Rekha Jhunjhunwala: ఈ స్టాక్ తో రూ. 1000 కోట్లు సంపాదించిన రేఖ-rekha jhunjhunwala earns rs 1000 crore from this tata stock in two weeks ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Rekha Jhunjhunwala Earns <Span Class='webrupee'>₹</span>1000 Crore From This Tata Stock In Two Weeks

Rekha Jhunjhunwala: ఈ స్టాక్ తో రూ. 1000 కోట్లు సంపాదించిన రేఖ

HT Telugu Desk HT Telugu
Feb 16, 2023 02:27 PM IST

Rekha Jhunjhunwala: ఇండియన్ వారెన్ బఫెట్ గా పేరుగాంచిన రాకేశ్ ఝున్ ఝున్ వాలా (Rakesh Jhunjhunwala) భార్య రేఖ ఝున్ ఝున్ వాలా (Rekha Jhunjhunwala). రాకేశ్ ఝున్ ఝున్ వాలా ఇటీవల గుండెపోటుతో మరణించారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Rekha Jhunjhunwala: రాకేశ్ ఝున్ ఝున్ వాలా (Rakesh Jhunjhunwala) భార్య రేఖ ఝున్ ఝున్ వాలా (Rekha Jhunjhunwala) టాటా కంపెనీకి చెందిన ఒక స్టాక్ తో రూ. 1000 కోట్ల లాభం పొందారు. అది కూడా జస్ట్ రెండు వారాల వ్యవధిలోనే.

ట్రెండింగ్ వార్తలు

Titan Company Ltd shares: టైటన్ షేర్లతో..

2023 కేంద్ర బడ్జెట్ ను ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టారు. ఆ మర్నాడు, ఫిబ్రవరి 2న టాటా గ్రూప్ నకు చెందిన టైటన్ కంపెనీ లిమిటెడ్ (Titan Company Ltd) షేరు ధర రూ. 2,310 వద్ద ముగిసింది. గత రెండు వారాలుగా ఆ షేరు ధర క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఫిబ్రవరి 15 నాటికి అది రూ. 2,535 కి చేరింది. అంటే, ఒక్కో షేరు విలువ రెండు వారాల వ్యవధిలో రూ. 225 పెరిగింది.

Rekha Jhunjhunwala: రేఖ ఝున్ ఝున్ వాలా కు లాభాలు..

టైటన్ కంపెనీ (Titan Company Ltd) షేర్లు రేఖ ఝున్ ఝున్ వాలా (Rekha Jhunjhunwala) వద్ద ప్రస్తుతం 4,58,95,970 ఉన్నాయి. అంటే, సుమారు నాలుగున్నర కోట్ల షేర్లు ఆమె వద్ద ఉన్నాయి. టైటన్ కంపెనీ (Titan Company Ltd) మొత్తం పెయిడ్ అప్ కేపిటల్ లో ఇది 5.17%. ఒక్కో షేరు విలువ గత రెండు వారాల్లో రూ. 225 పెరిగిన నేపథ్యంలో.. రేఖ ఝున్ ఝున్ వాలా (Rekha Jhunjhunwala) వద్ద ఉన్న టైటన్ షేర్ల విలువ ఇప్పడు రూ. 10,32,65,93,250. అంటే వెయ్యి కోట్లకు పైమాటే.

WhatsApp channel

టాపిక్