Penny stock to consider bonus shares: 3:10 బోనస్ షేర్లు ఇవ్వనున్న పెన్నీ స్టాక్-penny stock to consider 3 10 bonus shares scrip tumbles by 9 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Penny Stock To Consider 3:10 Bonus Shares, Scrip Tumbles By 9%

Penny stock to consider bonus shares: 3:10 బోనస్ షేర్లు ఇవ్వనున్న పెన్నీ స్టాక్

HT Telugu Desk HT Telugu
Nov 23, 2022 08:58 PM IST

Penny stock to consider bonus shares: పవర్ సెక్టార్ లో ఉన్న స్మాల్ క్యాప్ కంపెనీ ఒకటి 3:10 బోనస్ షేర్లను ఇవ్వాలని భావిస్తోంది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించగానే, సంస్థ షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Penny stock to consider bonus shares: వీర్ ఎనర్జీ ఇన్ ఫ్రాస్టక్చర్ లిమిటెడ్ సంస్థ పవర్ సెక్టార్ లో ఉంది. మార్కెట్ వాల్యూ రూ. 25.03 కోట్లు ఉన్న స్మాల్ క్యాప్ కంపెనీ. భారత్ లో రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో మార్కెట్ లీడర్ ఈ సంస్థనే.

Penny stock to consider bonus shares: బోనస్ షేర్ల ప్రకటన

షేర్ హోల్డర్లకు బోనస్ షేర్లను ఇచ్చే అంశం చర్చల్లో ఉందని, డిసెంబర్ 1న జరిగే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని సంస్థ బుధవారం ప్రకటించింది. 3:10 ప్రాతిపదికన బోనస్ షేర్ల కేటాయింపు ఉంటుందని వెల్లడించింది. అంటే, ప్రస్తుతం షేర్ హోల్డర్ల వద్ద ఉన్న రూ. 10 ముఖ విలువ కలిగిన ప్రతీ 10 షేర్లకు రూ. 10ముఖ విలువ కలిగిన 3 షేర్లను బోనస్ గా ఇవ్వనున్నట్లు, ఈ బోనస్ షేర్ల చెల్లింపునకు రికార్డ్ డేట్ నవంబర్ 25 అని సెబీకి అందించిన వివరాల్లో వీర్ ఎనర్జీ ఇన్ ఫ్రాస్టక్చర్ లిమిటెడ్ తెలిపింది.

Penny stock to consider bonus shares: కుప్పకూలిన షేర్ విలువ

సంస్థ నుంచి ఈ ప్రకటన వెలువడిన వెంటనే వీర్ ఎనర్జీ ఇన్ ఫ్రాస్టక్చర్ లిమిటెడ్ షేరు ధర ఒక్కసారిగా పడిపోయింది. రూ. 24.15 నుంచి, రూ. 21.75 కి పడిపోయింది. ఒక్క రోజులోనే 9 శాతానికి పైగా షేరు వాల్యూ పడిపోయింది. బుధవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 5,83,163 షేర్ల ట్రేడింగ్ జరిగింది. ఈ వీర్ ఎనర్జీ ఇన్ ఫ్రాస్టక్చర్ లిమిటెడ్ షేరు విలువ 2004, జనవరి 15న రూ. 0.69 మాత్రమే. అంటే, ఈ 18 ఏళ్లలో షేరు విలువ దాదాపు 3000% పెరిగింది.

WhatsApp channel