లైవ్​ స్ట్రీమ్​లో.. మాజీ భార్యకు నిప్పంటించిన వ్యక్తికి 'ఉరి'-chinese man executed for setting ex wife on fire during a live stream ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  లైవ్​ స్ట్రీమ్​లో.. మాజీ భార్యకు నిప్పంటించిన వ్యక్తికి 'ఉరి'

లైవ్​ స్ట్రీమ్​లో.. మాజీ భార్యకు నిప్పంటించిన వ్యక్తికి 'ఉరి'

Sharath Chitturi HT Telugu
Jul 24, 2022 04:07 PM IST

2020లో చైనాలో సంచలనం సృష్టించిన ‘లాము’ కేసులో న్యాయం జరిగింది! లాము అనే మహిళను తన మాజీ భర్త నిప్పంటించి చంపేశాడు. లైవ్​ స్ట్రీమ్​లో ఇదంతా రికార్డు అయ్యింది. చివరికి ఆ వ్యక్తికి ఉరిశిక్ష అమలైంది.

లైవ్​ స్ట్రీమ్​లో.. భార్యకు నిప్పంటించిన భర్తకు ఉరి
లైవ్​ స్ట్రీమ్​లో.. భార్యకు నిప్పంటించిన భర్తకు ఉరి (HT Telugu)

మాజీ భర్త చేతిలో హత్యకు గురైన చైనా మహిళకు న్యాయం జరిగింది! లైవ్​ స్ట్రీమ్​లో మహిళకు నిప్పంటించిన భర్తను ఉరితీశారు. శనివారం ఈ ఉరిశిక్ష అమలైంది.

అసలేం జరిగిందంటే..

నైరుతి సిచియాన్​ రాష్ట్రంలో కొన్నేళ్ల క్రితం టాంగ్​ లూ, తన భార్య లాము(ఆన్​లైన్​ పేరు)తో కలిసి నివాసముండేవాడు. వారిద్దరు సామాజిక మాధ్యమాల్లో 'ఇన్​ఫ్లుయెంజర్లు'. కాగా.. 2020 జూన్​లో వారిద్దరు విడిపోయారు. అప్పటి నుంచి టాంగ్​ లూ.. లాము వెంటపడేవారు. తనను మళ్లీ పెళ్లి చేసుకోవాలని వేధించేవాడు. ఆమె అందుకు ఒప్పుకోలేదు.

ఈ క్రమంలోనే అదే ఏడాది సెప్టెంబర్​లో.. టిక్​టాక్​తో పోలిన ఓ చైనా యాప్​లో లాము లైవ్​ స్ట్రీమింగ్​ చేస్తుండగా ఒక్కసారిగా దాడి చేశాడు టాంగ్​ లూ. ఆమె శరీరానికి నిప్పు అంటించాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. ఆమె ప్రాణాలు కోల్పోయింది.

ఈ ఘటన చైనావ్యాప్తంగా కలకలం సృష్టించింది. ప్రజలందరు లాముకు మద్దతుగా నిలిచారు. మహిళలు ఎదుర్కొంటున్న గృహ హింసకు వ్యతిరేకంగా నిరసనలు చేశారు.

ఘటన జరిగిన వెంటనే టాంగ్​ లూను పోలీసులు అరెస్ట్​ చేశారు. కేసుపై ముమ్మరంగా దర్యాప్తు చేసి కోర్టులో హాజరుపరిచారు. 2021 అక్టోబర్​లో.. అతనికి కోర్టు ఉరిశిక్షను విధించింది. ఉరిశిక్ష రద్దు కోసం 2022 జనవరిలో టాంగ్​ లూ విజ్ఞప్తి చేసుకోగా.. అందుకు కోర్టు నిరాకరించింది. చివరికి ఈ శనివారం ఉరిశిక్ష అమలైంది.

ఉరిశిక్షకు ముందు.. టాంగ్​ లూ తన కుటుంబసభ్యులతో కొంతసేపు గడిపినట్టు సమాచారం.

IPL_Entry_Point

సంబంధిత కథనం