Exit polls 2023 : ఎగ్జిట్​ పోల్స్​ ఔట్​.. త్రిపురలో కాషాయ జెండా రెపరెపలు పక్కా!-exit polls 2023 bjp to win big in tripura nagaland meghalaya is tough catch live updates here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Exit Polls 2023 Bjp To Win Big In Tripura Nagaland, Meghalaya Is Tough, Catch Live Updates Here

Exit polls 2023 : ఎగ్జిట్​ పోల్స్​ ఔట్​.. త్రిపురలో కాషాయ జెండా రెపరెపలు పక్కా!

Sharath Chitturi HT Telugu
Feb 27, 2023 08:03 PM IST

Tripura Meghalaya and Nagaland Elections Exit Polls Live Updates : త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్​ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్​ పోల్స్​ బయటకొచ్చాయి. త్రిపురలో బీజేపీదే మరోమారు అధికారం అని ఎగ్జిట్​ పోల్స్​ను పరిశీలిస్తే తెలుస్తోంది.

ఎగ్జిట్​ పోల్స్​ ఔట్​.. త్రిపురలో కాషాయ జెండా రెపరెపలు పక్కా!
ఎగ్జిట్​ పోల్స్​ ఔట్​.. త్రిపురలో కాషాయ జెండా రెపరెపలు పక్కా! (Pitamber Newar)

Tripura Meghalaya and Nagaland Elections Exit Polls Live Updates : ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, నాగాలాండ్​లో పోలింగ్​ ప్రక్రియం ప్రశాంతంగా ముగిసింది. త్రిపురలో ఈ నెల 16నే ఎన్నికలు జరిగాయి. మొత్తం 180 సీట్లకు (ప్రతి రాష్ట్రంలో 60) ఎన్నికలు జరగ్గా.. ఫలితాలు మార్చ్​ 2న వెలువడనున్నాయి. అయితే.. పోలింగ్​ ముగిసిన అనంతరం సోమవారం రాత్రి ఎగ్జిట్​ పోల్స్​ వెలువడ్డాయి. వాటిని పరిశీలిస్తే.. త్రిపురలో బీజేపీ సునాయాసంగా విజయం సాధిస్తుందని, అధికారాన్ని నిలబెట్టుకుంటుందని స్పష్టమవుతోంది. నాగాలాండ్​లో బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్​ పోల్స్​ సూచిస్తున్నాయి. మేఘాలయలో మాత్రం ఎన్​పీపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని అర్థమవుతోంది.

త్రిపుర ఎగ్జిట్​ పోల్స్​..

Tripura exit poll results : త్రిపురలో మొత్తం సీట్లు- 60, మెజారిటీ నెంబర్​- 31, ప్రస్తుత ప్రభుత్వం- బీజేపీ

ఇండియా టుడే- మై యాక్సిస్​ ఇండియా:- బీజేపీ:- 29-36, సీపీఎం- కాంగ్రెస్​:- 13-21, టిప్రా:- 11-16, ఇతరులు 0-3.

పీపుల్స్‌పల్స్‌ అంచనా: బీజేపీ : 18 -26, సీపీఐ(ఎం) : 14-22, టిఎంపి : 11-16, కాంగ్రెస్‌ : 1-3, ఐపిఎఫ్‌టి : 0-1, ఇతరులు 1-2.

టైమ్స్​ నౌ- ఈటీడీ రీసెర్చ్​:- బీజేపీ కూటమి:- 21-27, కాంగ్రెస్​:- 0, లెఫ్ట్​:- 18-24.

నాగాలాండ్​ ఎగ్జిట్​ పోల్స్​..

Nagaland elections 2023 exit polls : నాగాలాండ్​లో మొత్తం సీట్లు- 60, మెజారిటీ నెంబర్​- 31, ప్రస్తుత ప్రభుత్వం- ఎన్​డీపీపీ- బీజేపీ కూటమి.

ఇండియా టుడే- మై యాక్సిస్​ ఇండియా:- ఎన్​డీపీపీ- బీజేపీ కూటమి:- 38-44, ఎన్​పీఎఫ్​:- 3-8, కాంగ్రెస్​:- 1-2, ఇతరులు:- 5-15. 

జీ మేట్రిజ్​:- ఎన్​డీపీపీ- బీజేపీ కూటమి:- 35-43, నాగా పీపుల్స్​ ఫ్రెంట్​:- 2-5, కాంగ్రెస్​ 1-3.

పీపుల్స్‌పల్స్‌ అంచనా : ఎన్​డీపీపీ : 20-27, బీజేపీ : 14-21, ఎల్‌జేపీ : 5-10, ఎన్పీఎఫ్‌ : 3-8, కాంగ్రెస్‌ 2-4, ఇతరులు : 2-4.

టైమ్స్​ నౌ- ఈటీజీ రీసెర్చ్​:- ఎన్​డీపీపీ+ బీజేపీ కూటమి:- 39-49, కాంగ్రెస్​:- 0, ఎన్​పీఎఫ్​ 4-8.

మేఘాలయ ఎగ్జిట్​ పోల్స్​..

Meghalaya election exit polls : మేఘాలయలో మొత్తం సీట్లు- 60, మెజారిటీ నెంబర్​- 31, ప్రస్తుత ప్రభుత్వం- ఎన్​పీపీ.

జీ మేట్రిజ్​:- ఎన్​పీపీ:- 21-26, బీజేపీ:- 6-11, కాంగ్రెస్​:- 3-6, టీఎంసీ:- 8-13

పీపుల్స్‌పల్స్‌ అంచనా : నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్పీపీ) : 17-26, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ (టీఎంసీ): 10-14, యుడిపి : 8-12, బీజేపీ : 3-8, కాంగ్రెస్‌ : 3-5, ఇతరులు 4-9.

టైమ్స్​ నౌ- ఈటీజీ రీసెర్చ్​:- ఎన్​పీపీ:- 18-26, కాంగ్రెస్​:- 2-5, బీజేపీ:- 3-6 .

మరి ఈ ఎగ్జిట్​ పోల్స్​ ఫలితాలు నిజమవుతాయా? ప్రజల నాడిని పట్టుకునే విషయంలో ఈ ఎగ్జిట్​ పోల్స్​ విజయం సాధించాయా? లేక విఫలమయ్యాయా? వంటి ప్రశ్నలకు సమాధానాలు.. గురువారం (మార్చ్​ 2) లభించనున్నాయి.

IPL_Entry_Point