తన శునకం 'గే' అని చెప్పి వదిలేసిన యజమాని!-dog abandoned at shelter owner thinks he is a gay ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  తన శునకం 'గే' అని చెప్పి వదిలేసిన యజమాని!

తన శునకం 'గే' అని చెప్పి వదిలేసిన యజమాని!

HT Telugu Desk HT Telugu
Mar 22, 2022 12:11 PM IST

తన శునకం 'గే' అని ఆరోపిస్తూ.. ఓ యజమాని ఆ మూగజీవిని వదిలేశాడు. ఇందుకు ఓ కారణాన్ని చెబుతున్నాడు.

నాలుగేళ్ల ఫెజ్కో
నాలుగేళ్ల ఫెజ్కో (INSTAGRAM)

Dog abandoned at shelter | తన శునకం 'గే' అని చెప్పి మూగజీవాన్ని వెంటనే వదిలించుకున్నాడు ఆ యజమాని. అమెరికాలోని నార్త్​ కారోలినాలో జరిగింది ఈ ఘటన.

ఫెజ్కో అనే శునకాన్ని ఓ వ్యక్తి పెంచుకుంటున్నాడు. అయితే ఆ శునకం.. వేరే కుక్కలతో హంపింగ్​ చేస్తోందని, అది గే అని ఆరోపిస్తూ.. ఓ యానిమల్​ షెల్టర్​కు అప్పగించేశాడు. ఎవరైనా వచ్చి ఫెజ్కోను పెంచుకోవాలని యానిమల్​ సెంటర్​ అభ్యర్థిస్తోంది.

ఈ వార్త స్థానిక వార్తా ఛానెల్​ డబ్ల్యూసీసీబీలో ప్రసారమైంది. "ఈ శునకానికి నాలుగేళ్లు ఉంటాయి. బరువు 50పౌండ్లు. మనుషుల మధ్యలో ఉండటం, వారితో కలిసి జీవించడం అంటే ఫెజ్కోకు చాలా ఇష్టం," అని న్యూస్​ రీడర్లు వివరించారు.

ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. అయితే శునకాలు హంపింగ్​ చేయడం చాలా సహజమైన విషయమేనని, యజమాని అలా చేసి ఉండకూడదని నెటిజన్లు మండిపడుతున్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్