Google Chrome | గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌తో జాగ్రత్త.. కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక-google chrome vulnerabilities may cause cyber attacks warns central government ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Google Chrome Vulnerabilities May Cause Cyber Attacks Warns Central Government

Google Chrome | గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌తో జాగ్రత్త.. కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక

HT Telugu Desk HT Telugu
Feb 08, 2022 02:09 PM IST

గూగుల్‌ క్రోమ్‌ ఇంటర్నెట్‌ బ్రౌజర్‌ వాడే వారికి కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. ఇందులో ఉన్న లోపాల కారణంగా సైబర్‌ దాడులకు గురయ్యే ప్రమాదం ఉన్నదని ప్రభుత్వం చెబుతోంది.

మీరూ గూగుల్ క్రోమ్ వాడుతుంటే వెంటనే బ్రౌజర్ అప్ డేట్ చేసుకోండి
మీరూ గూగుల్ క్రోమ్ వాడుతుంటే వెంటనే బ్రౌజర్ అప్ డేట్ చేసుకోండి (AP)

న్యూఢిల్లీ: ఈ మధ్య ఇంటర్నెట్‌ బ్రౌజింగ్ కోసం ఎక్కువ మంది ఉపయోగిస్తున్న బ్రౌజర్‌ గూగుల్‌ క్రోమ్‌. అయితే ఇందులో ఉన్న కొన్ని బగ్స్ కారణంగా దీనిని వాడుతున్న వాళ్లు సైబర్‌ దాడులకు లక్ష్యంగా మారే ప్రమాదం ఉన్నదని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీకి చెందిన ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ ఆన్‌లైన్‌లో హెచ్చరించింది. 

ఈ మేరకు ఒక అడ్వైజరీని రిలీజ్‌ చేసింది. వెంటనే క్రోమ్‌ బ్రౌజర్‌ను అప్‌డేట్‌ చేసుకోండని కూడా సూచించింది. లేదంటే హ్యాకర్లు ఏదో ఒక కోడ్‌ ద్వారా దాడి చేసే ప్రమాదం ఉన్నదని స్పష్టం చేసింది. క్రోమ్‌ 98లోని బగ్స్‌ను ఈ నెల మొదట్లోనే గూగుల్‌ ఫిక్స్‌ చేసింది. 

గూగుల్‌ క్రోమ్‌ వెర్షన్‌ 98.0.4758.80 కంటే ముందుది వాడుతున్న వాళ్లపై ఈ సైబర్‌ దాడులు జరిగే ప్రమాదం ఎక్కువగా ఉందని సీఈఆర్టీ తెలిపింది. ఈ మధ్యే విండోస్, మ్యాక్‌ఓఎస్‌, లైనక్స్‌ యూజర్ల కోసం క్రోమ్‌ 98 రిలీజ్‌ చేసినట్లు గూగుల్‌ ప్రకటించింది. ఈ అప్‌డేట్‌లో మొత్తం 27 బగ్స్‌ను ఫిక్స్‌ చేసింది. మెజార్టీ యూజర్లు తమ క్రోమ్‌ బ్రౌజర్‌ను అప్‌డేట్‌ చేసుకునేంత వరకూ ఈ బగ్స్‌ వివరాలు, లింకులను పరిమితం చేస్తున్నట్లు గూగుల్‌ చెప్పింది. 

సాధారణంగా గూగుల్‌ క్రోమ్‌లో ఆటోమేటిగ్గా బ్యాక్‌గ్రౌండ్‌లోనే అప్‌డేట్స్‌ జరిగిపోతూ ఉంటాయి. లేదంటే క్రోమ్‌లోకి వెళ్లి అబౌట్‌ గూగుల్‌ క్రోమ్‌లో లేటెస్ట్‌ వెర్షన్‌కు అప్‌డేట్‌ చేసుకోవచ్చు. ఒకసారి అప్‌డేట్‌ డౌన్‌లోడ్‌ అయిన తర్వాత బ్రౌజర్‌ను రీలాంచ్‌ చేస్తేనే లేటెస్ట్‌ వెర్షన్ పూర్తిగా ఇన్‌స్టాల్‌ అవుతుంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం