Five Star Business Finance IPO: ఈ ఐపీఓ కు అప్లై చేయొచ్చా?-five star business finance ipo opens today gmp review other details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Five Star Business Finance Ipo Opens Today. Gmp, Review, Other Details

Five Star Business Finance IPO: ఈ ఐపీఓ కు అప్లై చేయొచ్చా?

HT Telugu Desk HT Telugu
Nov 09, 2022 10:19 PM IST

Five Star Business Finance IPO: ప్రముఖ బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ Five Star Business Finance ఐపీఓ(IPO) బుధవారం ప్రారంభమైంది. నవంబర్ 9 నుంచి నవంబర్ 11 వరకు మదుపర్లు ఈ ఐపీఓ కు దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (iStock)

Five Star Business Finance IPO: Five Star Business Finance భారత్ లోని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల్లో ఒకటి. ఇది దక్షిణ భారతదేశంలో ప్రముఖ బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ. చిన్న, సూక్ష్మ తరహా రుణాల రంగంలో దక్షిణ భారత్ లో ఇది మెరుగైన పొజిషన్ లో ఉంది. ఈ సంస్థ ఐపీఓ బుధవారం ప్రారంభమైంది. ఈ ఐపీఓ ద్వారా రూ. 1960 కోట్లను సమీకరించాలని సంస్థ భావిస్తోంది. ఐపీఓ ప్రారంభమైన తొలిరోజు ఈ షేరు GMP రూ. 12 కి చేరింది.

ట్రెండింగ్ వార్తలు

Five Star Business Finance IPO: నవంబర్ 9 నుంచి 11 వరకు

మదుపర్లు ఈ IPO కు నవంబర్ 9 నుంచి నవంబర్ 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది 100 per cent offer for sale (OFS) ఐపీఓ. ఈ IPO పూర్తి వివరాలు..

  • దరఖాస్తు తేదీలు: నవంబర్ 9 నుంచి నవంబర్ 11
  • ధరల శ్రేణి: రూ. 450 నుంచి రూ. 474
  • బిడ్డర్లు మొత్తం 13 లాట్ల వరకు అప్లై చేసుకోవచ్చు. ఒక్కో లాట్ లో 32 షేర్లు ఉంటాయి.
  • నవంబర్ 16న అలాట్ మెంట్ ప్రారంభమవుతుంది. ఈ ఐపీఓ అధికారిక రిజిస్ట్రార్ KFin Technologies Limited. నవంబర్ 18న షేర్లు డీమ్యాట్ అకౌంట్లో డిపాజిట్ అవుతాయి.
  • ఈ సంస్థ స్టాక్ మార్కెట్లో నవంబర్ 21న లిస్ట్ అయ్యే అవకాశముంది.
  • మెజారిటీ అనలిస్ట్ లు ఈ ఐపీఓకు బై(BUY) ఆప్షన్ ఇచ్చారు. లిస్టింగ్ గెయిన్స్ కోరుకునేవారితో పాటు, లాంగ్ టర్మ్ ప్రయోజనాలు కోరుకునేవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని సూచిస్తున్నారు.

WhatsApp channel