Ratan Tata Birthday:రతన్ టాటా బర్త్ డే ఈ రోజు..ఆయన గురించి ఈ విషయాలు తెలుసా మీకు-ratan tata birthday leaders extend their wishes and 5 facts about the top industrialist ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Ratan Tata Birthday: Leaders Extend Their Wishes And 5 Facts About The Top Industrialist

Ratan Tata Birthday:రతన్ టాటా బర్త్ డే ఈ రోజు..ఆయన గురించి ఈ విషయాలు తెలుసా మీకు

Sudarshan Vaddanam HT Telugu
Dec 28, 2022 02:46 PM IST

Ratan Tata Birthday: ప్రముఖ పారిశ్రామిక వేత్త, సేవాగుణ సంపన్నుడు రతన్ టాటా పుట్టిన రోజు ఈ రోజు. 85 ఏళ్ల క్రితం, 1937 డిసెంబర్ 28న ఆయన జన్మించారు.

రతన్ టాటా
రతన్ టాటా (Instagram/@ratantata)

Ratan Tata Birthday: టాటా గ్రూప్ చైర్మన్, భారతీయ పారిశ్రామిక దిగ్గజాల్లో ఒకరైన రతన్ టాటా జన్మదినం ఈ రోజు. పుట్టిన రోజు సందర్భంగా రతన్ టాటాకు అనేక పారిశ్రామిక, వాణిజ్య, రాజకీయ వర్గాల ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. రతన్ టాటా జీవితం, జీవన శైలి, సేవా గుణం, దాతృత్వం, సహృదయత, వినయ సంపన్నత, నిరాడంబరత.. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి స్ఫూర్తి దాయకం.

ట్రెండింగ్ వార్తలు

Ratan Tata Birthday: శుభాకాంక్షల వెల్లువ

జన్మదినోత్సవం సందర్భంగా రతన్ టాటాకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. వ్యక్తిగతంగా, సోషల్ మీడియాలో మిత్రులు, అభిమానులు ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పారు. బీజేపీ సీనియర్ నేత, మహారాష్ట్ర డెప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్, శివసేన(ఉద్ధవ్ వర్గం) నేత ఆదిత్య ఠాక్రే, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, ప్రహ్లాద్ జోషి, టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు తదితరులు రతన్ టాటాకు శుభాకాంక్షలు తెలిపారు. రతన్ టాటా చిరకాలం ఆయురారోగ్యాలతో విలసిల్లాలని వారు ఆకాంక్షించారు.

Ratan Tata Birthday: టాటా గురించి కొన్ని విశేషాలు..

  • ‘అసాధ్యం అని అందరూ నిర్ణయించిన వాటిని సుసాధ్యం చేయడంలోనే నాకు గొప్ప ఆనందం కలుగుతుంది’ అన్న రతన్ టాటా వీడియో క్లిప్ ఇప్పటికీ చాలా మందికి ఇష్టమైన ఇన్ స్పిరేషనల్ కోట్.
  • టాటా గ్రూప్ ను స్థాపించిన జంషెడ్జీ టాటా ముని మనవడు రతన్ టాటా.రతన్ టాటా తల్లిదండ్రులు నవల్ టాటా, సూనీ టాటా.
  • కార్నెల్ యూనివర్సిటీ నుంచి స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ తో ఆర్కటెక్చరల్ డిగ్రీ పొందారు.
  • హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి అడ్వాన్స్ డ్ మేనేజ్మెంట్ ప్రొగ్రామ్ ను 1975లో పూర్తి చేశారు.
  • టాటా గ్రూప్ లో అసిస్టెంట్ గా 1962లో తన ప్రయాణం ప్రారంభించారు. నేషనల్ రేడియో అండ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీలో 1971లో డైరెక్టర్ ఇన్ చార్జిగా బాధ్యతలు చేపట్టారు.
  • 1991లో టాటా గ్రూప్ చైర్మన్ బాధ్యతల నుంచి జేఆర్ డీ టాటా వైదొలగి, ఆ బాధ్యతలను రతన్ టాటాకు అప్పగించారు.
  • భారత్ లో ఆర్థిక సంస్కరణల యుగం ప్రారంభమైన సమయంలోనే రతన్ టాటా టాటా గ్రూప్ నిర్వహణ బాధ్యతలను స్వీకరించడం గమనార్హం. ఆర్థిక సంస్కరణలకు అనుగుణంగా కొత్త ప్రొడక్ట్ లైన్ తో టాటా గ్రూప్ ను విస్తరిస్తూ, విజయవంతమైన పారిశ్రామిక వేత్తగా నిలిచారు.
  • రతన్ టాటా హయాంలోనే టాటా మోటార్స్ అంతర్జాతీయ బ్రాండ్ జాగ్వార్ లాండ్ రోవర్ ను; టాటా స్టీల్ కోరస్ ను; టాటా టీ టెట్లీని విలీనం చేసుకున్నాయి.
  • 2022 భారతీయ సంపన్నుల జాబితాలో రతన్ టాటా స్థానం 421.

WhatsApp channel