Multibagger penny stock : ఏడాదిలో రూ. 1లక్షను రూ. 52లక్షలుగా మార్చిన స్టాక్​..!-multibagger penny stock turns 1 lakh to 52 lakh in one year give huge returns for investors
Telugu News  /  Business  /  Multibagger Penny Stock Turns 1 Lakh To 52 Lakh In One Year Give Huge Returns For Investors
ఏడాదిలో రూ. 1లక్షను రూ. 52లక్షలుగా చేసిన స్టాక్​..!
ఏడాదిలో రూ. 1లక్షను రూ. 52లక్షలుగా చేసిన స్టాక్​..! (PTI)

Multibagger penny stock : ఏడాదిలో రూ. 1లక్షను రూ. 52లక్షలుగా మార్చిన స్టాక్​..!

07 January 2023, 11:07 ISTChitturi Eswara Karthikeya Sharath
07 January 2023, 11:07 IST

Multibagger penny stock : కైజర్​ కార్పొరేషన్స్​ అనే స్టాక్​.. మదుపర్లకు మల్టీబ్యాగర్​ రిటర్నులు ఇచ్చింది. ఏడాది కాలంలో రూ. 1లక్షను ఏకంగా రూ. 52లక్షలుగా మార్చింది.

Multibagger penny stock : స్టాక్​ మార్కెట్​లో మల్టీబ్యాగర్​ స్టాక్స్​కు క్రేజ్​ విపరీతంగా ఉంటుంది. మల్టీబ్యాగర్​ స్టాక్స్​తో కనీవిని ఎరుగని రీతిలో రిటర్నులు వచ్చిచేరుతాయి. ముఖ్యంగా పెన్నీ స్టాక్స్​.. మల్టీబ్యాగర్​ రిటర్నులు ఇస్తే.. మదుపర్లకు ఇక పండుగే! ఇందులో రిస్క్​ బీభత్సంగా ఉన్నప్పటికీ.. కొందరు ఇన్​వెస్టర్​లు ధైర్యం చేసి పెట్టుబడులు పెడుతూ ఉంటారు. ఒక్కోసారి భారీ లాభాలే వస్తాయి. ఇటీవలి కాలంలో మదుపర్లకు మల్టీబ్యాగర్​ రిటర్నులు ఇచ్చిన స్టాక్స్​లో కైజర్​ కార్పొరేషన్స్​ ఒకటి. ఈ స్టాక్​.. ఏడాది కాలంలోనే 5,100శాతం పెరగడం విశేషం.

కైజర్​ కార్పొరేషన్స్​ షేరు ధర..

కైజర్​ కార్పొరేషన్స్ స్టాక్​ మార్కెట్​ క్యాపిటల్​ రూ. 275కోట్లు. 2021 నవంబర్​లో దీని ధర రూ. 1గా ఉండేది. ఇక శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ ముగిసే సమయానికి షేరు ధర రూ. 52.25కి చేరింది!

Kaiser Corporations share price : కాగా.. గత ఆరు నెలల్లో ఈ మల్టీబ్యాగర్​ పెన్నీ స్టాక్​.. అమ్మకాల ఒత్తిడికి గురైంది. వారం రోజుల్లో 3.50శాతం పతనమైంది. నెల రోజుల్లో ఈ స్మాల్​ క్యాప్​ కైజర్​ కార్పొరేషన్స్​ స్టాక్​ 9శాతం పడిపోయింది. ఆరు నెలల్లో ఏకంగా రూ. 98 నుంచి రూ. 52.25కి దిగొచ్చింది. అంటే ఆరు నెలల్లోనే 45శాతం పతనమైనట్టు.

అయితే.. 2022లో మాత్రం ఈ మల్టీబ్యాగర్​ కైజర్​ కార్పొరేషన్స్​ స్టాక్​ దుమ్మురేపింది! రూ. 3.50 నుంచి రూ.55కి పెరిగింది. అంటే 2,100శాతం పెరిగినట్టు. కానీ 2021 నవంబర్​ (రూ. 1) నుంచి 2023 జనవరి 6 (రూ. 52.25) వరకు చూస్తే.. ఈ స్టాక్​ 5,100శాతం రిటర్నులు ఇచ్చినట్టు అవుతుంది.

రూ .1 లక్ష= రూ. 52లక్షలు..

Kaiser Corporations stocks history : ఇక ఈ మల్టీబ్యాగర్​ కైజర్​ కార్పొరేషన్స్ స్టాక్​లో నెల ముందు రూ. 1లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే.. దాని విలువ రూ. 91,000గా ఉండేది. ఆరు నెలల క్రితం రూ. 1లక్ష పెట్టి ఉంటే.. దాని విలువ రూ. 55వేలుగా ఉండేది. కానీ 2021 చివర్లో రూ. 1లక్ష పెట్టి ఉంటే.. రూ. 22లక్షల రిటర్నులు వచ్చేవి. అయితే.. 2021 నవంబర్​లో రూ. 1లక్ష పెట్టుబడి పెట్టిన వారికి.. 2023 జనవరి 6 నాటికి.. రూ. 52లక్షలు లభించేవి.

చివరిగా..

Kaiser Corporations share price target : ఫండమెంటల్​గా స్ట్రాంగ్​గా ఉన్న స్టాక్స్​ను కొనుగోలు చేయగలిగితే.. దీర్ఘకాలంలో మంచి రిటర్నులు ఇస్తాయి. కానీ అసలు ఎందుకు పెరుగుతున్నాయో కూడా తెలియని స్టాక్స్​లో ఎంట్రీ ఇస్తే.. లాభాల మాట పక్కన పెడితే, పెట్టుబడి మొత్తమే కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు.. కంపెనీ బిజినెస్​, ఫండమెంటల్స్​ చూడాల్సిన అవసరం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పెన్నీ స్టాక్స్​ అంటే అత్యంత రిస్క్​తో కూడుకున్న వ్యవహారం అని చెబుతున్నారు.

సంబంధిత కథనం