Swati Maliwal: ‘బాల్యంలో నా తండ్రి లైంగికంగా వేధించాడు’: స్వాతి మాలివల్
Swati Maliwal: బాల్యంలో తన తండ్రి తనను లైంగికంగా వేధించాడని ఢిల్లీ కమిషన్ ఫర్ విమన్ (Delhi Commission for Women) చైర్ పర్సన్ స్వాతి మాలివల్ (Swati Maliwal) వెల్లడించారు.
Swati Maliwal faces sexual abuse: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఢిల్లీ మహిళా కమిషన్ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో తన చిన్ననాటి దారుణ అనుభవాలను డీసీడబ్ల్యూ చైర పర్సన్ స్వాతి మాలివల్ గుర్తు చేసుకున్నారు.
Swati Maliwal sexually assaulted by her father: దారుణంగా కొట్టేవాడు..
చిన్నప్పుడు తన తండ్రి తనను లైంగికంగా వేధించాడని ఢిల్లీ మహిళా కమిషన్ చైర పర్సన్ స్వాతి మాలివల్ వెల్లడించారు. బాల్యంలో తన తండ్రి చేసిన దారుణాలను ఇటీవల ఆమె పంచుకున్నారు. చిన్నప్పుడు తన తండ్రి తనను దారుణంగా కొట్టేవాడని, ఆయన ఇంటికి వస్తున్నాడంటేనే.. మంచం కింద దాక్కునే దాన్నని ఆమె గుర్తు చేసుకున్నారు. కారణం లేకుండానే దారుణంగా కొట్టేవాడని, జుట్టు పట్టుకుని తలను గోడకు కొట్టేవాడని నాటి భయంకర అనుభవాలను వివరించారు. తండ్రి అడుగుల శబ్ధం వింటేనే భయంతో వణికిపోయేదానినని చెబుతూ, భావోద్వేగానికి లోనయ్యారు. ‘నా తండ్రి నన్ను లైంగికంగా వేధించేవాడు. భయంకరంగా కొట్టేవాడు. ఆయనంటే భయంతో వణికిపోయేదాన్ని’ అని ఆమె తెలిపారు. నిజానికి తను నాడు అనుభవించిన వేధింపులే బాధిత మహిళల తరఫున పోరాడాలన్న నిర్ణయానికి కారణమయ్యాయని వివరించారు. నాలుగో తరగతి వరకే తన తండ్రితో కలిసి ఉన్నానన్నారు.
Swati Maliwal sexually assaulted by her father: 2005లో డీసీడబ్ల్యూ చైర్ పర్సన్
2015లో ఆప్ ప్రభుత్వం ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన తరువాత స్వాతి మాలివల్ ను డీసీడబ్ల్యూ చైర్ పర్సన్ గా నియమించారు. ఆ తరువాత మరో సారి ఆమె పదవీకాలాన్ని పొడగించారు. 2015 కి ముందు ఆమె ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ కు సలహాదారుగా ఉన్నారు. ఆప్ హరియాణా మాజీ చీఫ్ నవీన్ జైహింద్ తో ఆమె వివాహం జరిగింది. తరువాత 2020లో వారు విడాకులు తీసుకున్నారు.
Khushbu sexually assaulted by her father: కుష్బూ కూడా..
తండ్రి చేతుల్లో లైంగిక వేధింపులకు గురయ్యానని ఇటీవల బీజేపీ నాయకురాలు, నటి ఖుష్బూ కూడా వెల్లడించారు. తనకు8 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు తన తండ్రి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, ఆ విషయం చెబితే తన తల్లి నమ్మదేమోనని భయపడ్డానని ఆమె గుర్తు చేసుకున్నారు. బాల్యంలో లైంగిక వేధింపులకు గురైతే, ఆ విషాదం ఒక మచ్చలా జీవితాంతం గుర్తుండిపోతుందన్నారు. ప్రస్తుతం ఖుష్బూ నేషనల్ కమిషన్ ఫర్ విమన్ లో సభ్యురాలిగా ఉన్నారు.