Income tax on Diwali gifts : దీపావళికి గిఫ్ట్స్ వచ్చాయా? అయితే ట్యాక్స్ కట్టాల్సిందే..!
Income tax on Diwali gifts : దీపావళికి మీకు బోనస్‌లు, గిఫ్ట్‌లు వచ్చాయా? అయితే వాటిపై మీరు పన్నులు చెల్లించే అవకాశం ఉంది. కొన్నింటికి మాత్రం మినహాయింపు ఉంది. అవేంటంటే..
Income tax on Diwali gifts : దీపావళి నేపథ్యంలో ఉద్యోగులకు బోనస్‌లు, వ్యాపారులకు గిఫ్ట్‌లు అందుతూ ఉంటాయి. ఇక కుటుంబసభ్యులు, స్నేహితులు.. మిఠాయిలతో పాటు విలువైన వస్తువులను బహుమతులుగా ఇచ్చిపుచ్చుకుంటారు. అంతా బాగానే ఉంది కానీ.. చాలా మంది ఈ గిఫ్ట్‌లపై ట్యాక్స్ కట్టే విషయాన్ని మర్చిపోతూ ఉంటారు. ఇంతకి ఏ గిఫ్ట్‌లు ట్యాక్స్ పరిధిలోకి వస్తాయి?
రూ. 50,000 మించితే..
దీపావళికి వచ్చే కొన్ని బహుమతులు, నగదు.. ఆర్థిక ఏడాదిలో కట్టాల్సిన ట్యాక్స్ పరిధిలోకి వస్తాయి. అయితే.. ఇది ఆయా వస్తువుల వాల్యూపై ఆధారపడి ఉంటుంది.
Tax exemption on Diwali gifts : కొన్నింటికి మినహాయింపు ఉంటుంది. వాటిపై ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ వాటిని ఐటీఆర్(ఆదాయపు పన్ను రిటర్నులు)లో డిస్క్లోజ్ చేయాల్సి ఉంటుంది.
సాధారణంగా.. ఒక ఆర్థిక ఏడాదిలో గిఫ్ట్‌ల విలువ రూ. 50,000 దాటితే.. సెక్షన్ 56(2) కింద పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ గిఫ్ట్‌లు.. నగదు లేదా వస్తువుల రూపంలో ఉండొచ్చు.
అయితే.. కుటుంబసభ్యులు, బంధువులు ఇచ్చిపుచ్చుకునే బహుమతులపై ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఇవి పన్ను మినహాయింపులోకి వస్తాయి. అంటే.. సోదరులు, సోదరీమణులు, తల్లిదండ్రులు, జీవిత భాగస్వాములు ఇచ్చే గిఫ్ట్‌లపై ట్యాక్స్ చెల్లించాల్సిన పని లేదు. అయితే.. ఈ జాబితాలో స్నేహితులు లేరు. అందువల్ల స్నేహితులు ఇచ్చే నగదు లేదా బహుమతులపై పన్నులు చెల్లించాల్సి ఉంటుంది(రూ. 50వేలు మించితే).
ఇక గిఫ్ట్‌లు అనేవి భూమి, భవనం రూపంలో ఉంటే.. వాటిని ఇమ్మూవెబుల్ ప్రాపర్టీగా పరిగణిస్తారు. వీటిపై స్టాంప్ డ్యూటీ వాల్యూ రూ. 50,000 మించి ఉంటే.. కచ్చితంగా పన్నులు చెల్లించాల్సి ఉంటుంది.
ఇక ఆభరణాలు, పెయింటింగ్స్, డ్రాయింగ్స్, షేర్లు, కలెక్షన్లు వంటి మూవెబుల్ ప్రాపర్టీ విలువ.. రూ. 50,000 దాటితే ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఈ జాబితాలో వాహనాలు లేవు. అందువల్ల ఇందులో ట్యాక్స్‌లు కట్టాల్సిన అవరసం లేదు.
సంబంధిత కథనం