Crime : 300మంది మహిళలను మోసం చేసిన ఘనుడు!-25 year old man posing as airline pilot held for duping 300 women ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /   25-year-old Man, Posing As Airline Pilot, Held For Duping 300+ Women

Crime : 300మంది మహిళలను మోసం చేసిన ఘనుడు!

Sharath Chitturi HT Telugu
Aug 05, 2022 07:02 AM IST

Man dupes women : పైలట్​ అని చెప్పి మహిళలను మోసం చేస్తున్న ఓ వ్యక్తిని గురుగ్రామ్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. అతడు ఇప్పటివరకు 300మందికిపైగా మహిళలను మోసం చేసి.. రూ .25లక్షలు దోచుకున్నాడు.

'పైలట్​' అని చెప్పి 300మంది మహిళలను మోసం చేసిన ఘనుడు!
'పైలట్​' అని చెప్పి 300మంది మహిళలను మోసం చేసిన ఘనుడు! (Sourced)

Man dupes women : సులభంగా డబ్బు సంపాదించడం అతడి ధ్యేయం. విమానాశ్రయాల్లో పనిచేసే మహిళలే అతడి టార్గెట్​. సామాజిక మాధ్యమాలే అతడి ఆయుధాలు. ఫేక్​ ఖాతాలా ద్వారా పరిచయం పెంచుకుని.. మహిళలను మోసం చేయడమే అతడి ప్లాన్​. ఇలా ఇప్పటివరకు 300మంది మహిళలను మోసం చేసిన అతడు.. చివరికి గురుగ్రామ్​ పోలీసులకు చిక్కాడు.

ట్రెండింగ్ వార్తలు

ఇలా ప్లాన్​ చేసి.. పడేసి!

నిందితుడు హేమంత్​ శర్మ.. సిక్కింలోని గ్యాంగ్​టక్​ వాసి. కాగా.. బెంగళూరు విమానాశ్రయంలో సిబ్బందిగా పనిచేసిన అనుభవం అతడికి ఉంది. అంతేకాకుండా.. ఓ 5స్టార్​ హోటల్​లో ఎగ్జిక్యూటివ్​ ఆఫిసర్​గానూ పనిచేశాడు. కానీ.. సులభంగా డబ్బు సంపాదించాలని భావించి.. నేరాలు చేయడం మొదలుపెట్టాడు. ఇందుకోసం మహిళలను మోసం చేస్తూ వచ్చాడు. విమానాశ్రయాలు, విమానాల్లో పనిచేసే మహిళా సిబ్బందే అతని టార్గెట్​.

చాలా కాలం బెంగళూరు కేంద్రంగానే అతడి కార్యకలాపాలు సాగాయి. సామాజిక మాధ్యమాల్లో 150కిపైగా ఫేక్​ ఖాతాలు తెరిచాడు. తనని తాను పైలట్​గా చెప్పుకుని మహిళా సిబ్బందికి ఫ్రెండ్​ రిక్వెస్ట్​లు పంపించడం మొదలుపెట్టాడు.

ముందు మహిళలతో పరిచయం ఏర్పరచుకుంటాడు హేమంత్​. కొంతకాలం బాగానే మాట్లాడతాడు. కానీ వాళ్లని కలవడు. రెండు, మూడు నెలలు గడిచేసరికి. వివిధ కారణాలు చెప్పి ఆ మహిళలను డబ్బులు అడుగుతాడు. క్రెడిట్​ కార్డ్​ పనిచేయడం లేదని, బ్యాంక్​ ఖాతా బ్లాక్​ అయ్యిందని చెప్పి డబ్బులు ఇవ్వమన్ని రిక్వెస్ట్​ చేస్తాడు. ఎవరైనా డబ్బులు ఇస్తే.. మోసపోయినట్టే! ఆ తర్వాత వాళ్లతో ఇక టచ్​లో ఉండడు. వెంటనే సిమ్​ తీసి మార్చేస్తాడు.

ఇలా బెంగళూరులోనే 100కుపైగా ఫోన్లు మార్చాడు హేమంత్​. 50కిపైగా సిమ్​ కార్డ్​లను వినియోగించాడు.

రెండేళ్ల క్రితం.. గురుగ్రామ్​కు తన మకాం మార్చాడు 25ఏళ్ల హేమంత్​. పైలట్​ అని చెప్పి, అక్కడ కూడా మోసాలు చేయడం మొదలుపెట్టాడు. ఆ విధంగా.. ఇప్పటివరకు 300మంది మహిళలను అతను మోసం చేసి రూ. 25లక్షలు కన్నా ఎక్కువ డబ్బులను దోచుకున్నాడు.

కాగా.. గల్ఫ్​ కోర్స్​ రోడ్డులోని ఓ మహిళ.. హేమంత్​ చేతిలో మోసపోయింది. కొన్ని రోజులకు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పుడే ఈ వ్యవహారం బయటపడింది. పోలీసులు ఒక్కో క్లూ పట్టుకుని కేసును పరిష్కరించారు. అప్పుడే.. హేమంత్​ చేస్తున్న మోసాల విషయం బయటపడింది.

ఇక బుధవారం.. హేమంత్​ను పోలీసులు అరెస్ట్​ చేశారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరిపారు. విచారణలో భాగంగా హేమంత్​.. తన నేరాన్ని అంగీకరించాడు.

IPL_Entry_Point

సంబంధిత కథనం