OnePlus Pad launch : వన్​ప్లస్​ ‘ట్యాబ్లెట్​’.. లాంచ్​ డేట్​ ఇదేనా?-oneplus pad said to be in the works again tipped to launch next year ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Oneplus Pad Launch : వన్​ప్లస్​ ‘ట్యాబ్లెట్​’.. లాంచ్​ డేట్​ ఇదేనా?

OnePlus Pad launch : వన్​ప్లస్​ ‘ట్యాబ్లెట్​’.. లాంచ్​ డేట్​ ఇదేనా?

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 15, 2022 10:31 AM IST

OnePlus tablet launch date : వన్​ప్లస్ ట్యాబ్లెట్​ లాంచ్​కు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఓ టిప్​స్టర్​ చెప్పారు. ఆ వివరాలు..​

వన్​ప్లస్​ ట్యాబ్లెట్​ లాంచ్​ డేట్​ ఇదేనా?
వన్​ప్లస్​ ట్యాబ్లెట్​ లాంచ్​ డేట్​ ఇదేనా? (representative image)

OnePlus Pad launch date : ప్రముఖ ఎలక్ట్రానిక్​ పరికరాల తయారీ సంస్థ వన్​ప్లస్​.. ట్యాబ్లెట్​ సెగ్మెంట్​లోకి అడుగు పెట్టనుందని గత కొంత కాలంగా ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఈ విషయంపై వన్​ప్లస్​ ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ.. ట్యాబ్లెట్​పై స్మార్ట్​ఫోన్​ ప్రియుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. తాజాగా.. వన్​ప్లస్​ ట్యాబ్లెట్​కు సంబంధించి ఓ వార్త బయటకొచ్చింది. ఈ ట్యాబ్లెట్​ ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉందని, వచ్చే ఏడాది ఇది లాంచ్​ అవ్వొచ్చని సమాచారం.

లాంచ్​ డేట్​ ఇదేనా?

స్మార్ట్​ఫోన్స్​ నుంచి స్మార్ట్​ టీవీలు, వేరెబుల్స్​, ఆడియో ప్రాడక్ట్స్​ వరకు వివిధ సెగ్మెంట్​లో వన్​ప్లస్​ వ్యాపారం చేస్తోంది. ఇక వన్​ప్లస్​ ట్యాబ్లెట్​ గురించి దాదాపు ఏడాదిగా మార్కెట్​లో ఊహాగానాలు ఉన్నాయి. ఇది 2022 తొలి భాగంలో లాంచ్​ అవుతుందని అప్పట్లో వార్తలొచ్చాయి. కానీ అలా జరగలేదు. అనాధికారిక సమాచారం ప్రకారం.. 2023 జనవరిలో ఇది లాంచ్​ అవ్వనుంది!

OnePlus tablet launch in India : ఇక ఈ వన్​ప్లస్​ ట్యాబ్లెట్​పై ఇప్పుడు ఓ టిప్​స్టర్​ మాట్లాడారు.

"వన్​ప్లస్​ నుంచి ఓ ట్యాబ్లెట్​ వస్తోంది. ఇది డెవెలప్​మెంట్​ స్టేజ్​లో ఉంది. వచ్చే ఏడాది లాంచ్​కు సిద్ధమవుతోంది," అని టిప్​స్టర్​ మ్యాకస్​ జామ్​బోర్​ తెలిపారు.

రానున్న రోజుల్లో ఈ డివైజ్​పై మరింత అప్డేట్లు వచ్చే అవకాశం ఉంది.

చివరిసారిగా.. ఈ ఏడాది జులైలో వన్​ప్లస్​ ప్యాడ్​పై వార్తలొచ్చాయి. దీనికి 'వన్​ప్లస్​ రీవ్స్​' అనే పేరు పెట్టినట్టు ఓ టిప్​స్టర్​ పేర్కొన్నారు. ఇండియాలో ఇది టెస్టింగ్​ దశలో ఉన్నట్టు వివరించారు.

వన్​ప్లస్​ ట్యాబ్లెట్​ స్పెసిఫికేషన్​ ఇవే..

OnePlus tablet specifications : వన్​ప్లస్​ ట్యాబ్లెట్​కు సంబంధించి.. స్పెసిఫికేషన్లపైనా రూమర్స్​ వచ్చాయి. ఇందులో ఆండ్రాయిడ్​ 12ఎల్​ ఉంటుందని తెలుస్తోంది. 12.4 ఇంచ్​ ఫుల్​ హెచ్​డీ+ ఓఎల్​ఈడీ డిస్​ప్లే ఉండొచ్చు. క్వాల్కమ్​డ్రాగన్​ 86ఎస్​ఓసీతో పాటు ఈ డివైజ్​లో 6 జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్​​ ఉండే అవకాశం ఉంది.

వన్​ప్లస్​ ట్యాబ్లెట్​లో డ్యూయెల్​ రేర్​ కెమెరా సెటప్​ ఉండొచ్చు. అవి.. 13ఎంపీ మెయిన్​ కెమెరా, 5ఎంపీ సెకండరీ కెమెరాగా తెలుస్తోంది. సెల్ఫీ కోసం ఫ్రంట్​లో 8ఎంపీ కెమెరా ఉండొచ్చు. ఇందులో 10,900ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంటుందని, 45డబ్ల్యూ ఫాస్ట్​ ఛార్జింగ్​ సపోర్ట్​ చేస్తుందని టిప్స్​ వచ్చాయి.

OnePlus tablet price in India : ఎన్ని వార్తలు వస్తున్నా.. తొలి ట్యాబ్లెట్​ డివైజ్​పై మాత్రం వన్​ప్లస్​ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలదు. అయితే.. ఇది ఇండియాలో రూ. 34,500 ధరతో లాంచ్​ అవ్వొచ్చని తెలుస్తోంది.

WhatsApp channel

సంబంధిత కథనం