TCS work from home : వర్క్​ ఫ్రం హోం బంద్​.. టీసీఎస్​ ఉద్యోగులు ఇక ఆఫీసుకు!-tcs work from home ends employees to come to office thrice a week ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Tcs Work From Home Ends, Employees To Come To Office Thrice A Week

TCS work from home : వర్క్​ ఫ్రం హోం బంద్​.. టీసీఎస్​ ఉద్యోగులు ఇక ఆఫీసుకు!

Sharath Chitturi HT Telugu
Sep 23, 2022 01:12 PM IST

TCS work from home : ఉద్యోగులు ఆఫీసుకు రావాలని తేల్చిచెప్పింది టీసీఎస్​. ఈ మేరకు ఈమెయిల్స్​ని ఇప్పటికే పంపించింది.

వర్క్​ ఫ్రం హోం బంద్​.. టీసీఎస్​ ఉద్యోగులు ఇక ఆఫీసుకు!
వర్క్​ ఫ్రం హోం బంద్​.. టీసీఎస్​ ఉద్యోగులు ఇక ఆఫీసుకు! (MINT_PRINT)

TCS work from office news : దేశీయ దిగ్గజ ఐటీ సంస్థ టీసీఎస్​(టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్​).. ఇక 'వర్క్​ ఫ్రం హోం' కల్చర్​కు స్వస్తి చెప్పే పనిలో పడింది! ఈ నేపథ్యంలో టీసీఎస్​ ఉద్యోగులు.. వారానికి మూడు రోజులు కచ్చితంగా ఆఫీసుకు రావాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఉద్యోగులకు సంబంధిత ఈమెయిల్స్​ పంపించింది.

ట్రెండింగ్ వార్తలు

కరోనా మహమ్మారి కారణంగా రెండున్నరేళ్ల క్రితం.. అనేక ఐటీ సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్​ ఫ్రం హోం వెసులుబాటును కల్పించాయి. ఇక ఇప్పుడు ఆ కల్చర్​కు స్వస్తి చెబుతున్నాయి. ఈ జాబితాలోకి టీసీఎస్​ కూడా చేరింది.

TCS work from home : ‘ఆఫీసుకు వచ్చేయండి’

"వర్క్​ ఫ్రం ఆఫీస్​ కోసం మేనేజ్​మెంట్​ ఒక రోస్టర్​ను తయారు చేస్తుంది. అందురు దానికి తగ్గట్టుగా వారానికి మూడు రోజులు ఆఫీసుకు రావాల్సి ఉంటుంది. నిబంధనలు ఉల్లఘిస్తే.. చాలా తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి," అని ఉద్యోగులకు చేసిన మెయిల్​లో టీసీఎస్​ స్పష్టం చేసింది.

ఉద్యోగులను ఆఫీసులకు తీసుకొచ్చేందుకు సంస్థ చేపట్టిన ప్రణాళికల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నాము అని టీసీఎస్​ యాజమాన్యం వెల్లడించింది. దీనికి 25X25 మోడల్​ అని పేరు పెట్టింది. అంటే.. ఆఫీసుల్లో కనీసం 25శాతం జనాభా ఉండాలి. 2025నాటికి దీనిని అమలు చేసే యోచనలో దిగ్గజ ఐటీ సంస్థ ఉంది.

TCS work from office 2022 : అయితే.. ఆఫీసులకు తిరిగొచ్చే విషయంలో ఉద్యోగులకు టీసీఎస్​ ఇంకా ఎలాంటి డెడ్​లైన్​ ఇవ్వలేదు. కానీ సంబంధిత మేనజర్లను సంప్రదించాలని ఉద్యోగులకు సూచించింది.

ప్రాజెక్టు అవసరాలు, ఫ్రెషర్స్​- సీనియర్స్​ కలయికతో రోస్టర్​ను రూపొందించేందుకు టీసీఎస్​ ప్రణాళికలు రచించింది.

వర్క్​ ఫ్రం హోంకు అలవాటు పడిన ఉద్యోగులు.. వర్క్​ ఫ్రం ఆఫీసువైపు మొగ్గుచూపడం లేదు. ఈ నేపథ్యంలో కొందరు ఉద్యోగాలను కూడా విడిచిపెట్టేస్తున్నారు కానీ ఆఫీసుకు వెళ్లడం లేదు. వర్క్​ ఫ్రం హోం ఇచ్చే వేరే సంస్థలో చేరేందుకు ఇష్టపడుతున్నారు. ఫలితంగా ఐటీ రంగంలో ఆట్రిషన్​ రేటు విపరీతంగా పెరిపోయింది. రాజీనామాలు ఎక్కువగా ఉంటుండటం ఆందోళనకు గురిచేస్తున్న విషయం. ఇది సంస్థల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

TCS share price : టీసీఎస్​ షేర్లు డీలా..

టీసీఎస్​ షేర్లు ఏడాది కనిష్ఠంలో ట్రేడ్​ అవుతున్నాయి. శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో టీసీఎస్​.. 0.3శాతం నష్టపోయి 2,997 వద్ద కొనసాగుతోంది.

టీసీఎస్​తో పాటు ఐటీ రంగ షేర్లు గత కొంతకాలంగా నష్టాల్లోనే ఉంటున్నాయి.

IPL_Entry_Point

సంబంధిత కథనం