Child marriages in Assam: బాల్య వివాహాలపై ఉక్కుపాదం మోపిన రాష్ట్రం
Child marriages in Assam: అస్సాం రాష్ట్ర ప్రభుత్వం బాల్య వివాహాలను (Child Marriage) అడ్డుకోవడంపై దృష్టి పెట్టింది. బాల్య వివాహ (Child Marriage) నేరాలకు సంబంధించి 4 వేల కేసులను నమోదు చేసింది.
Child marriages in Assam: రాష్ట్రంలో బాల్య వివాహాలను (Child Marriage) అడ్డుకునేందుకు కఠిన చర్యలు ప్రారంభించామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Assam CM Himanta Biswa Sarma) వెల్లడించారు. బాల్య వివాహాలను (Child Marriage) అడ్డుకునే దిశగా దాదాపు 4 వేల కేసులను నమోదు చేశామని తెలిపారు.
crackdown on Child marriages in Assam: 1800 మంది అరెస్ట్
బాల్య వివాహాలు (Child Marriage) చేస్తున్న, వాటిని ప్రోత్సహిస్తున్న సుమారు 1800 మందిని అస్సాంలో అరెస్ట్ చేశారు. బాల్య వివాహ నిషేధ చట్టం (Prohibition of Child Marriage Act) ను ఉల్లంఘించిన ఆరోపణలపై వారిని అరెస్ట్ చేశారు. బాల్య వివాహాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించకూడదని అస్సాం ప్రభుత్వం నిర్ణయించింది. బాల్య వివాహ నేరాలపై జీరో టాలరెన్స్ (zero tolerance) విధానాన్ని అవలంబిస్తోంది. చిన్నారులపై కొనసాగుతున్న దారుణమైన నేరాలుగా బాల్య వివాహాలను (Child marriages in Assam) పరిగణించాలని అస్సాం పోలీసులకు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Assam CM Himanta Biswa Sarma) దిశానిర్దేశం చేశారు.
crackdown on Child marriages in Assam: కొనసాగుతున్న ఆపరేషన్
బాల్య వివాహాలను (Child marriages in Assam) అరికట్టే దిశగా అస్సాం ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ (crackdown on Child marriages) కొనసాగుతుందని అస్సాం పోలీస్ ఐజీ ప్రశాంత కుమార్ తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని అరెస్ట్ లు జరుగుతాయని స్పష్టం చేశారు. అస్సాం సీఎం శర్మ ఆదేశాల మేరకు గురువారం రాత్రి నుంచి రాష్ట్రంలో బాల్య వివాహాలపై పోలీసులు ఉక్కుపాదం (crackdown on Child marriages) మోపుతున్నారు. సీఎం హిమంత బిశ్వ శర్మ (Assam CM Himanta Biswa Sarma) గురువారం రాత్రి పోలీస్ శాఖ (Assam Police) ఉన్నతాధికారులు, అన్ని జిల్లాల ఎస్పీలతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించి, బాల్య వివాహాలను అడ్డుకునే విషయంలో వారికి దిశానిర్దేశం చేశారు. ఈ బాల్య వివాహమనే దుస్సాంప్రదాయాన్ని రాష్ట్రంలో పూర్తిగా నిర్మూలించాలని వారికి సూచించారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5 (National Family Health Survey-5) లో అస్సాంలో జరుగుతున్న బాల్య వివాహాలపై (Child marriages in Assam) సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ప్రస్తుతం 20 నుంచి 24 ఏళ్ల వయస్సున్న యువతుల్లో 31.8% మందికి 18 ఏళ్ల లోపే వివాహమైందని ఆ సర్వే లో తేలింది. జాతీయ స్థాయిలో ఈ సగటు 23.3% కావడం గమనార్హం.
టాపిక్