Bharat Jodo Yatra @1000km | 1000 కిమీల మైలు రాయికి భారత్ జోడో యాత్ర!-bharat jodo yatra to achieve the milestone of reaching 1000 km on satur day ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Bharat Jodo Yatra To Achieve The Milestone Of Reaching 1000 Km On Satur Day

Bharat Jodo Yatra @1000km | 1000 కిమీల మైలు రాయికి భారత్ జోడో యాత్ర!

HT Telugu Desk HT Telugu
Oct 14, 2022 07:39 PM IST

Bharat Jodo Yatra @1000km | కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన దేశవ్యాప్త పాదయాత్ర ‘భారత్ జోడో యాత్ర’ విజయవంతంగా సాగుతోంది. శనివారం నాటికి ఈ యాత్ర 1000 కిమీల మైలురాయికి చేరుకోనుంది.

కర్నాటకలో ‘భారత్ జోడో’ మార్గంలో టైల్స్ వేస్తున్న రాహుల్ గాంధీ
కర్నాటకలో ‘భారత్ జోడో’ మార్గంలో టైల్స్ వేస్తున్న రాహుల్ గాంధీ (Karnataka Congress Twitter)

Bharat Jodo Yatra @1000km | కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవం లక్ష్యంగా ఆ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతంగా సాగుతోంది. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలే కాకుండా, అన్ని వర్గాల ప్రజలు ఈ యాత్రలో పాలు పంచుకుంటున్నారు.

Bharat jodo yatra @1000km | కర్నాకటలో..

తమిళనాడులోని కన్యాకుమారిలో రాహుల్ గాంధీ ఈ యాత్ర ప్రారంభించారు. రోజుకు దాదాపు 25 కిమీల పాటు పాద యాత్ర చేస్తున్నారు. ఇప్పటివరకు తమిళనాడు, కేరళలో యాత్ర పూర్తయింది. ప్రస్తుతం కర్నాటకలో కొనసాగుతోంది. కర్నాటక నుంచి యాత్ర తెలంగాణలో అడుగుపెడుతుంది.

Bharat jodo yatra @1000km | 1000 కిమీ..

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర శనివారం నాటికి 1000 కిమీల మైలు రాయిని చేరుకుంటుంది. భారత జాతీయ నాయకుల్లో ఇంత సుదీర్ఘమైన యాత్ర చేపట్టిన నాయకుడు మరొకరు లేరు. శనివారం కర్నాటకలోని బళ్లారి జిల్లాలో వెయ్యి కిలోమీటర్ల యాత్ర ముగుస్తుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు బళ్లారిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు.

Bharat jodo yatra @1000km | 'భారత్ జోడో' రోడ్

భారత్ జోడో యాత్రలో భాగంగా, కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలోని బదనవాలు గ్రామంలోని వెనుకబడిన ప్రాంతాల్లో రాహుల్ గాంధీ దళిత క్వార్టర్లను లింగాయత్ కమ్యూనిటీతో కలుపే మార్గాన్ని రాహుల్ గాంధీ పున: ప్రారంభించారు. 'భారత్ జోడో' రోడ్ పేరుతో రంగురంగుల టైల్స్ తో ఈ మార్గాన్ని 48 గంటల వ్యవధిలో కాంగ్రెస్ పునరుద్ధరించింది. దాదాపు మూడు దశాబ్దాల క్రితం హింసాత్మక పరిస్థితులలో తెగిపోయిన ఈ మార్గాన్ని తిరిగి కలిపేందుకు రాహుల్ గాంధీ స్వయంగా గులాబీ-నీలం రంగు టైల్స్‌ వేశారు.

Bharat jodo yatra @1000km | లక్షలాదిగా తరలి వస్తున్న ప్రజలు

లక్షలాదిగా సామాన్య వర్గాల ప్రజలు కూడా ఈ చారిత్రక భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్నారు. తమిళనాడులో జరిగిన యాత్రలో దాదాపు లక్ష మంది, కేరళలో దాదాపు 1.25 లక్షల మంది, కర్ణాటకలో శుక్రవారం వరకు దాదాపు 1.50 లక్షల మంది ఈ యాత్రలో పాల్గొన్నారు. రైతులు, మత్స్యకారులు, భవన నిర్మాణ కార్మికులు, ఉపాధ్యాయులు, గ్రామ స్థాయి నాయకులు, ప్రముఖ వ్యక్తులు, రచయితలు, పండితులు, మేధావులు భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు.

Bharat jodo yatra @1000km | తెలంగాణ లోకి..

అక్టోబర్ 23న భారత్ జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. 23న తెలంగాణాలోని నారాయణపేట్ నియోజకవర్గంలో ప్రవేశించి 375 కిలోమీటర్ల మేరకు 19 నియోజక వర్గాలను చుడుతూ పక్కనే ఉండే మరో 30 నియోజకవర్గాల కూడా యాత్రలో మమేకం చేస్తూ మొత్తానికి 50 నియోజకవర్గాలు కవర్ చేసేలా ఈ యాత్ర కొనసాగుతుంది. అనంతరం, నవంబర్ 6న జుక్కల్ నియోజకవర్గంలో తెలంగాణలో యాత్ర ముగియనుంది.

Bharat jodo yatra @1000km | తెలంగాణా రూట్ మ్యాప్

తెలంగాణలో భారత్ జోడో యాత్ర రూట్ మ్యాప్ ను రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు సిద్ధం చేశారు. రాష్ట్రంలో ఈ యాత్రను ఇతర రాష్ట్రాల కన్నా ఘనంగా కొనసాగించడానికి రాష్ట్ర నాయకులు ప్రణాళికలు సిద్ధం చేశారు.

IPL_Entry_Point