Telugu News  /  National International  /  As Shraddha Murder Shocks India, Hindu Girl Chopped Into Pieces By Lover In Bangladesh
పోలీసుల అదుపులో అబూ బాకర్
పోలీసుల అదుపులో అబూ బాకర్

Hindu girl chopped into pieces by lover: శ్రద్ధ హత్య తరహాలోనే మరో కిరాతకం..

18 November 2022, 14:57 ISTHT Telugu Desk
18 November 2022, 14:57 IST

Hindu girl chopped into pieces by lover: ఢిల్లీలో తన లివిన్ పార్ట్ నర్ చేతిలో శ్రద్ధ వాకర్ దారుణ హత్యకు గురైన తరహాలోనే జరిగిన మరో దారుణం వెలుగు చూసింది. హంతకుడు తన స్నేహితురాలిని దారుణంగా హత్య చేసి, తలను వేరు చేసి, ముక్కలుగా నరికేసి పారిపోయాడు.

Hindu girl chopped into pieces by lover: ఈ దారుణం బంగ్లాదేశ్ లో జరిగింది. ఒక ట్రాన్స్ పోర్ట్ ఆఫీస్ లో పని చేసే అబూ బాకర్.. తన స్నేహితురాలైన కవిత రాణిని కిరాతకంగా హతమార్చాడు. అప్పటికే, అబూ బాకర్ స్వప్న అనే యువతితో సహ జీవనం చేస్తున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

Hindu girl chopped into pieces by lover: ముక్కలుగా నరికేసి..

నవంబర్ 6న తనతో సహ జీవనం చేస్తున్న యువతి స్వప్న బయటకు వెళ్లిన సమయంలో తనకు 5 రోజుల క్రితమే పరిచమయమైన కవితతో గోబ్రాచక్క చౌరాస్తా ప్రాంతంలో తాను అద్దెకుంటున్న రూమ్ కు వెళ్లాడు. అక్కడ వారి మధ్య గొడవ జరిగింది. కోపంలో, కవిత గొంతు నులిమి హత్య చేశాడు. తరువాత ఆ మృతదేహం నుంచి తలను వేరు చేసి, పాలథీన్ కవర్లో పెట్టి పక్కన పెట్టాడు. చేతులను నరికేసి దగ్గర్లోని కాలువలో పడేశాడు. మిగతా శరీరాన్ని ఒక బాక్స్ లో పెట్టి పారిపోయాడు. అదే రాత్రి స్వప్నతో కలిసి రుప్సా నదిని దాటి ఢాకా పారిపోయాడు.

Hindu girl chopped into pieces in Bangladesh: యజమానికి అనుమానం రావడంతో..

మర్నాడు అబూ బాకర్ పనికి రాకపోవడంతో ట్రాన్స్ పోర్ట్ ఆఫీస్ యజమాని మరో కార్మికుడిని అబూబాకర్ రూమ్ వద్దకు పంపించాడు. రూమ్ తాళం వేసి ఉన్న విషయాన్ని, రూమ్ లో నుంచి దుర్వాసన వస్తున్న విషయాన్ని ఆ కార్మికుడు యజమానికి తెలిపాడు. దాంతో, అనుమానించిన ఆ యజమాని పోలీసులకు సమాచారమివ్వడంతో ఈ దారుణం వెలుగు చూసింది.

Bangladesh crime: నిందితుడి అరెస్ట్

వెంటనే రంగంలోకి దిగిన స్థానిక పోలీసులు, బంగ్లాదేశ్(Bangladesh) ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్(Rapid Action Battalion RAB) అబూ బాకర్ రూమ్ తాళం బద్ధలు కొట్టి రూమ్ లోకి వెళ్లారు. రూమ్ లో మృతురాలి తల భాగాన్ని, చేతులు లేని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మార్చురీకి తరలించారు. అనంతరం దగ్గర్లోని కాలువలో ఆ యువతి చేతి భాగాలను గుర్తించారు. ఆ వెంటనే గాలింపు చేపట్టి, నవంబర్ 7వ తేదీన ఢాకాలో నిందితుడు అబూబాకర్ ను అరెస్ట్ చేశారు. అబూ బాకర్ నేరాన్ని ఒప్పుకున్నాడని పోలీసులు వెల్లడించారు.