Petrol price in Hyderabad : దేశంలో పెట్రోల్​, డీజిల్​ ధరలు పెరిగాయా?-petrol diesel prices on march 27 2023 check rates in hyderabad and other cities ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Petrol, Diesel Prices On March 27 2023: Check Rates In Hyderabad And Other Cities

Petrol price in Hyderabad : దేశంలో పెట్రోల్​, డీజిల్​ ధరలు పెరిగాయా?

Sharath Chitturi HT Telugu
Mar 27, 2023 08:44 AM IST

Petrol price in Hyderabad : హైదరాబాద్​లో లీటరు పెట్రోల్​ ధర రూ. 109.66గా ఉంది. లీటరు డీజిల్​ ధర రూ. 97.82గా ఉంది.

దేశంలో పెట్రోల్​, డీజిల్​ ధరలు పెరిగాయా?
దేశంలో పెట్రోల్​, డీజిల్​ ధరలు పెరిగాయా?

Petrol and Diesel price in India : దేశవ్యాప్తంగా పెట్రోల్​, డీజిల్​ ధరలు సోమవారం స్థిరంగా ఉన్నాయి. వరుసగా 9 నెలల పాటు ఇంధన ధరల్లో మార్పులు చోటుచేసుకోలేదు. దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ. 96.72గా ఉంది. లీటరు డీజిల్​ ధర రూ. 89.62గా ఉంది. ఇక ముంబైలో పెట్రోల్​ ధర లీటరుకు రూ. 106.31 పలుకుతోంది. లీటరు డీజిల్​ ధర రూ. 94.27గా ఉంది.

హైదరాబాద్​లో పెట్రోల్​, డీజిల్​ ధరలు ఇలా..

కోల్​కతాలో లీటరు పెట్రోల్​ ధర రూ. 106.03గాను, లీటరు డీజిల్​ ధర రూ. 92.76గాను ఉంది. చెన్నైలో లీటరు పెట్రోల్​, డీజిల్​ ధరలు వరుసగా రూ. 102.63, రూ. 94.24గా ఉన్నాయి.

ఇక తెలంగాణ హైదరాబాద్​లో లీటరు పెట్రోల్​ ధర రూ. 109.66గాను, డీజిల్​ ధర రూ. 97.82గాను ఉంది. ఆంధ్రప్రదేశ్​ విజయవాడలో లీటరు పెట్రోల్​ ధర రూ. 111.76గా ఉండగా.. లీటరు డీజిల్​ ధర రూ. 99.51గా ఉంది.

వివిధ నగరాల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు ఇలా..

నగరంపెట్రోల్​ (రూ/లీటర్​)డీజిల్​ (రూ/లీటర్​)
జైపూర్​108.4893.72
లక్నో96.5789.76
బెంగళూరు101.9487.89
భోపాల్108.6593.90
పట్నా108.1294.86

2022 మేలో చివరిసారిగా..

కేంద్రప్రభుత్వం.. దేశంలో ఇంధన ధరలను చివరిసారిగా 2022 మేలో సవరించింది. పెట్రోల్​, డీజిల్​పై ఎక్సైజ్​ సుంకాలను లీటరుకు రూ. 8, రూ. 6 తగ్గించింది. ఫలితంగా పెట్రోల్​, డీజిల్​ ధరలు వరుసగా రూ. 9.5, రూ. 7 తగ్గాయి. మహారాష్ట్ర ప్రభుత్వం ఇంధన ధరలపై వ్యాట్​ను తగ్గించింది. ఫలితంగా ఆ ప్రాంతంలో లీటరు పెట్రోల్​, లీటరు డీజిల్​పై రూ. 5, రూ. 3 తగ్గాయి.

పెట్రోల్​ ధరలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటాయి. వివిధ రాష్ట్రాల్లో పన్నులు వేరువేరుగా ఉండటమే ఇందుకు కారణం.

WhatsApp channel

సంబంధిత కథనం