Update address in Aadhaar online:ప్రూఫ్ లేకున్నా ఇకపై ఆధార్ లో అడ్రెస్ అప్ డేట్-uidai allows updating address in aadhaar online with consent from head of family ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Uidai Allows Updating Address In Aadhaar Online With Consent From Head Of Family

Update address in Aadhaar online:ప్రూఫ్ లేకున్నా ఇకపై ఆధార్ లో అడ్రెస్ అప్ డేట్

HT Telugu Desk HT Telugu
Jan 03, 2023 07:42 PM IST

Aadhaar Update: మీ చిరునామా మారిందా? మీ పేరుతో అడ్రెస్ ప్రూఫ్స్ ఏమీ లేవా? ఆధార్ కార్డులో అడ్రెస్ ను మార్చుకోవడం ఇబ్బందిగా మారిందా?

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (File)

Aadhaar Update: ఆన్ లైన్ లో ఆధార్ కార్డులో చిరునామా మార్పునకు సంబంధించి UIDAI కీలక మార్పును తీసుకువచ్చింది. సాధారణంగా కొత్త అడ్రెస్ తో ఏదైనా డాక్యుమెంట్ రుజువు ఉంటే, దాన్ని అప్ లోడ్ చేయడం ద్వారా ఆన్ లైన్ లో అడ్రెస్ ను అప్ డేట్ చేసుకోవచ్చు.

Address change in Aadhaar: కుటుంబ పెద్ద అనుమతితో..

తాజాగా, కుటుంబ పెద్ద నిర్ధారణతో కూడా ఆన్ లైన్ లో అడ్రెస్ ను మార్చుకోవచ్చని UIDAI వెల్లడించింది. కుటుంబ పెద్దతో తన సంబంధాన్ని నిర్ధారించే ప్రూఫ్ ఉన్న డాక్యుమెంట్ ను సబ్మిట్ చేయడం ద్వారా అడ్రెస్ ను ఆన్ లైన్ లో మార్చుకోవచ్చని UIDAI తెలిపింది. రేషన్ కార్డు, మార్క్స్ షీట్, మ్యారేజ్ సర్టిఫికెట్, పాస్ పోర్ట్.. మొదలైన వాటిలో కుటుంబ పెద్దతో ఉన్న సంబంధాన్ని నిర్ధారించే రుజువు ఉంటుంది. అలాంటి, డాక్యుమెంట్ ను అప్ లోడ్ చేసి, ఇతర అవసరమైన వివరాలు ఫిల్ చేసి, ఆన్ లైన్ లో అడ్రెస్ మార్పు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

Address change in Aadhaar: ఓటీపీ బేస్డ్..

ఈ ఆన్ లైన్ అడ్రెస్ మార్పు ఓటీపీ ఆథెంటికేషన్ ద్వారా పూర్తవుతుంది. కుటుంబ పెద్ద తో సంబంధాన్ని నిర్ధారించే డాక్యుమెంట్ ను అప్ లోడ్ చేసి, అవసరమైన ఇతర వివరాలు ఫిల్ చేసి, ఆన్ లైన్ లో అడ్రెస్ మార్పు కోసం దరఖాస్తు చేసుకున్న తరువాత కుటుంబ పెద్ద రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి.

Address change in Aadhaar: డాక్యుమెంట్లేవీ లేకపోతే..?

ఒకవేళ ఆ కుటుంబ పెద్దతో దరఖాస్తుదారుకు ఉన్న సంబంధాన్ని నిర్ధారించే పత్రమేదీ లేకపోయినా.. ఆన్ లైన్ లో అడ్రెస్ ను మార్చుకోవడానికి మరో మార్గం ఉంది. UIDAI నిర్ధారించిన ప్రొఫార్మాలో కుటుంబ పెద్ద నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ను సమర్పించడం ద్వారా కూడా ఆన్ లైన్ లో చిరునామాను మార్చుకోవచ్చు. చదువు, ఉద్యోగం, పెళ్లి, తదితర వివిధ కారణాల వల్ల చిరునామా మారిన వారికి UIDAI కొత్త వెసులుబాటు ఎంతో ప్రయోజనం చేకూర్చనుంది.

WhatsApp channel