Stock market news today : ఫ్లాట్​గా దేశీయ సూచీలు.. నిఫ్టీకి 10 పాయింట్ల లాభం-stock market news today 24th march 2023 sensex and nifty opens on a flat note ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Stock Market News Today 24th March 2023 Sensex And Nifty Opens On A Flat Note

Stock market news today : ఫ్లాట్​గా దేశీయ సూచీలు.. నిఫ్టీకి 10 పాయింట్ల లాభం

Sharath Chitturi HT Telugu
Mar 24, 2023 09:19 AM IST

Stock market news today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ట్రేడ్​ అవుతున్నాయి. అమెరికా స్టాక్​ మార్కెట్​లు స్వల్ప లాభాల్లో ముగిశాయి.

ఇండియా స్టాక్​ మార్కెట్​
ఇండియా స్టాక్​ మార్కెట్​ (PTI)

-Stock market news today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ను ఫ్లాట్​గా ప్రారంభించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 82 పాయింట్లు పెరిగి 58,007 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. 10 పాయింట్లు పెరిగి 17,087 వద్ద ట్రేడ్​ అవుతోంది.

ట్రెండింగ్ వార్తలు

అంతర్జాతీయ ప్రతికూల పవనాల నేపథ్యంలో గురువారం ట్రేడింగ్​ సెషన్​లో దేశీయ సూచీలు నష్టపోయాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 289 పాయింట్ల నష్టంతో 57,925 వద్ద ముగిసింది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 75 పాయింట్లు పతనమై 17,076 వద్ద స్థిరపడింది. బ్యాంక్​ నిఫ్టీ 382 పాయింట్లు కోల్పోయి 39,616 వద్దకు చేరింది. ఇక శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ను సెన్సెక్స్​, నిఫ్టీలు వరుసగా 57891- 17076 వద్ద మొదలు పెట్టాయి.

స్టాక్​ మార్కెట్​ నిపుణుల ప్రకారం.. నిఫ్టీ షార్ట్​ టర్మ్​ ట్రెండ్​ బేరిష్​గా ఉంది. ప్రతి ర్యాలీలోనూ అమ్మకాల జోరు కనిపిస్తోంది. ఎఫ్​ఐఐలు షార్ట్​ పొజిషన్లను భారీగా బిల్డ్​ చేయడం ఇందుకు ఓ కారణం.

స్టాక్స్​ టు బై..

Stocks to buy today : ఓఎన్​జీసీ:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 148, టార్గెట్​ రూ. 156- రూ. 158

జైడస్​ లైఫ్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 470, టార్గెట్​ రూ. 495- రూ. 500

Tata Motors share price target : టాటా మోటార్స్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 399, టార్గెట్​ రూ. 440

కోల్గేట్​ పాల్మోలివ్​:- బై రూ. 1521, స్టాప్​ లాస్​ రూ. 1480, టార్గెట్​ రూ. 1560

ITC share price target : ఐటీసీ:- బై రూ. 380, స్టాప్​ లాస్​ రూ. 374, టార్గెట్​ రూ. 392

(ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు.. ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

లాభాలు.. నష్టాలు..

హెచ్​సీఎల్​ టెక్​, ఇన్ఫీ, టెక్​ఎం, టీసీఎస్​, విప్రో షేర్లు లాభాల్లో ఉన్నాయి.

హెచ్​డీఎఫ్​సీ, టైటాన్​, సన్​ఫార్మా షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

అంతర్జాతీయ స్టాక్​ మార్కెట్​లు..

అమెరికా స్టాక్​ మార్కెట్​లు గురువారం ట్రేడింగ్​ సెషన్​ను స్వల్ప లాభాలతో ముగించాయి. డౌ జోన్స్​ 0.23శాతం, ఎస్​ అండ్​ పీ 500 0.3శాతం, నాస్​డాక్​ 1.01శాతం మేర లాభపడ్డాయి.

US Stock market investment tips in telugu : ఆసియా మార్కెట్​లు నష్టాల్లో ఉన్నాయి. ఎర్లీ ట్రేడ్​లో జపాన్​ నిక్కీ 0.38శాతం, సౌత్​ కొరియా కాస్పీ 0.23శాతం, ఎస్​ అండ్​ పీ 200 0.59శాతం మేర నష్టపోయాయి.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 995.01 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1,668.95కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

WhatsApp channel

సంబంధిత కథనం