Bodies of 7 in Bheema river: నదీ తీరంలో ఏడు మృతదేహాలు; బంధువులే హంతకులు
Bodies of 7 in Bheema river: మహారాష్ట్రలోని పుణె సమీపంలోని పార్గావ్ గ్రామ శివార్లలోని భీమ నదీ తీరంలో ఏడు మృతదేహాలు లభించడం స్థానికంగా భయాందోళనలకు కారణమైంది. అయితే, ఆ ఏడుగురిని బంధువులే హతమార్చినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
7 dead bodies in Bheema riverపుణె రూరల్ పోలీసులు గత వారం రోజుల్లో పుణె సమీపంలోని పార్గామ్ గ్రామ శివార్లలోని భీమ నదీ తీరంలో ఏడు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. చనిపోయిన వారంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా గుర్తించారు.
ట్రెండింగ్ వార్తలు
7 dead bodies in Bheema river: నలుగురు పెద్దలు, ముగ్గురు పిల్లలు
పోలీసులు గత బుధ, శుక్ర, శని, ఆది వారాల్లో భీమ నదిలో నాలుగు మృతదేహాలను గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకుని మార్చురీకి తరలించారు. నేరం తీవ్రతను గుర్తించి, బృందాలుగా ఏర్పడి భీమ నదిలో గాలింపు జరపడంతో మరో మూడు మృతదేహాలు లభించాయి. ఈ ఏడుగురు ఒకే కుటుంబానికి చెందినవారని, వారిలో ఇద్దరు వృద్ధ దంపతులు, వారి కూతురు, అల్లుడు, వారి ముగ్గురు పిల్లలు కిరాతకంగా హత్యకు గురైనట్లు గుర్తించారు. పిల్లల్లో ఒకరు 7, మరొకరు 5, ఇంకొకరు 3 ఏళ్ల వయస్సు వారు. ఈ కేసును తీవ్రంగా తీసుకున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. బాధితురాలి వద్ద నుంచి లభించిన ఫోన్ ఆధారంగా కాల్ లిస్ట్ ను గుర్తించి, బాధితుల వివరాలను రాబట్టారు. మృతుల్లో పెద్ద వాడైన మోహన్ తన భార్య, కూతురు, అల్లుడు, వారి పిల్లలతో పార్నర్ తాలూకా, నిఘోయి గ్రామానికి వచ్చి కూలీగా పని చేస్తున్నాడు. వారంతా ప్రస్తుతం హత్యకు గురయ్యారు.
7 dead bodies in Bheema river: బంధువులే హంతకులు
ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు సంచలన విషయాలు వెల్లడయ్యాయి. బంధువులే వారిని చంపేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మృతుల్లో పెద్ద వాడైన మోహన్ పవార్ కు నిందితులైన అశోక్ కళ్యాణ్ పవార్ తో పాటు మరో నలుగురు వరుసకు సోదరులవుతారు. కొంత కాలం క్రితం అశోక్ కళ్యాణ్ పవార్ కొడుకు ధనుంజయ పుణెలో ఒక ప్రమాదంలో చనిపోయాడు. ధనుంజయ మరణానికి మోహన్ పవార్ కుమారుడే కారణమని ప్రధాన నిందితుడైన అశోక్ కళ్యాణ్ పవార్ నిర్ణయించుకున్నాడు. ఆ కోపంలో మోహన్ పవార్ కుటుంబ సభ్యులను అందరినీ హతమార్చాడు. నిందితులందరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.