Lava Agni 5G- Ready । లావా మొబైల్ యూజర్లకు ఇప్పుడు 5G సేవలు ప్రారంభం!-lava agni 5g smartphone users now can enjoy 5g services as company rolls out the update
Telugu News  /  Business  /  Lava Agni 5g Smartphone Users Now Can Enjoy 5g Services As Company Rolls Out The Update
Lava Agni 5G
Lava Agni 5G

Lava Agni 5G- Ready । లావా మొబైల్ యూజర్లకు ఇప్పుడు 5G సేవలు ప్రారంభం!

20 October 2022, 14:49 ISTHT Telugu Desk
20 October 2022, 14:49 IST

లావా మొబైల్ కంపెనీ ఇప్పుడు తమ Lava Agni 5G యూజర్ల కోసం 5G సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను విడుదల. ఈ సర్వీస్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.

భారతీయ కంపెనీ లావా తమ బ్రాండ్ లోని 5G స్మార్ట్‌ఫోన్‌ల కోసం తన కొత్త FOTA (ఫర్మ్‌వేర్ ఓవర్-ది-ఎయిర్) అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఈ అప్‌డేట్ 5G-సపోర్ట్ చేసే Lava స్మార్ట్‌ఫోన్‌లను కలిగి ఉన్న వినియోగదారులలు Airtel అలాగే Reliance Jio ద్వారా 5G నెట్‌వర్క్‌లను ఉపయోగించడానికి యాక్సెస్ కలిగిస్తుంది. యూజర్లు లావా స్మార్ట్‌ఫోన్‌ OTA సిస్టమ్ సెట్టింగ్‌లకు వెళ్లి 5G ఇన్‌స్టాల్ చేయవచ్చు.

Apple, Samsung, Motorola తర్వాత, తమ యూజర్లకు 5G సేవలను అందించడానికి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను విడుదల చేసిన జాబితాలో ఇప్పుడు లావా కూడా చేరింది. మీ స్మార్ట్‌ఫోన్‌లో 5G యాక్టివేషన్ ఎలా చేయవచ్చో, మీ స్మార్ట్‌ఫోన్‌ మోడల్ ఆధారంగా అనుసరించాల్సిన దశలను లింక్ క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.

ఇప్పటివరకూ లావా కంపెనీ ఒకేఒక 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది, అది Lava Agni 5G. ఈ హ్యాండ్‌సెట్ కలిగి ఉన్న వినియోగదారులందరూ తమ ఫోన్‌లో 5G నెట్‌వర్క్ పొందవచ్చు. అయితే లావా కంపెనీ తన ఫర్మ్‌వేర్ అప్‌డేట్‌ను దశల వారీగా చేస్తుంది. కాబట్టి వినియోగదారుడు నివసించే ప్రాంతాన్ని బట్టి కొందరికి ముందుగా, కొందరికీ ఆలస్యంగా 5G సేవలు అందుబాటులోకి రావచ్చు.

Lava Agni 5G స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయి? అలాగే దీని ధర తదితర వివరాలను మరోసారి పరిశీలించండి.

Lava Agni 5G స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 6.78 అంగుళాల FHD+ IPS LCD డిస్‌ప్లే
  • 8GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
  • మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్
  • వెనకవైపు 64MP +5MP+2MP+2MP క్వాడ్ కెమెరా సెటప్
  • ముందు భాగంలో 16 MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 11ఆపరేటింగ్ సిస్టమ్
  • 5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 30W ఛార్జర్

ధర రూ.16,999/-

ఇది ఫైరీ బ్లూ అనే ఏకైక కలర్ ఆప్షన్ లో లభిస్తుంది. లావా అధికారిక ఆన్‌లైన్ స్టోర్, అమెజాన్ నుండి కొనుగోలు చేయవచ్చు.

సంబంధిత కథనం