నదిలో పడిన వాహనం.. ఏడుగురు వైద్య విద్యార్థులు దుర్మరణం-7 killed in a road accident in wardha ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  7 Killed In A Road Accident In Wardha

నదిలో పడిన వాహనం.. ఏడుగురు వైద్య విద్యార్థులు దుర్మరణం

Sharath Chitturi HT Telugu
Jan 25, 2022 02:54 PM IST

పార్టీకి వెళ్లొస్తున్న ఏడుగురు వైద్య విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఈ ఘటన మహారాష్ట్ర నాగ్​పూర్​లో జరిగింది. వారు ప్రయాణిస్తున్న వాహనం.. వంతెనపై నుంచి నదిలోకి పడిపోయింది.

ప్రమాదంలో నుజ్జునుజ్జు అయిన వాహనం
ప్రమాదంలో నుజ్జునుజ్జు అయిన వాహనం (hindustan times)

Maharastra road accident: మహారాష్ట్ర నాగ్​పూర్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున వార్దాలోని సెల్సురా వద్ద.. ఓ కళాశాల విద్యార్థులు ప్రయాణిస్తున్న వాహనం  వంతెనపై నుంచి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.

ట్రెండింగ్ వార్తలు

పార్టీకి వెళ్లొస్తూ..

పోలీసుల సమాచారం ప్రకారం.. మృతుల్లో కొందరు సావాంగిలోని జవహర్​లాల్​ నెహ్రూ వైద్య కళాశాల విద్యార్థులు. పార్టీ చేసుకునేందుకు సోమవారం అర్ధరాత్రి ఓ ఢాబాకు వెళ్లారు. ఆ తర్వాత  అక్కడి నుంచి తిరుగు పయనమయ్యారు. భదరి నది వంతెనపైకి వచ్చేసరికి వాహనంపై డ్రైవర్​ పట్టుకోల్పోయాడు. వంతెనను ఢీకొట్టిన వాహనం.. చివరికి నదిలో పడిపోయింది. 

మృతులను విజయ్​ రహంగ్​దలే, నితీశ్​ సింగ్​, వివేక్​ నందన్​, ప్రత్యూష్​ సింగ్​, శుభం జైశ్వాల్​, నీరజ్​ చౌహాన్​, పవన్​ శక్తిగా గుర్తించారు. వీరిలో విజయ్​ రహంగ్​దలే.. బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు. 

విద్యార్థులను రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టినా ఫలితం దక్కలేదు. చివరికి మృతదేహాలను నదిలో నుంచి వెలికితీశారు.

ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అకస్మాత్తుగా ఓ జంతువు ఎదురు వచ్చిందని, పరిస్థితిని అదుపుచేసే క్రమంలో డ్రైవర్​ వాహనంపై పట్టుకోల్పోవడం వల్లే ఘటన జరిగిందని ప్రాథమిక విచారణలో తేలింది.

ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం ప్రకటించారు.

 

 

 

IPL_Entry_Point