో వచ్చిన సినిమా బార్ బార్ దేఖో. ఈ సినిమాలోని హిట్ సాంగ్ కాలా చష్మా. దీన్ని పాడింది అమర్ అర్షి. సినిమాలో ఈ పాటను కత్రీనా కైఫ్, సిద్ధార్థ్ మల్హోత్రాపై చిత్రీకరించారు. కానీ, నార్వే కు చెందిన డాన్స్ గ్రూప్ ‘క్విక్ స్టైల్’ ఈ ట్యూన్ ను ఒక వెడింగ్ షో లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేయడం, అది ఇంటర్నెట్ లో వైరల్ కావడం, కొన్ని గంటల్లోనే మిలియన్లలో వ్యూయర్ షిప్ సంపాదించడం జరిగిపోయింది. ఆ తరువాత కొన్నాళ్లు కొంత స్తబ్దుగా ఉంది.

Kala Chashma trend: ఇప్పుడు మళ్లీ..

అదే డాన్స్ గ్రూప్ మళ్లీ ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కొంత మంది అమ్మాయిలు ఆ పెప్పీ ట్రాక్ కు ట్రెండీ మూవ్స్ ఇచ్చిన ఆ వీడియో ఇన్ స్టాలో గంటలోపే 2.3 మిలియన్ పైగా వ్యూస్ ను సంపాదించింది. దాంతో, మళ్లీ ఇప్పుడు కాలా చష్మా ట్రెండ్ ఊపందుకుంది. గుంపులు, గుంపులుగా అమ్మాయిలు ఇప్పుడు ఈ ట్యూన్ కు డ్యాన్స్ లు చేసి, కుప్పలు, కుప్పలుగా వీడియోలను అప్ లోడ్ చేస్తున్నారు. మీరు కూడా ఈ వీడియోలను చూడాలనుకుంటున్నారా? జస్ట్, కాలా చష్మా అని గూగుల్ లో సెర్చ్ చేయండి..