GST Council: జీఎస్టీ పెండింగ్ బకాయిల చెల్లింపుపై ఆర్థిక మంత్రి కీలక ప్రకటన-gst council pending gst compensation of rs 16 982 cr for june will be cleared ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Gst Council: Pending Gst Compensation Of <Span Class='webrupee'>₹</span>16,982 Cr For June Will Be Cleared

GST Council: జీఎస్టీ పెండింగ్ బకాయిల చెల్లింపుపై ఆర్థిక మంత్రి కీలక ప్రకటన

HT Telugu Desk HT Telugu
Feb 18, 2023 07:48 PM IST

GST Council: రాష్ట్రాలకు చెల్లించాల్సిన జూన్ నెల జీఎస్టీ (GST) పరిహారం మొత్తం రూ. 16,982 కోట్లను త్వరలోనే చెల్లిస్తామని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Union Finance Minister Nirmala Sitharaman) ప్రకటించారు.

Union finance minister Nirmala Sitharaman (File Photo)
Union finance minister Nirmala Sitharaman (File Photo) (HT_PRINT)

GST Council: జీఎస్టీ కౌన్సిల్ (GST Council meeting) సమావేశం శనివారం జరిగింది. సమావేశం అనంతరం కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Union Finance Minister Nirmala Sitharaman) మీడియాకు వెల్లడించారు. రాష్ట్రాల పెండింగ్ జీఎస్టీ (GST) పరిహారాన్ని త్వరలో చెల్లిస్తామని వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు

GST compensation: మొత్తం పరిహారం చెల్లిస్తాం..

జీఎస్టీ (GST) పరిహారానికి సంబంధించిన మొత్తం పరిహారాన్ని చెల్లిస్తామని నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman) తెలిపారు. జూన్ నెలకు సంబంధించిన ఈ రూ. 16,982 కోట్లను చెల్లిస్తామన్నారు. ఇదే విషయాన్ని రాష్ట్రాలకు GST Council meeting లో స్పష్టం చేశామన్నారు. అయితే, కాంపన్సేషన్ ఫండ్ లో అంత మొత్తం ప్రస్తుతం అందుబాటులో లేదని, ఇతర మార్గాల ద్వారా ఆ మొత్తాన్ని సమకూరుస్తామని వివరించారు. తరువాత కంపెన్సేషన్ సెస్ ద్వారా ఆ మొత్తాన్ని మళ్లీ సమకూర్చుకుంటామన్నారు.

GST Reduction: వీటిపై జీఎస్టీ తగ్గింపు..

ద్రవీకృత బెల్లం (liquid jaggery -Raab) పై జీఎస్టీని 18% నుంచి సున్నా లేదా 5 శాతానికి తగ్గించాలని జీఎస్టీ కౌన్సిల్ సమావేశం లో (GST Council meeting) నిర్ణయించారు. ఒక వేళ ఆ ద్రవీకృత బెల్లం (liquid jaggery -Raab) లూజ్ గా అమ్మితే జీఎస్టీ జీరో ఉంటుందని, ప్యాకేజ్డగా, లేబిలింగ్ తో అమ్మితే 5% జీఎస్టీ (GST) ఉంటుందని నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman) వివరించారు. అలాగే, పెన్సిల్ షార్పెనర్స్ పై జీఎస్టీని 18% నుంచి 12 శాతానికి తగ్గించారు. డ్యురబుల్ కంటైనర్స్ పై అతికించే ట్యాగ్స్ ట్రాకింగ్ డివైజెస్ (tags tracking devices) లేదా డేటా లాగర్స్ (data loggers) పై జీఎస్టీ (GST) ని పూర్తిగా తొలగించారు. గతంలో వీటిపై 18% జీఎస్టీ ఉండేది. కోర్టులు, ట్రైబ్యునళ్లు అందించే సేవలపై రివర్స్ చార్జ్ మెకానిజం ద్వారా జీఎస్టీ (GST) ని విధించాలని నిర్ణయించారు.

GST form 9 filing: జీఎస్టీ ఫామ్ 9 ఫైలింగ్ లేట్ ఫీ

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency) నిర్వహించే ప్రవేశ పరీక్షలకు సంబంధించిన జీఎస్టీ (GST) కి కూడా మినహాయింపు ఇచ్చారు. 2023 నుంచి జీఎస్టీ ఫామ్ 9 సహా యాన్యువల్ రిటర్న్ లను ఫైల్ చేయడంలో జరిగే జాప్యంపై విధించే లేట్ ఫీజును హేతబద్ధం చేయాలని నిర్ణయించారు.

WhatsApp channel