Janardhan Mishra : ‘నీటిని పొదుపు చేయాలంటే.. గుట్కా తినండి, మద్యం తాగండి’
Janardhan Mishra on water conservation : నీటిని పొదుపు చేసేందుకు గుట్కా తినాలని, మద్యం సేవించాలని పిలుపునిచ్చారు బీజేపీ ఎంపీ జనార్దన్ మిశ్రా. ఈ మాటలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.
Janardhan Mishra on water conservation : చేతులతో టాయిలెట్లు శుభ్రం చేసి వార్తల్లో నిలిచిన బీజేపీ ఎంపీ జనార్దన్ మిశ్రా.. మరోమారు హెడ్‌లైన్స్‌కి ఎక్కారు. ఈసారి నీటి పొదుపు అంశంపై ఆయన విచిత్రమైన సూచనలు ఇచ్చారు. నీటిని పొదుపు చేసేందుకు ప్రజలు గుట్కా తినాలని, మద్యం ఎక్కువగా సేవించాలని పిలుపునిచ్చారు. జనార్దన్ మిశ్రా ప్రసంగానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
ట్రెండింగ్ వార్తలు
వాటర్ కన్సర్వేషన్ అంశంపై మధ్యప్రదేశ్ రేవాలోని కృష్ణరాజ్ కపూర్ ఆడిటోరియంలో ఇటీవలే ఓ వర్క్‌షాప్ జరిగింది. ఇందులో.. రేవా ఎంపీ జనార్దన్ మిశ్రా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఈ వ్యాఖ్యలు చేశారు.
"భుమి మీద నీరు ఉండటం లేదు. నీటిని పొదుపు చేయాలి. గుట్కా అయినా తినండి, లేదా మద్యాన్ని అయినా తాగండి, అయోడెక్స్ అయినా ఎక్కువగా తినండి. ఏమైనా చేయండి, కానీ నీటిని ఆదా చేయండి. మీరు ఏం చేసినా నాకు ఇబ్బంది లేదు. కానీ నీటి పొదుపు విలువను మాత్రం అర్ధం చేసుకోండి," అని జనార్దన్ మిశ్రా అన్నారు.
"వాటర్ ట్యాక్స్‌పై ప్రభుత్వం తగ్గింపును ఇస్తే మీరు వ్యతిరేకించండి. వాటర్ ట్యాక్స్‌ను కడతామని, కావాల్సితే ఇతర పన్నులను తగ్గించాలని మీరు డిమాండ్ చేయండి," అని బీజేపీ ఎంపీ 66ఏళ్ల జనార్దన్ మిశ్రా చెప్పుకొచ్చారు.
టాయిలెట్ కడిగి..
Janardhan Mishra : జనార్దన్ మిశ్రాకు సంబంధించిన ఓ వీడియో.. సెప్టెంబర్‌లో వైరల్ అయ్యింది. ఈ లోక్‌సభ ఎంపీ.. తన నియోజకవర్గంలోని ఓ పాఠశాలకు వెళ్లి, అక్కడి టాయిలెట్లను తన చేతులతో కడిగారు. ఆ వీడియోను చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం
Satish Jarkiholi Hindu : ‘హిందూ అనే పదానికి అసభ్యకరమైన అర్థం ఉంది’
November 07 2022
Leopard Kills Dog : ఇంట్లోని కుక్కపై చిరుత దాడి - వీడియో వైరల్
November 04 2022
Satish Jarkiholi Hindu : ‘హిందూ అనే పదానికి అసభ్యకరమైన అర్థం ఉంది’
November 07 2022
Leopard Kills Dog : ఇంట్లోని కుక్కపై చిరుత దాడి - వీడియో వైరల్
November 04 2022