NMDC Q3 results: 55 శాతం తగ్గిన ఎన్ఎండీసీ లాభాలు; డివిడెండ్ ప్రకటించిన ‘నవరత్న’-navratna company nmdc declares dividend net profit falls 55 in q3 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Navratna Company Nmdc Declares Dividend, Net Profit Falls 55% In Q3

NMDC Q3 results: 55 శాతం తగ్గిన ఎన్ఎండీసీ లాభాలు; డివిడెండ్ ప్రకటించిన ‘నవరత్న’

HT Telugu Desk HT Telugu
Feb 14, 2023 09:54 PM IST

NMDC Q3 results: ప్రభుత్వ రంగ నవరత్న సంస్థల్లో ఒకటైన ఎన్ఎండీసీ (NMDC) ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం ఫలితాలను విడుదల చేసింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

NMDC Q3 results: నేషనల్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (National Mineral Development Corporation NMDC) భారత ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒకటి. ఈ నవరత్న కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం Q3 నిరాశజనక ఫలితాలను ప్రకటించింది.

NMDC Q3 results: రూ. 3.75 డివిడెండ్

Q3 ఫలితాలతో పాటు షేరు హోల్డర్లకు డివిడెండ్ ను కూడా NMDC ప్రకటించింది. రూ. 1 ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 3.75 డివిడెండ్ అందజేయనున్నట్లు మంగళవారం వెల్లడించింది. డివిడెండ్ చెల్లింపునకు రికార్డు డేట్ గా ఫిబ్రవరి 24ను ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో NMDC ప్రకటించిన తొలి డివిడెండ్ ఇది.

NMDC Q3 results: రూ. 3720 కోట్ల ఆదాయం

ఈ Q3 లో ఎన్ఎండీసీ (NMDC) ప్రధాన కార్యకలాపాల ద్వారా రూ. 3719.99 కోట్ల ఆదాయాన్ని సముపార్జించింది. గత ఆర్థిక సంవత్సరం Q3 లో ఎన్ఎండీసీ ఆదాయం రూ. 5,873.77 కోట్లు. అంటే, గత Q3 తో పోలిస్తే, ఈ Q3 లో ఎన్ఎండీసీ ఆదాయం సుమారు 36.66% తగ్గింది. ఈ Q3 (Q3FY23) లో ఎన్ఎండీసీ రూ. 903.89 కోట్ల నికర లాభాలను (net profit) ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం Q3 (Q3FY22) లో సంస్థ (NMDC) నికర లాభాలు రూ. 2,046.88 కోట్లు. అంటే, గత ఆర్థిక సంవత్సరం Q3 (Q3FY22) తో పోలిస్తే, ఈ ఆర్థిక సంవత్సరం Q3 (Q3FY23)లో ఎన్ఎండీసీ (NMDC) నికర లాభాలు 55% తగ్గాయి. ఈపీఎస్ (EPS) కూడా గత Q3 లో రూ. 6.99 ఉండగా, ఈ Q3 లో రూ. 3.11కి తగ్గింది. ప్రధానమైన ముడి ఇనుము బిజినెస్ (iron ore business) ద్వారా సంస్థకు (NMDC) ఈ Q3 లో రూ. 3,665.21 కోట్ల ఆదాయం సమకూరింది. గత Q3 లో అది రూ. 5,822.46 కోట్లు. Q3 ఫలితాల (NMDC Q3 results) నేపథ్యంలో ఎన్ఎండీసీ (NMDC) షేర్ విలువ ఎన్ఎస్ఈ (NSE) లో మంగళవారం 2.20% తగ్గి, రూ. 115.70 వద్ద ముగిసింది.

WhatsApp channel