Telugu News  /  Business  /  Oneplus 11r 5g Launch Date In India Revealed By The Company Check Details Here
OnePlus 11R 5G: వన్‍ప్లస్ 11ఆర్ 5జీ లాంచ్ కూడా ఆరోజే.. ఫిక్స్ చేసిన కంపెనీ (Photo: OnePlus)
OnePlus 11R 5G: వన్‍ప్లస్ 11ఆర్ 5జీ లాంచ్ కూడా ఆరోజే.. ఫిక్స్ చేసిన కంపెనీ (Photo: OnePlus)

OnePlus 11R 5G: వన్‍ప్లస్ 11ఆర్ 5జీ లాంచ్ కూడా ఆరోజే.. ఫిక్స్ చేసిన కంపెనీ

26 January 2023, 11:54 ISTChatakonda Krishna Prakash
26 January 2023, 11:54 IST

OnePlus 11R 5G launch date: వన్‍ప్లస్ 11ఆర్ 5జీ లాంచ్ డేట్‍ ఖరారైంది. క్లౌడ్ 11 ఈవెంట్‍లోనే ఈ ఫోన్ కూడా అడుగుపెట్టనుంది.

OnePlus 11R 5G launch date: ఫిబ్రవరిలో వన్‍ప్లస్ (OnePlus) మెగా లాంచ్ ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్‍లో విడుదల చేసే ప్రొడక్టుల గురించి ఒక్కటిగా ఆ సంస్థ వెల్లడిస్తోంది. వన్‍ప్లస్ 11ఆర్ 5జీ (OnePlus 11R 5G) మొబైల్‍ను కూడా అదే ఈవెంట్‍ ద్వారా భారత్‍లో లాంచ్ చేయనున్నట్టు వన్‍ప్లస్ వెల్లడించింది. దీంతో ఫిబ్రవరి 7వ తేదీన జరిగే కార్యక్రమంలోనే వన్‍ప్లస్ 11ఆర్ 5జీ కూడా అడుగుపెట్టనుందని తెలిసిపోయింది. వన్‍ప్లస్ 11 5జీ, వన్‍ప్లస్ బడ్స్ ప్రో 2 టీడబ్ల్యూఎస్‍తో పాటు ఓ టీవీ, కీబోర్డు కూడా అదే రోజు విడుదల కానున్నాయి. వన్‍ప్లస్ 11ఆర్ 5జీ గురించిన వివరాలు ఇవే.

ట్రెండింగ్ వార్తలు

వన్‍ప్లస్ ఈవెంట్ వివరాలు

OnePlus Cloud 11 Launch Event: వన్‍ప్లస్ క్లౌడ్ 11 లాంచ్ ఈవెంట్ ఫిబ్రవరి 7వ తేదీన సాయంత్రం 7.30 గంటల నుంచి ఢిల్లీ జరగనుంది. ఈ ఈవెంట్‍లో వన్‍ప్లస్ 11 5జీ ఫ్లాగ్‍షిప్ మొబైల్, వన్‍ప్లస్ బడ్స్ ప్రో 2 టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్, వన్‍ప్లస్ తొలి కీబోర్డు, వన్‍ప్లస్ టీవీ 65 క్యూ2 ప్రో స్మార్ట్ టీవీ, వన్‍ప్లస్ 11ఆర్ 5జీ విడుదల కానున్నాయి. ఈ-కామర్స్ సైట్ అమెజాన్‍లో ఈ ప్రొడక్టులు అందుబాటులోకి వస్తాయి.

వన్‍ప్లస్ 11ఆర్ 5జీ వివరాలు

OnePlus 11R 5G: వన్‍ప్లస్ 11ఆర్ 5జీకి సంబంధించి కొన్ని స్పెసిఫికేషన్లు బయటికి వచ్చాయి. స్నాప్‍డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్‌తో ఈ ఫోన్ వస్తుందని తెలుస్తోంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండే 6.7 ఇంచుల ఫుల్ హెచ్‍డీ ప్లస్ అమోలెడ్ డిస్‍ప్లేను కలిగి ఉంటుందని సమాచారం. ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఆక్సిజన్ ఓఎస్13తో రావొచ్చు.

వన్‍ప్లస్ 11ఆర్ 5జీ వెనుక 50 మెగాపిక్సెల్ + 12 మెగాపిక్సెల్ + 2 మెగాపిక్సెల్ కెమెరాలు ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను వన్‍ప్లస్ పొందుపరచనుంది. ఈ ఫోన్‍లో 5000mAh బ్యాటరీ ఉండనుండగా.. 100వాట్ల ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది.

మరోవైపు, వన్‍ప్లస్ 11 5జీ పూర్తిస్థాయి ఫ్లాగ్‍షిప్ ఫోన్‍గా ఉండనుంది. స్నాప్‍డ్రాగన్ 8+ జెన్ 2 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. ప్రీమియమ్ డిస్‍ప్లే, ఫ్లాగ్ షిప్ కెమెరాలతో వస్తుంది. మరోవైపు వన్‍ప్లస్ 11 సిరీస్‍లో ప్రో మోడల్ గురించి ఆ సంస్థ ఇంత వరకు ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. ఈ సిరీస్‍లో ‘ప్రో’ వెర్షన్ ఉండకపోవచ్చన్న అంచనాలు వెలువడుతున్నాయి.