Stock Market Today: ఫ్లాట్‍గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు-stock market opens in flat note amid global weak sentiments svb crisis ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Stock Market Opens In Flat Note Amid Global Weak Sentiments Svb Crisis

Stock Market Today: ఫ్లాట్‍గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 13, 2023 09:17 AM IST

Stock Market Today: స్టాక్ మార్కెట్లు నేడు ఫ్లాట్‍గా మొదలయ్యాయి. ఆసియా మార్కెట్లలో అధిక శాతం నష్టాల్లో ఉన్నాయి.

స్టాక్ మార్కెట్ ఓపెనింగ్
స్టాక్ మార్కెట్ ఓపెనింగ్ (MINT_PRINT)

Stock Market Today: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు (మార్చి 13, సోమవారం) ఫ్లాట్‍గా ప్రారంభమయ్యాయి. సెషన్ ఆరంభంలో జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 24.30 పాయింట్లు పెరిగి 17,437.20 వద్ద ట్రేడ్ అవుతోంది. బీఎస్ఈ సెన్సెక్స్ 71.59 పాయింట్లు పెరిగి 59,191.87 వద్ద కొనసాగుతోంది. ఆరంభంలో సూచీలు లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. శుక్రవారం సెషన్‍లో అమెరికా మార్కెట్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. నేడు ఆసియా-పసిఫిక్ మార్కెట్లలో ఎక్కువ శాతం రెడ్‍లో ఓపెన్ అయ్యాయి. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ సంక్షోభం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేటు పెంపుపై అంచనాలు గ్లోబల్ మార్కెట్లపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి.

లాభాలు, నష్టాలు

సెషన్ ఆరంభంలో లాభపడిన టెక్ మహీంద్రా, అదానీ ఎంటర్‌ప్రైజెస్, అంబుజా సిమెంట్స్, ఫర్స్ సోర్స్, హిందాల్కో, నాల్కో, ఐసీఐసీఐ లాంబార్డ్ స్టాక్స్ టాప్ గెయినర్లుగా ఉన్నాయి. ఇండస్‍ఇండ్ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, మదర్సన్, ఇండియామార్ట్, ఇండస్ టవర్స్, బాలకృష్ణ ఇండస్ట్రీస్ స్టాక్స్ టాప్ లూజర్లుగా సెషన్‍ను మొదలుపెట్టాయి.

అమెరికా మార్కెట్లు

అమెరికా మార్కెట్లు శుక్రవారం సెషన్‍లో కుప్పకూలాయి. నాస్‍డాక్ కంపోజైట్ 199.4 పాయింట్లు నష్టపోయి 11,138.89 వద్దకు పడిపోయింది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 345.22 పాయింట్లు క్షీణించి 31,909.64 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్&పీ 500 సూచీ 56.73 పాయింట్లు కోల్పోయి 31,909.64 వద్ద స్థిరపడింది.

ఆసియా-పసిఫిక్ లో అధిక శాతం మార్కెట్లు నేడు నష్టాలతోనే ట్రేడ్ అవుతున్నాయి. దక్షిణ కొరియాలో కోస్పీ, జపాన్‍లో నిక్కీ సూచీలు 1 శాతం మేర నష్టపోయాయి. ఆస్ట్రేలియా మార్కెట్లు కూడా డౌన్‍లో ఉన్నాయి. చైనా మార్కెట్లు మాత్రమే లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి.

డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ప్రస్తుతం రూ.81.80 వద్ద ఉంది. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్‍వీబీ) సంక్షోభంతో డాలర్‌పై ఒత్తిడి కనిపిస్తోంది. ఎస్‍వీబీ దివాళాకు పరిష్కారం కనుగొనేందుకు వివిధ మార్గాలను పరిశీలిస్తున్నామని అమెరికా ప్రభుత్వం సోమవారం వెల్లడించింది.

WhatsApp channel