Back To Office: ‘‘వర్క్ ఫ్రం హోం ఇక చాలు.. ఆఫీస్ లకు రావాల్సిందే..’’-major companies are calling employees back to office in 2023 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Major Companies Are Calling Employees Back To Office In 2023

Back To Office: ‘‘వర్క్ ఫ్రం హోం ఇక చాలు.. ఆఫీస్ లకు రావాల్సిందే..’’

HT Telugu Desk HT Telugu
Mar 17, 2023 11:44 AM IST

Back To Office: కొరోనా లాక్ డౌన్ సమయంలో ప్రారంభమై.. నేటికీ కొనసాగుతున్న ఇంటి దగ్గర నుంచే విధులు నిర్వహించే ‘ఫర్క్ ఫ్రం హోం’ విధానం నుంచి క్రమంగా కంపెనీలు వైదొలగుతున్నాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

No more work from home: ఇంటి దగ్గర నుంచే విధులు నిర్వహించే ‘ఫర్క్ ఫ్రం హోం (work from home)’ విధానంపై మొదట సానుకూలత వ్యక్తమైనప్పటికీ.. క్రమంగా ఆ విధానం దుష్ఫలితాలు బయటపడసాగాయి. ప్రొడక్టివ్ టైమ్ పెరుగుతుందని, సంస్థల నిర్వహణ ఖర్చులు తగ్గుతాయని వర్క్ ఫ్రం హోం (work from home) విధానంపై మొదట్లో సానుకూలత వ్యక్తమైంది. కానీ, వర్క్ ఫ్రం ఆఫీస్ (work from office) విధానమే సరైనదని, ఉద్యోగుల్లో క్రమశిక్షణ, టీమ్ వర్క్, ప్రొడక్టివిటీ ఆఫీస్ కు వచ్చి వర్క్ చేస్తేనే బావుంటాయని ఇప్పుడు మెజారిటీ కంపెనీల యాజమాన్యాలు భావిస్తున్నాయి. 2023 లో వర్క్ ఫ్రం ఆఫీస్ (work from office) కల్చర్ మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.

Back To Office culture: మేజర్ కంపెనీల వర్క్ ఫ్రం ఆఫీస్ బాట..

ప్రపంచవ్యాప్తంగా చాలా కంపెనీలు ఇప్పుడు ఉద్యోగులను కార్యాలయాలకు వచ్చి విధులు నిర్వర్తించాల్సిందిగా (work from office) కోరుతున్నాయి. తాజాగా, ఫేస్ బుక్, వాట్సాప్ ల యాజమాన్య సంస్థ మెటా కూడా తన ఉద్యోగులకు వర్క్ ఫ్రం ఆఫీస్ (work from office) ఆదేశాలను ఇచ్చింది. ఒకవైపు, భారీ లేఆఫ్ ప్రకటనలతో బెంబేలెత్తిస్తూ, మరోవైపు, ఉద్యోగులను కచ్చితంగా ఆఫీస్ లకే వచ్చి జాబ్ చేయాల్సిందిగా (work from office) మెటా ఆదేశిస్తోంది. సహోద్యోగులతో కలిసి పని చేయడం వల్ల ఉద్యోగంలో వృద్ధి చెందే అవకాశాలు మరింత మెరుగవుతాయని మెటా తన ఉద్యోగులకు చెబుతోంది.

No more work from home: ఆమెజాన్, వాల్ట్ డిస్నీ..

అమెరికా వ్యాప్తంగా ఆఫీసులకు వస్తున్న ఉద్యోగుల సంఖ్య 50% కన్నా తక్కువకు పడిపోయింది. మేజర్ టెక్నాలజీ కంపెనీలు, ఈ కామర్స్ దిగ్గజాలు ఇప్పుడు తమ ఉద్యోగులు ఆఫీస్ లకు వచ్చి విధులు నిర్వర్తించాలని (work from office) ఆదేశిస్తున్నాయి. ఇప్పటికే వాల్ట్ డిస్నీ, ఆమెజాన్, స్టార్ బక్స్ కార్పొరేషన్, యాపిల్, మోర్గాన్ స్టాన్లీ, జనరల్ మోటార్స్, వాల్ స్ట్రీట్ జర్నల్ .. మొదలైన కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం ఆఫీస్ (work from office) ఆదేశాలు ఇచ్చాయి.

WhatsApp channel