Stock Market News Today: లాభాలతో స్టాక్ మార్కెట్లు షురూ.. నిఫ్టీ 58 పాయింట్లు అప్-stock market news today november 23 sensex nifty indices open in green ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Stock Market News Today November 23 Sensex Nifty Indices Open In Green

Stock Market News Today: లాభాలతో స్టాక్ మార్కెట్లు షురూ.. నిఫ్టీ 58 పాయింట్లు అప్

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 23, 2022 09:19 AM IST

Stock market News Today: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు లాభాలతో మొదలయ్యాయి. అమెరికా మార్కెట్లు జోష్ కనబరచటంతో ఆ ప్రభావం భారత్‍పై పడింది.

Stock Market News Today: లాభాలతో స్టాక్ మార్కెట్లు షురూ..
Stock Market News Today: లాభాలతో స్టాక్ మార్కెట్లు షురూ..

Stock markets Opening News Today: భారత స్టాక్ మార్కెట్లు నేడు (నవంబర్ 23) లాభాలతో ప్రారంభయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూలతలతో దేశీయ మార్కెట్లు బుధవారం గ్రీన్‍లో ఓపెన్ అయ్యాయి. దేశీయ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ (Nifty) 58.25 పాయింట్లు బలపడి 18,302.45 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. బీఎస్ఈ సెన్సెక్స్ (Sensex) 173.47 పాయింట్లు పెరిగి 61,592.51 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. గత ట్రేడింగ్ సెషన్ జోష్‍ను కొనసాగిస్తున్నాయి.

టాప్ గెయినర్స్.. టాప్ లూజర్స్

నేటి సెషన్ ప్రారంభంలో సన్ టీవీ నెట్‍వర్క్, హిందాల్‍కో, మనప్పురమ్ ఫైనాన్స్, లుపిన్.. స్టాక్స్ ఎక్కువ లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. సిమెన్స్, ఎస్కార్ట్ ఇండియా, మ్యాక్స్ ఫైనాన్షియల్స్, డెల్పా కార్ప్.. షేర్లు అధిక నష్టాలతో ఓపెన్ అయ్యాయి.

Pre Market Session: ప్రీ మార్కెట్ సెషన్‍లో నిఫ్టీ 114.40 పాయింట్లు లాభపడి 18,358 పాయింట్లకు చేరింది. సెన్సెక్స్ 514 పాయింట్లు బలపడి 61,933కు పెరిగింది.

US Markets: అమెరికా మార్కెట్‍లలో జోష్

అమెరికా మార్కెట్ సూచీలు మంగళవారం దూకుడు ప్రదర్శించాయి. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 397.82 పాయింట్లు పెరిగి, 34,098.1 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఎస్ అండ్ పీ 500 కూడా 53.64 పాయింట్లు వృద్ధి చెంది.. 4,003.58కు చేరింది. నాస్ డాక్ కంపోజైట్ 149.90 పాయింట్లు అధికమై.. 11,174.41 వద్ద స్థిరపడింది.

యూఎస్ మార్కెట్లలో జోష్‍తో ఆసియాలో చాలా మార్కెట్లు బుధవారం లాభాలతో మొదలయ్యాయి. సౌత్ కొరియా సూచీ కోస్పీ 0.56 శాతం పెరిగింది. పబ్లిక్ హాలీడే కారణంగా జపాన్ మార్కెట్‍లు నేడు మూతపడ్డాయి.

ఎఫ్ఐఐ, డీఐఐ డేటా

మంగళవారం భారత మార్కెట్‍లలో విదేశీ ఇన్వెస్టర్లు ఎక్కువగా అమ్మకాల వైపు మొగ్గుచూపారు. మొత్తంగా నవంబర్ 22న ఫారిన్ ఇన్‍స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (FIIs) రూ.697.83 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు. దేశీయ పెట్టుబడిదారులైన.. డొమెస్టిక్ ఇన్‍స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (DIIs) రూ.639.39 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. ఎన్ఎస్ఈ డేటా ఈ విషయాలను వెల్లడించింది.

ప్రపంచవ్యాప్తంగా మందగమనం ఉన్నా, ఆసియాలో వేగంగా అభివృద్ధి చెందే అర్థిక వ్యవస్థల్లో భారత్ ఉంటుందని ఎకమిక్ కార్పొరేషన్ డెవలప్‍మెంట్ ఆర్గనైజేషన్ (OECD) అంచనా వేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో సౌదీ అరేబియా తర్వాత ఇండియా వేగంగా వృద్ధి చెందే దేశంగా నిలుస్తుందని తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటు 6.6 శాతంగా ఉంది.

చమురు ధరలు

అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం బ్రెంట్ ముడిచమురు ధర 80.97 డాలర్లుగా ఉంది.

క్రిప్టో మార్కెట్ కూడా బుధవారం కోలుకుంది. బిట్ కాయిన్, ఇథేరిమ్ లాభాల్లో ట్రేడవుతున్నాయి.

WhatsApp channel

టాపిక్