Lava Blaze 5G launched : చీపెస్ట్ 5జీ మొబైల్ వచ్చేసింది.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!-lava blaze 5g launched in india check price specifications sale ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Lava Blaze 5g Launched : చీపెస్ట్ 5జీ మొబైల్ వచ్చేసింది.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!

Lava Blaze 5G launched : చీపెస్ట్ 5జీ మొబైల్ వచ్చేసింది.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 07, 2022 07:03 PM IST

Lava Blaze 5G launched : లావా బ్లేజ్ 5జీ మొబైల్‍ అధికారికంగా లాంచ్ అయింది. భారత మార్కెట్‍లో ప్రస్తుతం ఇదే చౌకైన 5జీ స్మార్ట్ ఫోన్‍గా నిలువనుంది. ఈ మొబైల్ ధర, పూర్తి స్పెసిఫికేషన్లను చూడండి.

చీపెస్ట్ 5జీ మొబైల్ వచ్చేసింది.. ధర, స్పెసిఫికేషన్లు
చీపెస్ట్ 5జీ మొబైల్ వచ్చేసింది.. ధర, స్పెసిఫికేషన్లు (LAVA)

Lava Blaze 5G launched : దేశీయ మొబైల్ తయారీ సంస్థ లావా (Lava) నుంచి తక్కువ ధరలో 5జీ ఫోన్ లాంచ్ అయింది. లావా బ్లేజ్ 5జీ మొబైల్ ఎట్టకేలకు అధికారికంగా లాంచ్ అయింది. అక్టోబర్ లో జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ వేదికగా కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ లావా బ్లేజ్ 5జీని ఆవిష్కరించగా.. ఇప్పుడు మార్కెట్‍లోకి లావా విడుదల చేసింది. ధర పరంగా ప్రస్తుతం ఇండియాలో ఇదే చౌకైన 5జీ ఫోన్‍గా నిలువనుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, వర్చువల్ ర్యామ్ ఫీచర్లతో ఈ ఫోన్ వస్తోంది. లావా బ్లేజ్ 5జీ పూర్తి వివరాలు ఇవే.

Lava Blaze 5G Price : లావా బ్లేజ్ 5జీ ధర

లావా బ్లేజ్ 5జీ ఒకే వేరియంట్‍లో లాంచ్ అయింది. 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ ధర రూ.9,999గా ఉంది. దీన్ని ఇంట్రడక్టరీ ధరగా లావా పేర్కొంది. అయితే ఎంతకాలం ఈ ఇంట్రడక్టరీ ఆఫర్ ధర ఉంటుందో వెల్లడించలేదు. ఈ-కామర్స్ సైట్ అమెజాన్‍లో ఈ ఫోన్ సేల్‍కు వస్తుంది. సేల్ తేదీని లావా ఇంకా పేర్కొనలేదు. అయితే వారం వ్యవధిలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. గ్లాస్ బ్లూ, గ్లాస్ గ్రీన్ కలర్ ఆప్షన్‍లలో లావా బ్లేజ్ 5జీ మొబైల్ లభ్యమవుతుంది.

Lava Blaze 5G Specification : లావా బ్లేజ్ 5జీ స్పెసిఫికేషన్లు

లావా బ్లేజ్ 5జీ మొబైల్‍లో మీడియాటెక్ డైమన్సిటీ 700 ప్రాసెసర్ ఉంటుంది. 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్‍తో వస్తోంది. ఇంటర్నల్ స్టోరేజీని ఉపయోగించుకొని అదనంగా మరో 3జీబీ వరకు వర్చువల్‍గా ర్యామ్‍ను పొడిగించుకోవచ్చు. మైక్రో ఎస్‍డీ కార్డ్ స్లాట్ ఈ ఫోన్‍లో కూడా ఉంటుంది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‍పై రన్ అవుతుంది. 6.51 హెచ్‍డీ+ IPS LCD డిస్‍ప్లేను లావా బ్లేజ్ 5జీ కలిగి ఉంది. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 269పీపీఐ పిక్సెల్ డెన్సిటీ ఉంటుంది.

Lava Blaze 5G Cameras : లావా బ్లేజ్ 5జీ ఫోన్ వెనుక మూడు కెమెరాల అమరిక ఉంది. 50 మెగాపిక్సెల్ సామర్థ్యమున్న సెన్సార్ ప్రధాన కెెమెరాగా ఉంది. దీనికి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (EIS) సపోర్ట్ కూడా ఉంటుంది. మరో రెండు కెమెరాలు కూడా ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్‍ను 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను లావా ఇచ్చింది.

లావా బ్లేజ్ 5జీ ఫోన్‍లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఫుల్ చార్జ్‍పై 50 గంటల టాక్ టైమ్ ఇస్తుందని లావా పేర్కొంది. పవర్ బటన్‍కే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను లావా ఇచ్చింది. డ్యుయల్ సిమ్, 5జీ, 4జీ ఎల్‍టీఈ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్, 3.5ఎంఎం హెడ్‍ఫోన్ జాక్, యూఎస్‍బీ టైప్-సీ పోర్ట్ లావా బ్లేజ్ 5జీ కనెక్టివిటీ ఫీచర్లుగా ఉన్నాయి.

WhatsApp channel

సంబంధిత కథనం