Stock Market: లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ 42 పాయింట్లు అప్
Stock Market Today: భారత ఈక్విటీ సూచీలు నేడు లాభాలతో మొదలయ్యాయి. అమెరికా మార్కెట్లలో ప్రతికూలత, జీడీపీ డేటా విడుదల కానున్న నేపథ్యంలోనూ పాజిటివ్‍గా ఆరంభమయ్యాయి.
Stock Market Today: వరుస సెషన్లలో లాభాలను మూటగట్టుకున్న భారత స్టాక్ మార్కెట్ సూచీలు నేడు కూడా పాజిటివ్‌గా మొదలయ్యాయి. ఓపెనింగ్ సమయంలో సెన్సెక్స్ 127.21 పాయింట్లు లాభపడి 62,809 వద్ద ట్రేడ్ అవుతోంది. దేశీయ స్టాక్ ఎక్చ్సేంజ్ నిఫ్టీ 42 పాయింట్లు బలపడి 18,660 వద్ద కొనసాగుతోంది. అమెరికా మార్కెట్లలో ప్రతికూలత కాస్త ప్రభావం చూపలేకపోయింది. అలాగే వార్షిక జీడీపీ డేటా కూడా నేడు వెల్లడి కావాల్సి ఉంది.
ట్రెండింగ్ వార్తలు
టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్
Top Gainers, Top losers List: బుధవారం మార్కెట్ ఓపెనింగ్‍లో ఎక్కువ లాభాలతో మొదలైన ఐడీఎఫ్‍సీ, టీవీఎస్ మోటార్స్, గోద్రెజ్ కంజ్యూమర్స్, బజాజ్ ఆటో, ఏబీబీ ఇండియా స్టాక్‍లు టాప్ గెయినర్లుగా ఉన్నాయి. సీజీ కంజ్యూమర్స్, జుబిలియంట్ ఫుడ్, ఇంటర్ గ్లోబ్ ఏవీఐ, హెచ్‍పీసీఎల్ నష్టాలతో ఓపెన్ అయి టాప్ లూజర్లుగా మొదలయ్యాయి.
Pre-Market Session: ప్రీ మార్కెట్ సెషన్‍లోనూ సూచీలు పెద్దగా కదల్లేదు. నిఫ్టీ 7.65 పాయింట్లు బలపడి 18,625 వద్దకు చేరింది. సెన్సెక్స్ 61.91 పాయింట్లు పెరిగి 62,743 పాయింట్ల వద్ద నిలిచింది.
Uniparts India IPO: యునిపార్ట్స్ ఇండియా ఐపీఓ నేడే ఓపెన్
ఈనెలలో చివరి ఐపీవోగా యునిపార్ట్స్ ఇండియా అడుగుపెట్టనుంది. ఈ ఐపీవో సబ్‍స్క్రిప్షన్ నేడు మొదలవుతుంది. డిసెంబర్ 2న సబ్‍స్క్రిప్షన్ గడువు ముగుస్తుంది. ఐపీవో ప్రైజ్ బ్యాండ్‍ను రూ.548-రూ.577గా ఆ కంపెనీ నిర్ణయించింది. ఇంజినీర్డ్ సిస్టమ్‍లను యునిపార్ట్స్ ఇండియా ఉత్పత్తి చేస్తుంది. ఈ ఐపీవో ద్వారా రూ.835.6 కోట్ల నిధులను ఆ కంపెనీ సమీకరించనుంది.
అమెరికా మార్కెట్లు డౌన్
అమెరికా మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. యాపిల్, అమెజాన్ లాంటి భారీ సంస్థల షేర్లు పడిపోవడం తీవ్ర ప్రభావాన్ని చూపాయి. యూఎస్ ఫెడ్ చైర్మన్ జెరోన్ పావెల్.. వడ్డీ రేట్లపై బుధవారం సంకేతాలు ఇస్తారన్న అంచనాలు ఉండటంతో మదుపరులు అచితూచి వ్యవహరించారు. అమెరికన్ ఈక్విటీ సూచీలు.. నాస్‍డాక్ కంపోజైట్ 65 పాయింట్లు క్షీణించి.. 10,983.78 వద్ద స్థిరపడింది. ఎస్&పీ 500 6.31 పాయింట్లు కోల్పోయి 3,957కు చేరింది. అయితే డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ స్థిరంగా 33,852 పాయింట్ల వద్ద స్థిరపడింది.
మరోవైపు ఆసియా మార్కెట్లు బుధవారం మిశ్రమంగా ఉన్నాయి. జపాన్ సూచీ నిక్కి, టాపిక్స్, సౌత్ కొరయా కోస్పీ నష్టాల్లో ట్రేడవుతోంది. మరోవైపు ద్రవ్యోల్బణం తగ్గుతుందన్న అంచనాలతో ఆస్ట్రేలియా మార్కెట్లు సానుకూలంగా ఉన్నాయి.
ఎఫ్‍ఐఐలు, డీఐఐలు
ఇండియా మార్కెట్లలో మంగళవారం విదేశీ మదుపరులు కొనుగోళ్ల వైపు నిలిచారు. ఫారిన్ ఇన్‍స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (FIIs) రూ.1,241.57 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. డొమెస్టిక్ ఇన్‍స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (DIIs) రూ.744.42 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు.