AAP asked to pay 163.62 crore: ‘10 రోజుల్లో 163 కోట్లు చెల్లించండి’-aap asked to pay rs 163 62 crore spent on ads in violation of guidelines ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Aap Asked To Pay <Span Class='webrupee'>₹</span>163.62 Crore Spent On Ads In Violation Of Guidelines

AAP asked to pay 163.62 crore: ‘10 రోజుల్లో 163 కోట్లు చెల్లించండి’

HT Telugu Desk HT Telugu
Jan 12, 2023 08:03 PM IST

AAP asked to pay 163.62 crore: ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ, ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్()ల మధ్య విబేధాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తాజాగా, ఆమ్ ఆద్మీ పార్టీని 163.62 కోట్ల రూపాయలను చెల్లించాలని జారీ చేసిన నోటీసులపై వివాదం మరింత పెరిగింది.

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ఎల్జీ వీకే సక్సేనా
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ఎల్జీ వీకే సక్సేనా

ఢిల్లీలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party AAP) ని రూ. 163.62 కోట్లను చెల్లించాలని డైరెక్టరేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ(DIP) జారీ చేసిన నోటీసులపై ఆప్, ఎల్జీల మధ్య మరో వివాదం ప్రారంభమైంది.

ట్రెండింగ్ వార్తలు

AAP asked to pay 163.62 crore: యాడ్స్ మనీ

2015లో సుప్రీంకోర్టు జారీ చేసిన నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రకటనలపై అధికార ఆప్ ఖర్చు చేసిన రూ. 163.62 కోట్లను వెంటనే చెల్లించాలని DIP నోటీసులు జారీ చేసింది. 10 రోజుల్లోగా చెల్లించని పక్షంలో పార్టీ ప్రధాన కార్యాలయాన్ని సీల్ చేస్తామని హెచ్చరించింది. ఢిల్లీకి వెలుపల పబ్లిష్ చేసిన ప్రకటనలకు సంబంధించి ఈ మొత్తాన్ని చెల్లించాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. అడ్వర్టైజ్ మెంట్లపై ఆప్ ఖర్చు చేసిన రూ. 99 కోట్లను రికవర్ చేయాలని ఢిల్లీ చీప్ సెక్రటరీ నరేశ్ కుమార్ ను డిసెంబర్ 20న ఎల్జీ వీకే సక్సేనా ఆదేశించారు. దాంతో, అసలు రూ. 99.31 కోట్లతో పాటు నాటి నుంచి అయిన వడ్డీ రూ. 64.31 కోట్లను కలిపి మొత్తం 163.62 కోట్లను చెల్లించాలని ఆప్ ను ఆదేశించారు.

AAP asked to pay 163.62 crore: ఆస్తుల జప్తు

ఒకవేళ ఆప్ ఆ మొత్తాన్ని చెల్లించని పక్షంలో చట్టబద్ధ చర్యలు తీసుకున, పార్టీకి సంబంధించిన ఆస్తులను జప్తు చేసే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని అక్రమంగా ఆప్ ప్రకటనల కోసం ఖర్చు చేశారని 2016లో ఎల్జీ నియమించిన త్రిసభ్య కమిటీ తేల్చింది. ఈ నోటీసులపై ఆప్ మండిపడింది. ప్రభుత్వ ఉద్యోగులను ఢిల్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉపయోగించుకుంటోందని బీజేపీపై ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా విమర్వించారు. కాగా, ప్రజల విశ్వాసాన్ని ఆప్ వమ్ము చేసిందని బీజేపీ విమర్శించింది.

IPL_Entry_Point

టాపిక్