JioCinema Plans: జియో సినిమా సబ్‍స్క్రిప్షన్ ప్లాన్స్ ధరలు లీక్! రూ.2 నుంచి..-jiocinema subscription plans could start 2 rupees per day gold platinum plans details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Jiocinema Plans: జియో సినిమా సబ్‍స్క్రిప్షన్ ప్లాన్స్ ధరలు లీక్! రూ.2 నుంచి..

JioCinema Plans: జియో సినిమా సబ్‍స్క్రిప్షన్ ప్లాన్స్ ధరలు లీక్! రూ.2 నుంచి..

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 24, 2023 07:56 PM IST

JioCinema Subscription Plans: జియో సినిమా త్వరలో సబ్‍స్క్రిప్షన్ ప్లాన్‍లను తీసుకురానుంది. అయితే, ఈ ప్లాన్‍లకు సంబంధించి ధరల వివరాలు తాజాగా లీకయ్యాయి.

JioCinema Plans: జియో సినిమా సబ్‍స్క్రిప్షన్ ప్లాన్స్ ధరలు లీక్! రూ.2 నుంచి..
JioCinema Plans: జియో సినిమా సబ్‍స్క్రిప్షన్ ప్లాన్స్ ధరలు లీక్! రూ.2 నుంచి..

JioCinema Subscription Plans: ప్రస్తుతం జియో సినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఉచితంగా ఉంది. ప్రముఖ క్రికెట్ టోర్నీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మ్యాచ్‍లు కూడా జియో సినిమా(JioCinema)లో ఉచితంగా లైవ్ స్ట్రీమ్ అవుతున్నాయి. అయితే, ఐపీఎల్ ముగిసిన జియోసినిమా ఇక పూర్తిగా ఉచితం కాదని ఇప్పటికే ఖరారైంది. ఆ ప్లాట్‍ఫామ్ పెయిడ్ ప్రీమియమ్ ప్లాన్‍(JioCinema Premium Plans)లను తీసుకురానుంది. అలాగే, జియో సినిమా త్వరలో జియోవూట్‍(JioVoot)గా మారే ఛాన్స్ ఉంది. ముకేశ్ అంబానీకి చెందిన వయాకామ్ 18 (Viacom 18) సంస్థ పరిధిలోని స్ట్రీమింగ్ ప్లాట్‍ఫామ్‍గా జియోసినిమా ఉంది. కాగా, జియో సినిమా త్వరలో తీసుకురానున్న ప్రీమియమ్ సబ్‍స్క్రిప్షన్ ప్లాన్‍ల ధరలు అంటూ తాజాగా సమాచారం లీక్ అయ్యాయి. మూడు ప్రీమియమ్ ప్లాన్‍లను జియో సినిమా అందుబాటులోకి తేనుందని దీని ద్వారా తెలుస్తోంది. ఆ ప్లాన్‍ల ధరలు వివరాలు ఇవే.

మూడు ప్లాన్‍లు..!

JioCinema Subscription Plans: జియో సినిమా మూడు ప్రీమియమ్ సబ్‍స్క్రిప్షన్ ప్లాన్‍లను ముందుగా తీసుకురానుందని ఓ రెడిట్ పోస్టు ద్వారా లీకైంది. జియోసినిమా రూ.2 డైలీ ప్లాన్ ఉండనుంది. ఈ ప్లాన్ ద్వారా ఒక రోజు సబ్‍స్క్రిప్షన్ లభిస్తుంది. రూ.99 గోల్డ్ సబ్‍స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుంటే 3 నెలల జియో సినిమా సబ్‍స్క్రిప్షన్ దక్కుతుంది. రెండు డివైజ్‍లకు ఈ ప్లాన్ సపోర్ట్ చేస్తుంది. ఈ ప్లాన్ సాధారణ ధర రూ.299 కాగా 67 శాతం డిస్కౌంట్‍తో రూ.99కు అందిస్తున్నట్టు లీకైన స్క్రీన్ షాట్‍లో ఉంది.

JioCinema Subscription Plans: ప్లాటినమ్ పేరుతో జియో సినిమా రూ.599 సబ్‍స్క్రిప్షన్ ప్లాన్ ఉండనుందని తెలుస్తోంది. ఈ ప్లాన్ తీసుకుంటే 12 నెలల సబ్‍స్క్రిప్షన్ లభిస్తుంది. 4 డివైజ్‍లకు సపోర్ట్ చేస్తుంది. ఈ ప్లాన్ సాధారణ ధర రూ.1,199 కాగా 50 శాతం డిస్కౌంట్‍తో ఆరంభంలో రూ.599కే ఉంటుందని లీకైన సమాచారం ద్వారా తెలుస్తోంది.

ఇక, ఈ ప్లాన్‍లలో ఏది తీసుకున్నా ప్లాట్‍ఫామ్‍లో ఉన్న కంటెంట్‍ను 4కే వరకు క్వాలిటీలో యూజర్లు చూడవచ్చు. సపోర్ట్ చేసే ఏ డివైజ్‍లో అయినా వాడుకోవచ్చు.

Jio Cinema
Jio Cinema

JioCinema Subscription Plans: అయితే, ఈ సబ్‍స్క్రిప్షన్ ప్లాన్‍ల వివరాలు జియో సినిమా కొత్త టెస్టింగ్ వెబ్‍సైట్ ద్వారా లీకయ్యాయి. ఈ ప్లాన్‍ల గురించి వయాకామ్18 ఇంకా అధికారిక ప్రకటన వెల్లడించలేదు. మరి, యూజర్లకు అందుబాటులోకి తెచ్చే వరకు ఈ ప్లాన్‍లను జియో సినిమా ఇలానే ఉంచుతుందా.. ఏమైనా మార్పులు చేస్తుందా అన్నది చూడాలి.

జియో సినిమా సబ్‍స్క్రిప్షన్‍ ప్లాన్‍ల కోసం పేమెంట్ చేసేందుకు యూజర్లకు యూపీఐ ఆప్షన్ కూడా ఉంటుందని తెలుస్తోంది. వయాకామ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్‍కు ఈ పేమెంట్స్ వెళతాయి. యాప్ నుంచి యూజర్ నేరుగా సబ్‍స్క్రిప్షన్ తీసుకోవచ్చు. కాగా, త్వరలో జియో సినిమా.. జియోవూట్‍గా రీబ్రాండ్ కానుందని తెలుస్తోంది.

WhatsApp channel

టాపిక్