How to take care of car in Winter : శీతాకాలం వచ్చేసింది.. మరి మీ కారు భద్రంగానే ఉందా?-how to take care of your car in winter season all the details you need to know ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  How To Take Care Of Your Car In Winter Season, All The Details You Need To Know

How to take care of car in Winter : శీతాకాలం వచ్చేసింది.. మరి మీ కారు భద్రంగానే ఉందా?

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Dec 04, 2022 10:48 AM IST

How to take care of car in Winter season : పండుగ సీజన్​లో కొత్తగా కారు తీసుకున్నారా? శీతాకాలంలో వాహనాలను అత్యంత జాగ్రత్తగా, భద్రంగా చూసుకోవాలి. లేకపోతే అవి తొందరగా పాడైపోయే ప్రమాదం ఉంది. చలి కాలంలో కారును ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాము.

శీతాకాలం వచ్చేసింది.. మరి మీ కారు భద్రంగానే ఉందా?
శీతాకాలం వచ్చేసింది.. మరి మీ కారు భద్రంగానే ఉందా?

How to take care of car in Winter season : శీతాకాలం వచ్చేసింది. అందరు.. స్వెట్టర్లు, దుప్పట్లలో దూరిపోతున్నారు. చర్మం కోసం ప్రత్యేక లోషన్లు వాడుతున్నారు. ఈ సమయంలో.. శరీరానికి కేర్​ తీసుకుంటున్నట్టుగానే.. మన కారును కూడా కాపాడుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇయర్​ ఎండ్​లో చాలా మంది రోడ్​ ట్రిప్స్​ ప్లాన్​ చేస్తూ ఉంటారు. సరైన సమయంలో వాహనం పనిచేయకపోతే కష్టమే. మరి.. శీతాకాలంలో వాహనాలను జాగ్రత్తగా, భద్రంగా ఎలా చూసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాము.

ట్రెండింగ్ వార్తలు

కారు లైట్లను చూడాలి..

శీతాకాలంలో సూర్యాస్తమం తొందరగా జరిగిపోతుంది. అంటే.. వెలుతురు తక్కువగా ఉంటుందని అర్థం. ఫలితంగా వాహనాల లైట్లు ఎక్కువగా వాడాల్సి ఉంటుంది. అందుకే.. కారుకు ఉన్న హెడ్​ల్యాంప్స్​, టెయిల్​లైట్స్​, టర్న్​ ఇండికేటర్స్​, రివర్స్​ హెడ్​ల్యాంప్స్​ని ఎప్పటికప్పుడు చెక్​ చేస్తూ ఉండాలి. అవి సరిగ్గా పనిచేయకపోతే.. వెంటనే మార్చాల్సి ఉంటుంది.

ఇంజిన్​ ఆయిల్​ను రీఫిల్​ చేయాలి..

How to change engine oil of a car : ఇంజిన్​ ఆయిల్​ లేదా కూలెంట్​ను తరచూ మార్చాల్సి ఉంటుంది. ముఖ్యంగా శీతాకాలం మొదలైనప్పుడే వాటిని మార్పించేయాలి. శీతాకాలం వాతావరణానికి తగ్గట్టుగా, లైట్​గా ఉండే ఇంజిన్​ ఆయిల్​ను వినియోగించడం శ్రేయస్కరం. ఎలాంటి ఇంజిన్​ ఆయిల్​ను ఉపయోగించాలనేది కారు మేన్యువల్​లో ఉంటుంది.

బ్యాటరీ కూడా ముఖ్యమే..!

శీతాకాలంలో ఎక్కువగా దెబ్బతినేది కారు బ్యాటరీనే! వేసవితో పోల్చుకుంటే.. చలి కాలంలో బ్యాటరీ సామర్థ్యం పడిపోతుంది. బ్యాటరీ వీక్​గా ఉన్నా.. వేసవిలో ఇబ్బందులు రాకపోవచ్చు కానీ చలి కాలంలో మాత్రం బండి ముందుకు కూడా కదలలేని పరిస్థితులు వస్తాయి. అందుకే.. జర్నీని మొదలుపెట్టే ముందే కారు బ్యాటరీని చెక్​ చేయాల్సి ఉంటుంది. బ్యాటరీ మొత్తానికే పాడైపోతే.. దానిని వెంటనే రిప్లేస్​ చేయడం ఉత్తమం. లేకపోతే.. రోడ్డు మీద ఆగిపోయే ప్రమాదం ఉంటుంది!

విండ్​షీల్డ్​.. వైపర్లు- పనిచేస్తున్నాయా?

Car safety tips for winter season : విండ్​షీల్డ్​ అనేది వాహనంలోని ఇంటీగ్రల్​ పార్ట్​. క్యాబిల్​లోకి గాలి, వర్షం, మంచు, ఫాగ్​ రాకుండా ఇది చూసుకుంటుంది. విండ్​షీల్డ్​కు ఎలాంటి క్రాక్స్​ ఉండకూడదు. ముఖ్యంగా శీతాకాలంలో.. ఇంకా ఇబ్బందులు వస్తాయి. ఫలితంగా డ్రైవర్​కు కష్టమైపోతుంది. క్లైమేట్​ కంట్రోల్​ సిస్టెమ్​, డీఫారెస్టేషన్​ వంటి వాటితో పరిస్థితని అదుపుచేయవచ్చు. కానీ.. విండ్​షీల్డ్​ అనేది సరిగ్గా ఉండటం చాలా ముఖ్యం. అదే సమయంలో విండ్​షీల్డ్​ వైపర్లు కూడా కీలకమే. ప్రతికూల వాతావరణాంలో అవి ఎక్కువ కాలం పనిచేయలేవు. ఫలితంగా.. వైపర్లలో పగుళ్లు ఏమైనా వచ్చాయా? అన్నవి చూడాలి. ఒకవేళ వస్తే.. వాటిని రిప్లేస్​ చేయాల్సి ఉంటుంది.

బ్రేక్స్​.. టైర్స్​.. భద్రమేనా?

ఎలాంటి పరిస్థితుల్లోనైనా.. బ్రేక్స్​ అనేవి చాలా ముఖ్యం. బ్రేక్స్​ సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అని కచ్చితంగా చెక్​ చేయాలి. వేర్​ అండ్​ టేర్​ కోసం బ్రేక్​ ప్యాడ్స్​, డిస్క్​లను తరచూ చెక్​ చేస్తూ ఉండాలి. టైర్లు కూడా మంచి కండీషన్​లో ఉండాలి. వాటి జాగ్రత్తలు తరచూ చూస్తుండాలి. మంచు ప్రదేశాల్లో గ్రిప్​ను పొందే విధంగా ఆ టైర్లు ఉన్నాయా లేవా అని చూడాలి. అవి సరిగ్గా లేకపోతే మార్చాలి.

WhatsApp channel

సంబంధిత కథనం