2008 Ahmedabad Blast | 38మందికి మరణశిక్ష.. 11మందికి జీవిత ఖైదు-2008 ahmedabad blast case 38 sentenced to death 11 get life imprisonment ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  2008 Ahmedabad Blast Case, 38 Sentenced To Death, 11 Get Life Imprisonment

2008 Ahmedabad Blast | 38మందికి మరణశిక్ష.. 11మందికి జీవిత ఖైదు

HT Telugu Desk HT Telugu
Feb 18, 2022 12:33 PM IST

Ahmedabad Bomb Blast Case | అహ్మదాబాద్​ బాంబు పేలుళ్ల కేసులో 49మందిని దోషులుగా తేలుస్తూ.. గుజరాత్​లోని ఓ ప్రత్యేక కోర్టు ఈనెల 8న తీర్పునిచ్చింది. తాజాగా.. వారిలో 38మందికి మరణశిక్ష, మరో 11మందికి జీవిత ఖైదు విధించింది.

2008 వరుస బాంబు పేలుళ్ల ఘటనపై తీర్పు సందర్భంగా సెషన్స్ కోర్టు ముందు బందోబస్తు(ఫైల్​ ఫొటో)
2008 వరుస బాంబు పేలుళ్ల ఘటనపై తీర్పు సందర్భంగా సెషన్స్ కోర్టు ముందు బందోబస్తు(ఫైల్​ ఫొటో) (PTI)

Ahmedabad blast case judgement | 2008 అహ్మదాబాద్​ వరుస బాంబు పేలుళ్ల కేసుకు సంబంధించి.. 49మంది దోషుల్లో 38మందికి మరణ శిక్ష విధించింది.. గుజరాత్​లోని ఓ ప్రత్యేక న్యాయస్థానం. మరో 11మందిని జీవిత ఖైదుగా తేల్చింది.

ఈ కేసులో 49మందిని దోషులుగా తేలుస్తూ.. ఈ నెల 8న తీర్పునిచ్చింది ప్రత్యేక కోర్టు. నగరాన్ని కుదిపేసిన 21 వరుస పేలుళ్లకు సంబంధించిన ఈ కేసులో బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద.. మరో 28 మంది నిందితులను న్యాయమూర్తి ఎ.ఆర్. పటేల్ నిర్దోషులుగా ప్రకటించారు. తాజాగా దోషులకు శిక్ష విధించారు.

ఉగ్రవాద ఘటనపై 13 ఏళ్ల తర్వాత తీర్పునిచ్చిన కోర్టు.. సెప్టెంబర్ 2021లో 77 మంది నిందితులపై విచారణను ముగించింది. 49 మంది నిందితులను ఉగ్రవాదానికి సంబంధించిన చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టంలోని సెక్షన్ 16 కింద దోషులుగా నిర్ధారించారు.

ఇదీ జరిగింది..

నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం)తో సంబంధం ఉన్న 78 మందిపై డిసెంబర్ 2009లో విచారణ ప్రారంభమైంది. వారిలో ఒకరు అప్రూవర్‌గా మారడంతో ఆ తర్వాత నిందితుల సంఖ్య 77కి తగ్గింది. మరో నలుగురు నిందితులను అరెస్టు చేశామని, అయితే వారి విచారణ ఇంకా ప్రారంభం కాలేదని ప్రభుత్వ సీనియర్ న్యాయవాది తెలిపారు. జూలై 26, 2008న 70 నిమిషాల వ్యవధిలో నగరంలో జరిగిన 21 పేలుళ్లలో 56 మంది మరణించారు. 200 మందికి పైగా గాయపడ్డారు. 

నిషేధిత స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్(సిమి)లో ఓ వర్గమైన ఇండియన్ ముజాహిదీన్‌తో సంబంధం ఉన్న వ్యక్తులు ఈ పేలుళ్లకు పాల్పడ్డట్టు పోలీసులు ఆరోపించారు. 2002 గోధ్రా అనంతర అల్లర్లలో మైనారిటీ వర్గానికి చెందిన పలువురు వ్యక్తులు మరణించినందుకు ప్రతీకారంగా ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులు ఈ పేలుళ్లను ప్లాన్ చేశారని ఆరోపించారు. అహ్మదాబాద్‌లో వరుస పేలుళ్లు జరిగిన కొన్ని రోజుల తర్వాత, పోలీసులు సూరత్‌లోని వివిధ ప్రాంతాల నుంచి బాంబులను స్వాధీనం చేసుకున్నారు, ఆ తర్వాత అహ్మదాబాద్‌లో 20, సూరత్‌లో 15 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. మొత్తం 35 ఎఫ్‌ఐఆర్‌లను కోర్టు విలీనం చేశాక విచారణ జరిగింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం