Tuvalu: సముద్రంలో మునిగిపోనున్న ద్వీప దేశం; మెటావర్స్ లోకి దేశం ప్రతిరూపం-disappearing island nation of tuvalu to replicate itself in metaverse ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Disappearing Island Nation Of Tuvalu To Replicate Itself In Metaverse

Tuvalu: సముద్రంలో మునిగిపోనున్న ద్వీప దేశం; మెటావర్స్ లోకి దేశం ప్రతిరూపం

HT Telugu Desk HT Telugu
Feb 28, 2023 05:44 PM IST

తువాలు (Tuvalu).. ప్రపంచ చిత్రపటంలో చిన్న బిందువు వంటి దేశం. ద్వీప దేశం. వాతావరణ మార్పుల కారణంగా సముద్ర నీటి మట్టాలు పెరిగి, ఈ దేశాన్ని ముంచేస్తున్నాయి.

ద్వీప దేశం తువాలు
ద్వీప దేశం తువాలు

Tuvalu in Metaverse: దక్షిణ పసిఫిక్ (South Pacific) సముద్రంలోని 9 చిన్న చిన్న ద్వీపాల సముదాయం ఈ తువాలు దేశం (Tuvalu). ఆస్ట్రేలియా (Australia), హవాయి (Hawaii)ల మధ్య ఉంటుంది. దీని జనాభా జస్ట్ 12 వేల మంది మాత్రమే. ఈ బుజ్జి దేశానికి పెద్ద కష్టం వచ్చిపడింది. వాతావరణ మార్పుల (climate change) వల్ల కలిగే అనర్ధాలపై అవగాహన లేకుండా మనం చేస్తున్న తప్పులే.. ఆ దేశానికి శాపంగా మారాయి. ఇప్పటికే తువాలు రాజధాని ప్రాంతం 40% నీట మునిగింది. ఈ శతాబ్దం చివరినాటికి ఈ దేశమే (Tuvalu) పూర్తిగా సముద్రంలో కలిసిపోనుంది.

Tuvalu in Metaverse: సముద్ర మట్టం పెరుగుతుండడంతో..

వాతావరణ మార్పుల (climate change) కారణంగా సముద్రాల్లోని నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. అలా పెరుగుతున్న సముద్ర జలాలు క్రమంగా చిన్న చిన్న ద్వీపాలను కబళిస్తున్నాయి. అలా, సముద్ర జలాల్లోకి క్రమంగా జారుకుంటున్న దేశం తువాలు (Tuvalu). మరి కొన్ని సంవత్సరాల్లో ఆ దేశం నామరూపాలు లేకుండా పోతుంది. పసిఫిక్ సముద్రంలో అంతర్భాగమవుతుంది.

Tuvalu in Metaverse: చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాల కోసం..

అయితే, భౌతికంగా దేశం కనుమరుగైనా, దేశ భౌగోళికత, చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు కనుమరుగు కాకూడదని తువాలు (Tuvalu) ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం సాంకేతికతను ఉపయోగించుకోవాలనుకుంది. మెటావర్స్ (Metaverse) లో దేశ ప్రతిబింబాన్ని డిజిటల్ వర్షన్ లో రూపొందించడం ప్రారంభించింది. అలా, తొలి డిజిటల్ కంట్రీగా (Tuvalu) అవతరించనుంది. దేశంలోని భౌగోళిక కేంద్రాలు, ప్రముఖ నిర్మాణాలు, ఇతర పర్యాటక కేంద్రాలను డిజిటలైజ్ చేయనుంది. అంటే భవిష్యత్తులో మనం మన ఇంట్లోనే కూర్చుని, ఆ దేశంలో వర్చువల్ రియాలిటీ ద్వారా పర్యటించవచ్చు.

Tuvalu in Metaverse: మీదే ఈ పాపం..

వాతావరణ మార్పులకు (climate change) కారణమవుతున్న చర్యలను నియంత్రించడంలో ప్రపంచ దేశాలు విఫలమయ్యాయని, మాటల్లో చూపుతున్న నిబద్ధత చర్యల్లో చూపడం లేదని తువాలు (Tuvalu) దేశ విదేశాంగ మంత్రి సైమన్ కొఫె విమర్శిస్తున్నారు. వాతావరణ మార్పుల కారణంగా కనుమరుగు కాబోతున్న తమ దేశం గుర్తులను కాపాడుకోవడం కోసం ఇలా Metaverse బాట పట్టామని వివరించారు.

IPL_Entry_Point