Lamborghini Urus Perfomante : ఇండియాలోకి లంబోర్ఘిని సూపర్ ఎస్​యూవీ​​.. ఈ నెలలోనే లాంచ్​!-lamborghini urus perfomante india launch date announced know full details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Lamborghini Urus Perfomante India Launch Date Announced Know Full Details Here

Lamborghini Urus Perfomante : ఇండియాలోకి లంబోర్ఘిని సూపర్ ఎస్​యూవీ​​.. ఈ నెలలోనే లాంచ్​!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 13, 2022 07:00 AM IST

Lamborghini Urus Perfomante India Launch Date : మరో సూపర్​ ఎస్​యూవీతో ఇండియాలోకి వస్తోంది లంబోర్ఘిని. Urus Perfomante ని ఈ నెలలోనే లాంచ్​ చేయనుంది. ధరతో పాటు మరిన్ని వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

లంబోర్ఘిని ఉరుస్
లంబోర్ఘిని ఉరుస్ (HT AUTO)

Lamborghini Urus Perfomante India Launch Date : Urus SUVతో ఆటో రంగాన్ని ఊపేసింది Lamborghini. ఇక ఇప్పుడు.. Lamborghini Urus Perfomante ని.. ఇండియాలో లాంచ్​ చేస్తున్నట్టు సంస్థ ప్రకటించింది. ఈ నెల 24ను లాంచ్​ డేట్​గా ఫిక్స్​ చేసింది.

ట్రెండింగ్ వార్తలు

Lamborghini Urus Perfomante.. ఆస్టన్​ డీబీఎక్స్​ 707, పార్షె కయెన్నె కూప్​ టర్బో జీటీ, మసెరాటి లెవంటె ట్రోఫియో వాహనాలకు గట్టి పోటీనిస్తుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి. బెంట్లే బెంటయ్గ, ఆడీ ఆర్​ఎస్​క్యూ8కి కూడా ఇది ప్రత్యర్థిగా నిలువనుంది.

ఈ Lamborghini Urus Perfomante.. హైప్​కి తగ్గట్టుగానే ఉంటుంది. అన్ని సెగ్మెంట్​లో ఓ అడుగు ముందే ఉంది. లైట్​వెయిట్​, ఎయిరోడైనమిక్​ డిజైన్​ దీని సొంతం. స్పెసిఫిక్​ డ్రైవ్​ మోడ్స్​తో దీని స్పోర్టీ డ్రైవింగ్​.. డైనమిక్​గా ఉంటుంది. ఇది 657 బీహెచ్​పీ జనరేట్​ చేస్తుంది. 2,300 ఆర్​పీఎం వద్ద 850 ఎన్​ఎం టార్క్​ను ఇది జనరేట్​ చేయగలదు. 0-100 కి.మీలకు కేవలం 3.3 సెకన్లలో చేరుకుంటుండటం విశేషం. దీని టాప్​ స్పీడ్​.. 306కేఎంపీహెచ్​గా ఉంది.

Lamborghini Urus Perfomante.. బానెట్​, బంపర్​ డిజైన్​లు.. Urus వర్షెన్​కు భిన్నంగా ఉంటాయి. బంపర్లను కార్బన్​ ఫైబర్​తో రూపొందించారు. బంపర్ల పొడవు 25ఎంఎంగా ఉంది. కొత్త ట్రిమ్​, ఎక్సాస్ట్​, కార్బన్​ ఫైబర్​ ఆప్షన్స్​ను కూడా ఇచ్చారు. ఇందులో 4.0 లీటర్​ ట్విన్​ టర్బో వీ8 ఇంజిన్​ ఉంటుంది. ఈ ఇంజిన్​ అత్యంత పవర్​ఫుల్​ అని తెలుస్తోంది. సాధారణ Urus కన్నా దీని బరువు లైట్​గా ఉంటుందని సమాచారం. బరువు తగ్గడంతో ఇంజిన్​ ప్రదర్శన మెరుగ్గా ఉండనుంది.

Lamborghini Urus Perfomante బరువు కూడా.. స్టాండర్డ్​ మోడల్స్​ కన్నా తక్కువగా ఉంటుంది. ఈ సూపర్​ కార్​ బరువు 2,150కేజీలు. ఇందులో ఎయిర్​ సస్పెన్షన్​ను పూర్తిగా మార్చేసింది ఆటో సంస్థ. అడాప్టివ్​ డాంపర్స్​, స్టీల్​ స్ప్రింగ్స్​ను జత చేసింది. ఫలితంగా రైడ్​ హైట్​ 20ఎంఎం తగ్గింది.

ఇక Lamborghini Urus Perfomante ఫొటోల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఇక Lamborghini Urus Perfomante price విషయానికొస్తే.. ఇండియాలో దీని ప్రారంభ ధర రూ. 5కోట్లుగా ఉండే అవకాశం ఉంది.

మరోవైపు Lamborghini Urus Sని అంతర్జాతీయ మార్కెట్​లో లాంచ్​ చేస్తున్నట్టు సంస్థ ప్రకటించింది. ఎంట్రీ లెవెల్​ ఎస్​యూవీ.. Lamborghini Urus Perfomante కిందకే వస్తుంది. ఇందులో 4.0 లీటర్​ ట్విన్​ టర్బో వీ8 ఇంజిన్​ ఉండనుంది.

Lamborghini Urus S గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్